Sunday, April 28, 2024

భుజాలు తడుముకుంటున్న దొంగలు

తప్పక చదవండి
  • అక్రమార్కుల గుండెల్లో హడల్‌
  • నోటిఫికేషన్‌ వెనుక బడా నాయకుని హస్తం..?
  • మూలాలను పసిగడితే సూత్రధారులు బయటికి వస్తారు
  • శ్రీ అవంతిక కాంట్రాక్టర్స్‌, సర్చింగ్‌ ఎక్స్పర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటేడ్‌లు ఎవరివి
  • రిజిస్ట్రేషన్‌ల దొంగలు దొరికేనా
  • ఆదిశగా సింగరేణి విజిలెన్స్‌ విచారించేనా
  • యాజమాన్యం నోరు మెదుపుతుందా..

దొంగే దొంగ అన్నట్లు.. నిరుద్యోగులే టార్గెట్‌, సింగరేణిలో ఉద్యోగాల పేరుతో బడా మోసానికి తెర. రుద్రంపూర్‌ కేంద్రంగా దందా అంటూ ఆదాబ్‌ హైదరాబాద్‌ కొన్ని ఆధారాలతో గురువారం ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ కథనాన్ని చూసిన కొంతమంది మాకు సంబంధం లేదు అంటూ భుజాలు తడుముకుంటున్నారు. ఆదాబ్‌ ప్రచురించిన ఈ కథనంతో అక్రమార్కుల గుండెల్లో హడల్‌ మొదలైంది. ఈ నకిలీ నోటిఫికేషన్‌ వెనుక ఓబడా నాయకుని హస్తం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోది. మూలాలను పసిగడితే సూత్రధారులు ఎవరో బయటికి వస్తారు కదా. శ్రీఅవంతిక కాంట్రాక్టర్స్‌, సర్చింగ్‌ ఎక్స్పర్ట్స్‌ ప్రవేట్‌ లిమిటేడ్‌ ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్‌ అయి ఉన్నాయి. ఆదిశగా విచారణ జరిపితే దొంగలు దొరికేనా. సింగరేణి విజిలెన్స్‌ యాజమాన్యం ఆదిశగా ప్రయత్నించేనా. అసలు ఇప్పటి వరకు సింగరేణి యాజమాన్యం ఈ వ్యవహారంపై నోరెందుకు మెదపలేదు అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. వివిధ కార్మిక సంఘాలతోపాటు కార్మిక లోకం నుంచి ఓబడా నాయకుని హస్తం ఉండటం వల్లనే ఈవ్యవహారాన్ని మరుగున పడేస్తున్నారు అన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. సింగరేణి సంస్థకు సంబంధించిన కాంట్రాక్ట్‌ ఉద్యోగాల పేరుతో నోటిఫికేషన్‌ శ్రీఅవంతిక కాంట్రాక్టర్స్‌, సెర్చింగ్‌ ఎక్స్పర్ట్‌ప్రవేట్‌ లిమిటేడ్‌ పేరుతో గత కొన్ని రోజులుగా కొంతమంది నిరుద్యోగ యువకులను టార్గెట్‌ చేసి మోసానికి పాల్పడుతున్నారు. రూ.58వేల వేతనం నుంచి మొదలు రూ.28వేల వేతనం వరకు ఇంజనీరింగ్‌ చేసిన వ్యక్తులతోపాటు లేబర్‌, జనరల్‌ మజ్ధూర్ల పేరుతో నకిలీ నోటిఫికేషన్ను విడుదల చేసి పెద్ద ఎత్తున డబ్బులు దండుకుంటున్నారు. ఈవిషయాన్ని పసిగట్టిన ఆదాబ్‌ హైదరాబాద్‌ కొన్ని కీలక ఆధారాలతో గురు వారం నిరుద్యోగులే టార్గెట్‌ అంటూ ప్రత్యేక కథనాన్ని ప్రచు రించింది.ఈకథనంతో అక్రమార్కులు భుజాలు తడుము కుంటున్నారు. ఈనోటిఫికేషన్‌ వెనుక ఓపెద్ద నాయకుని హస్తం ఉన్నట్లు ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అయితే శ్రీఅవంతిక కాంట్రాక్టర్స్‌, సెర్చింగ్‌ ఎక్స్పర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటేడ్‌లు ఎవరి పేరుపై రిజిస్ట్రేషన్‌ అయి ఉన్నాయో ఆకోణంలో విచారిస్తే అసలు దొంగలు దొరుకుతారని పలువురు అభి ప్రాయపడుతు న్నారు. ఆదిశగా సింగరేణి విజిలెన్స్‌ శాఖతోపాటు సింగరేణి యాజమాన్యం విచారించి దొంగలను దొరక పడుతుందా లేక ఆబడా నాయకుడు చెప్పినట్లు నడుత కుంటుందా అన్న అను మానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
సింగరేణి గనులతోపాటు ఓపెన్‌కాస్ట్‌లో డిపార్టు మెంట్లు ఇతర కార్యాలయాల్లో చిన్న తప్పు చేసిన కార్మికులను రాచి రంపాన పెట్టడంతో పాటు చార్జ్‌ షీట్లు ఇవ్వడం విచారణ పేరుతో కాలయాపన చేయడం ఇంకా అనేక విధాలుగా విధించే యాజమాన్యం అసలు ఇంత పెద్ద మోసానికి పాల్పడుతున్న వ్యక్తులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. విజిలెన్స్‌ శాఖ సైతం ఈ విషయాన్ని పట్టంచుకోకపోవడం వెనుక పెద్ద మతలబె ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికైనా పోలీసులకు ఫిర్యాదు చేసి సింగరేణి యాజమాన్యం పేరుతో నిరుద్యోగ యువకులను మోసం చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకునేందుకు ఉపక్రబమిస్తుందో లేదో వేచి చూద్ధాం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు