Sunday, April 28, 2024

పేరుకే మండలం.. వసతులు శూన్యం..

తప్పక చదవండి
  • ఆరేళ్లుగా అవస్థలు..అడవిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
  • పశు వైద్యశాల ‘నీ’ అడ్రస్‌ ఎక్కడ..

కొత్తగా ఏర్పడిన మూడు చింతలపల్లి మండలం సమస్యల నిలయంగా మారింది. ప్రజలకు అధికారులు చేరువలో ఉండాలని పాలనా సౌలభ్యం ఉండాలని గత ప్రభుత్వం కొత్త మండలాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే మూడు చింతలపల్లిని మండల కేంద్రంగా ఏర్పాటు చేసి దాదాపు ఆరేళ్లు కావస్తున్న వసతులు మాత్రం కరువయ్యాయి. ఇప్పటివరకు పూర్తిస్థాయి మౌనిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం విఫలమైందని ప్రజలు ఆరోపిస్తున్నారు. మండలాన్ని ఏర్పాటు చేసిన సమయంలో తహసిల్దార్‌, మండల పరిషత్‌ కార్యాలయాలను ప్రభుత్వం అద్దె భవనాల్లోనే ప్రారంభించి చేతులు దులుపుకుంది దీంతో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు.

అడవిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం..
మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 05-10-2023లో ఎన్నికల కోడ్‌ వస్తుందని మాజీ మంత్రి మల్లారెడ్డి హడావుడిగా ప్రహరీ గోడ నిర్మించకుండానే ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రా న్ని గ్రామ శివారులో అటవీ ప్రాంతానికి సమీపంలో నిర్మించారు. అటవీ ప్రాంతంలో ఉన్న ఈ ఆరోగ్య కేంద్రానికి చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడంతో రాత్రి వేళలో మహిళ డాక్టర్లు తమ విధులు నిర్వహించాలంటే భయ పడుతున్నారు. అటవీ ప్రాంతం కావడంతో ఈ ప్రాంతం తాగుబోతులకు అడ్డ గా మారండి అంతేకాకుండా ఈ ఆరోగ్య కేంద్రానికి రవాణా సౌకర్యం కూడా లేదు. రోగులు ఎలాగో ఆలాగో కేంద్రానికి వచ్చిన అక్కడ డాక్టర్లు ఉంటారన్న నమ్మకం లేకుండా పోయింది. అందుకే ప్రజలు ఎక్కువగా ప్రైవేట్‌ హాస్పిటల్‌ పైపు మొగ్గు చూపుతున్నారు.

- Advertisement -

వేప చెట్టే బస్టాండ్‌..
పేరుకే మండలం కానీ స‌రియైన బస్‌ స్టాప్‌ మాత్రం లేదు మండలంలోని చుట్టుప్రకాల గ్రామాల నుండి ప్రజలు లక్ష్మాపూర్‌, మండల కేంద్రమైన మూడు చింతలపల్లి మీదుగా నిత్యం వందలాది మంది హైదరాబాద్‌ కు ప్రయాణం కొనసాగిస్తుంటారు. కానీ వారు బస్‌ కోసం వేచి ఉండడానికి స‌రియైన బస్‌ స్టాప్‌ లేదు. ఎండాకాలం , వర్షాకాలంలో చెట్టు కింద, షాపుల ముందు నిలబడాలవలసి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గతంలో ఇక్కడ బస్టాప్‌ ఉండే కానీ ఆ స్థలంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించడంతో బస్‌ స్టాప్‌ కు స్థలం లేకుండా పోయింది. ఇలా ఒకటి కాదు చాలా సమస్యలు మండలంలో నెలకొన్నాయి.

పశు వైద్యశాల ‘నీ’ అడ్రస్‌ ఎక్కడ..
మండలంలోని చుట్టుప్రక్కల గ్రామాలలో మూగజీవాల సంఖ్య అధిక మొత్తంలో ఉండడంతో సరైన పశువైద్యం అందడం లేదు. మండల కేంద్రంలో పశు వైద్యశాలను గత ప్రభుత్వం నిర్మించిన గుర్తింపు లేకుండా పోయింది మండలంలో పశువైద్యశాలను ఇండ్ల మధ్య నిర్మించడంతో చాలామంది పశువైద్యశాల లేదు అని అనుకుంటున్నారు. కనీసం సూచిక బోర్డు కూడా నిర్మించలేదు . అసలు పశు వైద్యశాలను నిర్మించారా.. నిర్మిస్తే ఎక్కడ ఉంది అని చాలామంది మదిలో ఇదే ప్రశ్న.. మాజీ సీఎం కేసీఆర్‌ గతంలో నూతనంగా ఏర్పాటైన మూడు చింతలపల్లి మండలం ప్రభుత్వ కార్యాలయ భవనాలు అన్ని లక్ష్మాపూర్‌ మూడు చింతలపల్లి గ్రామాల మధ్య 5 ఎకరాలలో నిర్మించాలని ఆదేశాలు జారీ చేశారు. వీటికి సంబంధించి భారీ నిధులు కూడా మంజూరు చేశారు కానీ పనులు మాత్రం ఇంతవరకు కావడం లేదు అని ప్రజల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు