Saturday, May 4, 2024

బహుజనవాదానికి జై అంటున్న ఈరపట్నం ఓటర్లు..!

తప్పక చదవండి
  • బీసీ, మహిళల వికాసమే ఎజెండాగా కదులుతున్న కమలం పార్టీ..
  • బీసీ అభ్యర్థిని ప్రకటించిన బిజెపి పార్టీ..
  • కలవర పడుతున్న బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌..
  • గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న బిజెపి కేంద్ర పార్టీ..
  • మహిళా ఓట్ల మచ్చికతో బీజేపీ గెలుపు ఖాయమేనా..!
  • అందివచ్చిన అవకాశాన్ని బీజేపీ అందుకోనుందా..?
  • కీలకం కానున్న టీడీపీ క్యాడర్‌ ఓట్లు…

రంగారెడ్డి : రాష్ట్రంలో జరుగుతున్న రసవత్తర ఎన్నికల పోరులో బీసీలకు, మహిళలకు పెద్దపీట వేస్తూ.. భారతీయ జనతా పార్టీ ఓటర్ల మన్ననలు చూర గొంటుందని పలువురు విశ్లేషకులు తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అభ్యర్థిగా వెనుక బడిన వర్గాల కులాలకు చెందిన అభ్యర్థికి భాజపా టికెట్‌ కేటా యించి అధికార బిఆర్‌ఎస్‌కు, విపక్ష కాంగ్రెస్‌కు గట్టి షాక్‌ ఇచ్చి ందని చెప్పుకోవచ్చు. ఇంతకు మునుపు జరిగిన పలు అసెంబ్లీ, ఇతర ఎన్నికలలో నియోజకవర్గ ప్రజలు బహుజనవా దానికి జై కొట్టినట్టుగా తేట తెల్లం అవుతుంది. చివరిసారి 2018 సాధారణ ఎన్నికలలో బహుజన పార్టీ నుండి పోటీ చేసిన అభ్యర్థి కొద్ది తేడాతో ఓడిపోవడం ఇందుకు బలాన్ని ఇస్తుంది. ఎలా చూసినా ఈ నియోజకవర్గంలో ఓటర్లు బహుజన వాదానికి మద్దతుగా ఉన్నారని చెప్పకనే చెబుతున్నారు. బీసీ, మహిళా నాయకత్వానికి పెద్దపీట వేస్తున్న బిజెపి కేంద్ర పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తూ.. మూడు జిల్లాలకు కేంద్ర బిందువుగా, మహా నగరానికి కూతవేటు దూరంలో ఉన్న ఇబ్రహీంపట్నం నియోజక వర్గాన్ని కేంద్రంగా చేసుకొని బీసీ అభ్యర్థిని ప్రకటించి, గెలుపే లక్ష్యంగా పావులు కలపడం ఇందుకు నిదర్శనం.. అంతే కాకుండా భాజపా ప్రకటిం చిన అభ్యర్థికి వారి సామాజిక ఓట్లు సింహ భాగం ఉండటం విశేషం. ప్రస్తుత ఎన్నికలలో యువత ఓట్లు కీలకం కావడం, ఉద్యోగాలు లేక ఆగ్రహం మీద ఉన్న యువత ఓట్లను, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి విధానాలను, గ్రామస్థాయికి అందిస్తున్న సంక్షేమ నిధులను క్షేత్ర స్థాయికి తీసుకువెళ్లి ఓట్లను అభ్యర్థిం చాలని భాజపానేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. రాష్ట్రంలో ప్రధాన అధికార, విపక్షం బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌  పార్టీలు అగ్రకులాల అభ్యర్థులకు ప్రాధాన్యం  ఇస్తుండడంతో భారతీయ జనతా పార్టీకి బడుగు, బలహీన వర్గాల అభ్యర్థి గెలుపు ఖాయం అనే సంకేతాలు వస్తున్నట్లు తెలిసింది. దేశంలో మెజారిటీ ప్రజలు మోడీని విశ్వసిస్తుం డడంతో.. ఇబ్రహీం పట్నం నియోజకవర్గం లో బీసీ అభ్యర్థిని గెలిపించుకొని, సత్తా చాటాలని బిజెపి ఉవ్వి ల్లూరుతోంది. ఇప్పటికే చాప కింద నీరుల విస్తరిస్తున్న భాజాపా, ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టించవచ్చని పలువురు మేధావులు తమ అభిప్రాయం వ్యక్తపరు స్తున్నారు. యువతను, నిరుద్యోగులను, మహిళలను టార్గెట్‌గా చేసుకుంటూ గణనీయ మైన స్థాయిలో వారి ఓట్లను పొందాలని ప్రణాళిక రూపొంది స్తున్నట్లు బిజెపి వర్గాలు తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం జరగబోవు ఎన్నికలలో తెదేపా పార్టీ పోటీ చేస్తుందా..? తమ మిత్రపక్షాలకు మద్దతు పలుకుతుందా..? అనే మీమాంస లో పార్టీ శ్రేణులు ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. గతంలో రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన తెలుగు దేశం పార్టీ క్యాడర్‌, ఓటర్లు నియోజకవర్గంలో గెలుపును ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఎన్నికలలో పోటీ చేసే అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాక సమీకరణాలు మారవచ్చని పలువురు చర్చించుకుంటున్నారు. మరో విశ్లేషణతో ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ కథనం మీ ముందుకు త్వరలోనే.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు