Saturday, May 18, 2024

సనత్‌ నగర్‌ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందింది..

తప్పక చదవండి
  • అని వెల్లడించిన మంత్రి తలసాని

రాంగోపాల్‌ పేట్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే సనత్‌ నగర్‌ నియోజక వర్గం ఎంతో అభివృద్ధి చెందిందని..ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కారం అయ్యాయని సనత్‌ నగర్‌ బీ ఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి,మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. బుధవారం రాంగోపాల్‌ పేట్‌ డివిజన్‌ పరిధిలోని మంజు థియేటర్‌, ఆవుల మంద, నాగన్న దేవిడి, కళాసి గూడ, బర్ధన్‌ కాంపౌండ్‌, కండోజి బజార్‌ లలో బీ ఆర్‌ ఎస్‌ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాదయాత్రగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 50 సంవత్సరాల నుండి ఎన్నో సమస్యలతో గోస పడుతున్న నియోజకవర్గ ప్రజల ఇబ్బందులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన 10 సంవత్సరాలలోనే తొలగించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రజలు ఎదుర్కొం టున్న అనేక సమస్యలను తన దృష్టికి వచ్చినే వెంటనే పరిష్కరిస్తూ వస్తున్నట్లు చెప్పారు. 2014 కు ముందు నియోజకవర్గ పరిధిలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు, డ్రైనేజీ వ్యవస్తలను కోట్లాది రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసి నట్లు వివరించారు.నూతన రిజర్వాయర్‌ లను నిర్మించియా త్రాగునీటి సమస్యను కూడా పరిష్కరించినట్లు తెలిపారు. గత 50 సంవత్సరాలలో ఈ ప్రాంతం నుండి గెలుపొంది గొప్ప గొప్ప పదవులను అనుభవించిన వాళ్ళు కూడా చేయలేని, ఎవరు ఊహించని స్థాయిలో అభివృద్ధి చేశామని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించాలి, నియోజకవర్గాన్ని అభి వృద్ధి చేయాలనే చిత్తశుద్ది గత నాయకులలో లేని కారణం గానే అభివృద్దికి నోచుకోలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు గారి సహకారంతో సనత్‌ నగర్‌ నియోజకవర్గాన్ని అభివృద్దిలో మోడల్‌ గా తీర్చిదిద్దా మని, మరోసారి తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మిగి లిన అభివృద్ధి పనులను కూడా చేపడతామని హామీ ఇచ్చారు. ప్రచారంలో మంత్రి వెంట సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియో జకవర్గ ఇంచార్జి తలసాని సాయి కిరణ్‌ యాదవ్‌,మాజీ కార్పొరేటర్‌లు అత్తిలి అరుణ గౌడ్‌, అత్తిలి మల్లిఖార్జున్‌ గౌడ్‌, కిరణ్మయి,బేగంపేట కార్పొరేటర్‌ టి.మహేశ్వరి, డివిజన్‌ అద్యక్షుడు అత్తిలి శ్రీనివాస్‌గౌడ్‌, నాయకులు ఆంజనేయులు, విజయ్‌,ఆనంద్‌ పాటిల్‌,కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు