Monday, December 11, 2023

తండ్రి బాటలో తనయ

తప్పక చదవండి
  • ఖైరతాబాద్ నియోజకవర్గంలో దూసుకుపోతున్న విజయా రెడ్డి
  • స్లమ్ ప్రజలకు ఆరాధ్యం.. పిజెఆర్ ఆశయాలకు అనుగుణం
  • అర్థరాత్రి ఆపద వచ్చిన నేనున్నానంటూ భరోసా
  • పిజెఆర్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవలు
  • ప్రజలకు సేవ చేయాలనే కాంగ్రెస్ పార్టీలోకి..
  • తండ్రికి తగ్గ తనయ అంటున్న ఖైరతాబాద్ ప్రజలు

హైదరాబాద్ : ఖైరతాబాద్ నియోజకవర్గ పేద బడుగు బలహీనవర్గాల ప్రజలకు ఆరాధ్య దైవమైన దివంగత పి.జనార్దన్ రెడ్డి సేవలు అమోఘం.. ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ఐదు సార్లు గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన ఆయన, కార్మిక నాయకుడిగా ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ఆయనను ప్రజలు అన్నఅంటూ పిలుచుకునేవారు.. పూర్తిగా ఆయన పేదల మనిషి అని ప్రజలు అనేవారు. అలాంటి ఖైరతాబాద్ టైగర్ కడుపున పుట్టిన పి. విజయ రెడ్డి తండ్రి బాటలో నడుస్తూ నియోజకవర్గ ప్రజలకు సేవలందిస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు జయహో విజయ అంటూ కీర్తిస్తున్నారు. విజయ రెడ్డి ఖైరతాబాద్ నియోజకవర్గంలో డేరింగ్ అండ్ డాషింగ్ ఉమెన్ గా కొనసాగుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే లేడీ టైగర్. ఎలాంటి బెదిరింపులకు కూడా ఆమె భయపడరు. ప్రతిపక్షాలు ఎన్నోసార్లు ఇబ్బందులకు గురిచేసిన డోంట్ కేర్ అంటూ ముందుకు సాగిన వీర వనిత, అలాంటి నాయకురాలు ఇప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడడం పట్ల ప్రజలు ఆనందిస్తున్నారు. ఆమెను గెలిపించుకుంటామని అంటున్నారు.

స్లమ్ ప్రజల ఆరాధ్యదైవం
తండ్రిలాగే ఆమె కూడా స్లమ్ ప్రజలకు ఆరాధ్య దైవంగా నిలుస్తున్నారు. ప్రజలు కూడా పిజెఆర్ కూతురుగా ఆమెకు మద్దతు పలుకుతున్నారు. ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో పర్యటిస్తుంటే ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. తండ్రికి తగ్గ తనయా అంటు కీర్తిస్తున్నారు. అలాగే ఖైరతాబాద్ లో ఒక దుర్మార్గుడి పరిపాలనను అంతమొందించెందుకు విజయ రెడ్డి కాంగ్రెస్ నుండి బరిలో దిగడం పట్ల ప్రజలు సంతోషిస్తున్నారు. కేసీఆర్ అనే దుర్మార్గుడు తమ కుటుంబంలో చిచ్చుపెట్టి ఆమె తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకున్నాడు. అయినా కూడా మొక్కవోని ధైర్యంతో ఆమె ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు వచ్చారు.

- Advertisement -

పీజేఆర్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవలు..
పీజేఆర్ ఫౌండేషన్ ద్వారా ఖైరతాబాద్ నియోజకవర్గంలో చాలా రోజులుగా ఆమె ప్రజలకు సేవలందిస్తున్నారు. ఖైరతాబాద్ కార్పొరేటర్ గా సేవలందించిన ఆమె పట్ల ప్రజలు కృతజ్ఞతగా ఉన్నారు. నియోజకవర్గంలో యువతను మహిళలను కలుపుకుపోతూ ముందుకు సాగుతున్నారు. తన తండ్రి పేరిట ఒక సంస్థను నెలకొల్పి సేవలు అందించడం సంతృప్తిగా ఉందని పలుమార్లు మీడియా ముఖంగా తెలిపారు. ఖైరతాబాద్ నియోజకవర్గం పెద్ద నియోజకవర్గం అని నియోజకవర్గ వ్యాప్తంగా గల్లీ గల్లీ తిరుగుతూ ఆమె ప్రజలను ఆకర్షిస్తున్నారు. పిజెఆర్ అంటే ఒక బ్రాండ్ అని, అలాంటి బ్రాండ్ విజయ రెడ్డిని నిలబెట్టడం సంతోషకరమని ప్రజలు అంటున్నారు.

ప్రజలకు సేవ చేయాలని కాంగ్రెస్ పార్టీలోకి
తాను నిరుపేద ప్రజలకు సేవలు అందించాలంటే అది కాంగ్రెస్ పార్టీ తోటే సాధ్యమవుతుందని భావించి రేవంత్ రెడ్డి ని కలిసి తన మనసులో మాట చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరానని ఆమె తెలిపారు. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ పలు రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తుందని అయినా కూడా తాను ప్రజల మనిషినని ప్రజల మనోబలమే తనకు శ్రీరామరక్ష అని అన్నారు. ప్రజలు తలుసుకుంటే అవినీతి అరాచక వ్యక్తులకు చుక్కలు చూపిస్తారని, ఇప్పుడు అలాంటి పరిస్థితి ఖైరతాబాద్ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులకు ఎదురు కాబోతుందని ఆమె అన్నారు. తనను నమ్ముకున్న నియోజకవర్గ ప్రజలకు ఏ అర్ధరాత్రి, అపరాత్రి ఆపద వచ్చిన తాను క్షణాల్లో స్పందిస్తానని, వారికి నా యొక్క సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని, నా ప్రజలకు ఆపద తలపెడితే వారిపై పోరాటానికి వెనుకాడని ఆమె తెలిపారు. ప్రజలే నా బలగం.. ప్రజలే నా బలం.. ప్రజలే నా బలహీనత అంటున్న విజయ రెడ్డికి మెజారిటీ విజయ అవకాశాలు కనబడుతున్నాయి.

విజయ రెడ్డి పట్ల ఖైరతాబాద్ ప్రజల మనోగతం
మాకు బిడ్డలాంటి విజయ రెడ్డిని గెలిపించుకొని తీరుతామని ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలు తన మనసులోని మాటను బయటపెడుతున్నారు. వారి కుటుంబం ప్రజలకు చేసిన సేవలు అమోఘమని వారి సేవలు పొందిన మేము ఇప్పుడు ఆమెని ఎమ్మెల్యేగా గెలిపించుకొని మా నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటామని అంటున్నారు. ఖైరతాబాద్ ను గత పది ఏళ్లుగా రాక్షసుల చేతుల్లో పెట్టామని ఈ ఎన్నికల్లో అలాంటి తప్పు చేయకుండా మా ఇంటి ఆడబిడ్డ అయినా విజయమ్మను విజయ తీరాలలో నిలబెడతామని మాట ఇస్తున్నామంటూ పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు