Sunday, December 3, 2023

వికసిస్తున్న కమలం

తప్పక చదవండి

బీసీ ముఖ్యమంత్రి, ఎస్సీ వర్గీకరణ, ఉచిత విద్య వైద్యం కలిసొచ్చే బీజేపీకి కలిసొచ్చే అంశాలు

  • తెలంగాణాలో గెలుపు దిశగా దూసుకుపోతున్న బీజేపీ
  • ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు చెమటలు పట్టిస్తున్న వైనం
  • హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ హవా
  • సుమారు 40కిపైగా స్థానాల్లో గెలిస్తే బీజేపీదే అధికారం
  • తెలంగాణలో భారీగా ఓటు శాతం పెంచుకున్న బీజేపీ
  • సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటాం.. అమ్ముడు పోము..
  • ప్రతిపక్షాల ఊహకందని రీతిలో బీజేపీ గ్రౌండ్ వర్క్
  • సామాన్యులకు అందుబాటులో మరెన్నో పథకాలు
  • ధరణి స్థానంలో ప్రజలను ఆకర్షిస్తున్న మీ భూమి యాప్
  • బీజేపీకి ఆర్ఎస్ఎస్, విఎచ్ పి, బజరంగ్దళ్, ఏబీవీపీ మద్దతు

హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్ది భారతీయ జనతా పార్టీ గెలుపు దిశగా దూసుకుపోతోంది. బీజేపీ అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారాన్ని భారీ ఎత్తున కొనసాగిస్తున్నారు. ప్రజలు బీజేపీకి నీరాజనాలు పలుకుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనను చూసిన ప్రజలు కొత్తదనం కోరుకోవడంలో ఆశ్చర్యం లేదు ఒకసారి బీజేపీని గెలిపించి చూద్దామనే కోణంలో నేడు తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది దేశంలో సుమారు 20 కి పైగా రాష్ట్రాలలో అధికారంలో ఉన్నది. బిజెపి జాతీయ నాయకత్వం అయినా నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా కాంగ్రెస్ బీఆర్ఎస్ వేస్తున్న ఎత్తులను పైఎత్తులను చిత్తు చేస్తూ ఎవరు ఊహించని రీతిలో ప్రణాళిక బద్ధంగా తెలంగాణ రాష్ట్రంలో విజయం దిశగా పావులు కదుపుతున్నారు.

- Advertisement -

రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు చెమటలు పట్టిస్తున్న బీజేపీ
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు బీజేపీ పార్టీ చెమటలు పట్టేస్తుంది రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసిన అనుయంగా బీజేపీ ఓటు శాతం పెరగడం ప్రతిపక్షాలకు మింగుడు పడడం లేదు ముఖ్యంగా ఈ రెండు పార్టీలు విడదీసి పాలించు అనే ధోరణిలో వ్యవరిస్తుంటాయి. బీజేపీ మాత్రం తాము ఎంచుకున్న సిద్ధాంతాలతో ముందుకు పోతున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినా అరాచకాలను అవినీతిని అస్త్రాలుగా చేసుకుని ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇప్పటికీ కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చి మాట తప్పిన విషయాన్ని ప్రజలకు విడమర్చి చెప్పడంలో బీజేపీ నాయకులు అధిష్టానం సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఏదేమైనా బీజేపీ అంటేనే ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయి భారతీయ జనతా పార్టీ పేరు వింటేనే వారికి ముచ్చమటలు పడుతున్నాయి.

హైదరాబాద్ తో సహా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్న బీజేపీ
హైదరాబాద్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఉత్సాహంతో పనిచేస్తున్నారు. గెలుపే దిశగా వారు అహర్నిశలు కష్టపడుతున్నారు. ఇతర పార్టీలో లాగా పార్టీలు మారడం, జంపింగ్ జపాన్ల లాగా వ్యవహరించడం బీజేపీ కార్యకర్తలకు ఉండదు. బీజేపీ కార్యకర్తలు అంటే కట్టర్ హిందువులు. వారు దేశం కోసం, ధర్మం కోసం పాటుపడతారు. అధిష్టానం ఏది చెప్తే అది చేయడం వారి పని ఇప్పుడు అదే పనిలో భాగంగా భారతీయ జనతా పార్టీని రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపచేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ తీసుకున్న యూ టర్న్ ను ప్రతిపక్షాలు ఊహించలేకపోతున్నాయి. పది రోజుల నుండి రాష్ట్రంలో అంతర్గతంగా పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇదంతా కూడా బీజేపీ కేంద్ర అధికార గణం కనుసన్నల్లో జరుగుతుండడం బీజేపీకి ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. కొంతమేర కార్యకర్తలు నిరుత్సాహంలో ఉన్నప్పటికీ ఈ మధ్యనే ప్రధానమంత్రి మోడీ పర్యటనలు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా మరి ఎంతో మంది కేంద్ర మంత్రులు, బీజేపీ పెద్దలు రాష్ట్రంలో తిరిగి ప్రచారం చేస్తుండడం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడం జరుగుతుంది ఇవన్నీ కూడా బీజేపీ పార్టీకి కలిసి వచ్చే అంశాలుగా చెప్పొచ్చు.

సుమారు 35 నుంచి 40 స్థానాలు గెలిచే అవకాశం అంటున్న రాజకీయ విశ్లేషకులు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35 నుంచి 40 స్థానాలు బీజేపీ గెలిస్తే అధికారం బీజేపీ దేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ విధంగా చూస్తే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టడం సులువేనని రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర అధిష్టానం నిర్వహిస్తున్న ప్రచార సభల్లో వారు మాట్లాడుతున్న మాటలు బీజేపీకి అధికారం కట్టబట్టేలా ఉన్నాయనీ విశ్లేషించుకుంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఓటు శాతం మిగతా పార్టీల కంటే మెరుగ్గా ఉన్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ ముందుకు పోతోంది. అధికారమే లక్ష్యంగా పోరాటం చేస్తోంది.. దీన్ని బట్టి చూస్తే అధికారం చేపట్టడం పెద్ద పని ఏమి కాదని పలువురు భావిస్తున్నారు.

సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటాం అమ్ముడు పోము
బీజేపీ నాయకులు కార్యకర్తలు కట్టర్లుగా ఉంటారు కదా అని అమ్ముడు పోయే నాయకులు కారు.. నిజమైన బీజేపీ కార్యకర్త కరుడుగట్టిన బీజేపీ వాదిగా ఉంటాడు. కానీ, అమ్ముడు పోయే మనస్తత్వం వారిలో ఉండదు. ఈమధ్య చూస్తే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి ఘటనలు చేసుకుంటున్నాయి. ఎంతోమంది కాంగ్రెస్ లో గెలుపొంది బీఆర్ఎస్ కు అమ్ముడుపోయిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజలు కాంగ్రెస్ పట్ల ఒక అనుమానం మొదలైంది. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించుకుంటే ఎక్కడ అమ్ముడుపోతారో నని ప్రజల్లో ఒక భయం మొదలైంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూల్చాలని చూస్తున్న ప్రజలకు కాంగ్రెస్ కంటే బీజేపీ మీదనే నమ్మకముందని, బీజేపీ పార్టీయే ప్రత్యామ్నాయమని పలువురు భావిస్తున్నారు. కాంగ్రెస్ కు ఓట్లు వేస్తే గెలిచిన తర్వాత ఎక్కడ అమ్ముడుపోతారోనని భయపడుతున్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ కంటే బీజేపీ మేలని భావించి బీజేపీకి ఓట్లు వేసే అవకాశం లేకపోలేదు.

రాష్ట్రంలో బీజేపీకి పెరిగిన ఓట్ శాతం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఓట్ల శాతం పెరిగిందని ఈ మధ్యనే సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. 2018 ఎన్నికల కంటే ఇప్పుడు చూస్తే భారీగా ఓటు శాతం పెరగడం బీజేపీ శ్రేణుల్లో ఒక ఉత్సాహాన్ని పెంచుతుంది. ఈ లెక్కన చూస్తే వచ్చేయడాది వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ ఎంపీలను తెలంగాణలో గెలిపించుకుంటుందని, ఈ ఓట్ శాతం చూస్తే అదే జరగచ్చని ప్రజలు భావిస్తున్నారు. ముఖ్యంగా కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్ కుమార్, ఈటల రాజేందర్ ధర్మపురి అరవింద్, డీకే అరుణ, కొండ విశ్వేశ్వర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, రఘునందన్ రావు, రాజాసింగ్, తల్లోజు ఆచారి, బొడిగె శోభ, లాంటి పవర్ ఫుల్ స్పోక్స్ పర్సన్స్ ఉండడం ఓటు శాతం పెరగడానికి కారణమని వారు సభల్లో ప్రసంగిస్తుండడం వారి ప్రసంగానికి ప్రజలు ఆకర్షితులవడం జరుగుతుంది. అదేవిధంగా చాలామంది ప్రజలు బీజేపీకి దగ్గరవడం జరుగుతుంది. వీరితోపాటు కేంద్ర అధినాయకత్వం కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా హామీలు ఇవ్వడం కూడా ఇందుకు కారణం అని చెప్పొచ్చు. ఏ రకంగా చూసిన తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పవనాలు వీస్తునడం సూచికమేనని బీజేపీనాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణలో బీజేపీ పుంజుకోవడానికి కారణాలు ఇవే
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఈమధ్య అన్యోన్యంగా పుచ్చుకోవడానికి కారణాలు ఇవేనని చెప్పొచ్చు ఎస్సీ వర్గీకరణ, అధికారం చేపడితే బీసీ ముఖ్యమంత్రి, ఉచిత విద్య వైద్యం, రైతు భరోసా, ఉద్యోగుల భర్తీ, ఉద్యోగాల కల్పన, రైతు పెట్టుబడి సాయం, విద్యార్థినీలకు ల్యాప్టాప్ లు, నవజాత బాలికలకు ఫిక్స్ డిపాజిట్లు ఏడాదికి నాలుగు ఉచిత సిలిండర్లు, రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, ధరణి స్థానంలో మీ భూమి యాప్ ప్రవేశపెట్టడం గల్ఫ్ బాధితులకు నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేయడం, ముస్లింల నాలుగు శాతం రిజర్వేషన్ రద్దు చేయడం, రైతులు పండించే పంటలకు మద్దతు ధర ఇవ్వడం, ఉద్యోగులకు పెన్షనర్లకు ఇలా ఒకటి తారీకునే జీతాలు వేయడం లాంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలతో తమ మేనిఫెస్టోను విడుదల చేయడంతో మేనిఫెస్టోపట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా బీజేపీకి అనుబంధ సంస్థలైన ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందు పరిషత్, అఖిలభారత విద్యార్థి పరిషత్ ఇంకా ఎన్నో హిందూ ధార్మిక సంస్థలు పనిచేయడం కూడా బీజేపీకి కలిసొచ్చే అంశం ఈ విధంగా చూస్తే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారం చేపట్టడం పక్కా అంటున్న బీజేపీ నాయకులు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు