Friday, May 10, 2024

అరచేతిలో వైకుంఠం తప్పా.. అభివృద్ధి లేదు

తప్పక చదవండి
  • గజ్వేల్‌ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌

గజ్వేల్‌ : కేసీఆర్‌ మీద లక్ష్మీనరసింహా స్వామి కూడా వ్యతిరేకంగా ఉన్నాడని గజ్వేల్‌ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ అన్నారు. గురువారం వర్గల్‌ మండలం నాచగిరి శ్రీ లక్ష్మీనరసింహ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారం ప్రారభించారు ఈటల రాజేందర్‌. అనంతరం వారు మాట్లాడుతూకేసీఆర్‌ లక్ష్మి నరసింహ స్వామివారిని దర్శించుకుని 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తానని నమ్మబలికారని, శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని సందర్శించుకుని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్‌ స్వామివారిని దర్శించుకుని 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తానని చెప్పి ,10 సంవత్సరాల అవుతున్న ఆలయ అభివద్ధికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు.అభివృద్ధిని పక్కనపెట్టి ఇక్కడున్న దేవాలయ భూముల మీద కన్నేసారన్నారు.50,60 సంవత్సరాల క్రితం దళితులకు ఇచ్చిన అసైన్డ్‌ భూములను లాక్కోవాలని కేసీఆర్‌ చూస్తున్నారని పేర్కొన్నారు. అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నాడు తప్ప అభివృద్ధిని చేయలేదన్నారు.గ్రామాల్లో ప్రజలు మేమే కథానాయకులమై ఈటలను గెలిపించుకుంటాము అని చెప్పడం సంతోషంగా ఉందని ధీమావ్యక్తం చేశారు.బూతుకు 300 సీసాలు,50వేల రూపాయలు ఐదు దఫాలుగా కేసీఆర్‌ ఇస్తాడట, బీఆరెస్‌ వాళ్ళు ఇచ్చేవన్ని తీసుకొని ఈటెలకే ఓటేస్తామని ఇక్కడ యువత చెప్తున్నారన్నారు ఈటల. కేసీఆర్‌ ను ఓడగొట్టకపోతే గజ్వెల్‌ ప్రజలు బాగుపడరు మన ఆత్మగౌరవం దెబ్బతింటుందని ప్రజలకు సూచించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు