Saturday, April 27, 2024

తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు

తప్పక చదవండి
  • విద్య అర్హత విషయంలో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి……
  • నామాత్రంగా పరిశీలించి చేతులు తెలుపుకున్న రిటర్నింగ్ అధికారి కృష్ణవేణి ….
  • 2014 లో ప్యాట్నీ గవర్నమెంట్ కాలేజ్..2018 లో వేస్లీ కాలేజీ లో ఇంటర్ చదివినట్టు తప్పుడు పత్రాలు సమర్పించిన మంత్రి మల్లారెడ్డి…..
  • తప్పుడు ఫార్మాట్ లో నామినేషన్ దాఖలు చేసిన పువ్వాడ అజయ్…..
  • అఫిడవిట్ పరిశీలనలో లోపం కనబరిచిన ఖమ్మం మున్సిపల్ కమిషనర్……
  • స్థిరాస్తుల వివరాలు తప్పుగా చూపించిన శ్రీనివాస్ గౌడ్……
  • రిటర్నింగ్ అధికారులను సస్పెండ్ చేసి… అక్రమాలపై విచారణ చేయాలి ..
  • ఎన్నికల కమిషన్ కు పిర్యాదు చేసిన బక్క జడ్సన్…….

హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్ ) : ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారాన్ని అందించి ఎన్నికల కమిషన్ ని తప్పుదోవ పట్టించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారులను సస్పెండ్ చేసి అభ్యర్థుల అభ్యర్థిత్వాన్ని తిరస్కరించి తగు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ సభ్యులు బక్క జడ్సన్ ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ని కలిసి పిర్యాదు చేశారు. నర్సంపేట బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి 2014 ఎన్నికల అఫిడవిట్ 14వ పేజీలో లో అత్యున్నతమైన విద్యార్హత పదవ తరగతి గా చూపించి 2018 ఎన్నికల అఫిడవిట్, 2023 ఎన్నికల అఫడవిట్ లో తన విద్యార్హత ఇంటర్మీడియట్ అని సమాచారం ఇచ్చారు.2014 లో 10 వ తరగతి చూపించి 2023 లో 1991 లోనే ఇంటర్మీడియెట్ అయిపోయిందని చూపడం తప్పు దొర్లందా..?లేదా నకిలీ సర్టిఫికెట్లు సృష్టించాడా అన్నది అధికారులు విచారణ చేస్తే వాస్తవాలు బట్టబయలు అవుతాయి అని జడ్సన్ ఆరోపించారు..

2014 లో ప్యాట్నీ గవర్నమెంట్ కాలేజ్..2018 లో వేస్లీ కాలేజీ లో ఇంటర్ చదివినట్టు తప్పుడు పత్రాలు సమర్పించిన మంత్రి మల్లారెడ్డి…..

- Advertisement -

మేడ్చల్ నుంచి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న మల్లారెడ్డి 2014లో తెలుగుదేశం పార్టీ నుండి మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసిన సమయంలో సికింద్రాబాద్ ప్యాట్నీలోని ప్రభుత్వ కళాశాల నుంచి 1973లో ఇంటర్మీడియట్ అర్హతగా సూచించారు. 2018 ఎన్నికల్లో సికింద్రాబాద్ వెస్లీ కళాశాలలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించినట్లుగా పేర్కొన్నారు. ఒకే వ్యక్తి రెండుసార్లు ఇంటర్మీడియట్ చదవడం ఏంటని ఎన్నికల అఫిడవిట్ లో ప్రామాణికమైన విద్యార్హతలను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు సరిగా గుర్తించలేకపోవడం ఏంటని బక్క జడ్సన్ ప్రశ్నించారు.

తప్పుడు ఫార్మాట్ లో నామినేషన్ దాఖలు చేసిన పువ్వాడ అజయ్…..

ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థులు నిర్ణీత 8- నిలువుల ఫార్మాట్ లో అఫిడబిట్ ను పూరించాలి. అయితే ఖమ్మం నుండి పోటీ చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ ఆరు కాలములతో కూడిన అఫిడవిట్ ను సమర్పించారు. అంతేకాకుండా డిపెండెంట్ కాలంలో అప్పులు నమోదు చేసి ఎన్నికల అధికారులను తప్పుదారి పట్టించారు. ఈ అఫిడవిట్ పరిశీలనలో లోపాలను పరీక్షించలేని ఎన్నికల రిటర్నింగ్ అధికారి మున్సిపల్ కమిషనర్ ను సస్పెండ్ చేయాలని కోరారు..

స్థిరాస్తులను తప్పుగా చూపించిన శ్రీనివాస్ గౌడ్……
టిఆర్ఎస్ పార్టీ నుండి మహబూబ్ నగర్ అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ ప్రభుత్వాధికారి శ్రీనివాస్ గౌడ్ సైతం ఎన్నికల అప్పుడే వీటిలో ఆస్తుల వివరాలు తప్పుగా చూపించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ఎన్నికల నియమావళికి విరుద్ధంగా మహబూబ్నగర్ రిటర్నింగ్ అధికారికి సమర్పించిన ఫారం- 26 లోని కీలక సమాచారాన్ని శ్రీనివాస్ గౌడ్ దాచిపెట్టారని మంత్రి ఎన్నిక చెల్లదని కోర్టును కోరారు. శ్రీనివాస్ గౌడ్ తన భార్య సంపాదించిన స్థిరాస్తి మహబూబ్ నగర్ లోని గ్రామీణ వికాస్ బ్యాంకు నుండి పొందిన రూపాయలు 12 లక్షల తనకా రుణానికి సంబంధించిన సమాచారాన్ని వెల్లడించే విఫలమయ్యాడని బక్క జడ్సన్ ఎన్నికల అధికారులకు వివరించారు.

2023 సార్వత్రిక ఎన్నికల విషయంలో ఎన్నికల కమిషన్ అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తూ ఎప్పటికీ అప్పుడు జిల్లా ఎన్నికల అధికారులకు రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల నియమావళికి సంబంధించిన సూచనలు చేస్తూ తీసుకోవలసిన చర్యలపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఎన్నికల అఫిడవిట్ పరిశీలనలో అలసత్వం వ్యవహరించిన నర్సంపేట, మేడ్చల్, ఖమ్మం,మహబూబ్ నగర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారులపై, తప్పుడు సమాచారాన్ని సమర్పించిన అభ్యర్థులపై చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ సభ్యులు మాజీ వికలాంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ బక్క జడ్సన్ ఎన్నికల కమిషన్ వికాస్ రాజ్ ను కలిసి పిర్యాదు చేసినట్లు బక్క తెలిపారు..
ఎన్నికల నియమావళి నిబంధనల ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని బక్క జడ్సన్ డిమాండ్ చేశారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు