Saturday, April 27, 2024

రోడ్డు మా జాగీర్‌

తప్పక చదవండి
  • ఫుట్‌పాత్‌ కబ్జా చేస్తాం, అడిగేది ఎవరు..?
  • మా కస్టమర్లే వాహనాలు ఆపాలి
  • ఆర్కే సూపర్‌మార్కెట్‌ ఓనర్‌, వర్కర్ల దౌర్జన్యం..
  • షాపుల ముందు ప్రత్యేక వ్యక్తుల ఏర్పాటు..
  • పార్కింగ్‌ స్థలాలు లేక వాహన చోదకుల ఇక్కట్లు..
  • పట్టించుకోని ట్రాఫిక్‌ పోలీసులు..
  • మేమంటే పోలీసులకు భయమంటున్న యజమానులు..
  • ఎస్పీగారు… జర చూడరా..

కొత్తగూడెం : అంతా మా ఇష్టం మా షాపు ముందున్న రోడ్డు మా జాగీర్‌ మాషాపులోకి వచ్చే కస్టమర్లే వాహనాలు ఆపాలి. ఇతర వాహనాలు ఆపితే ఖబర్ధార్‌మాషాపు ముందున్న ఫుట్‌పాత్‌ సైతం మాదే కబ్జా చేస్తాం చిల్లర సామానుసంచులను పెడతాం మమ్మలి అడిగేది ఎవరు పోలీసులకు మామూలు ఇస్తున్నాం, మమ్మల్ని ఏమీ అనరు మామూలు పుచ్చుకుంటున్నారు కాబట్టి. మేమంటే వారికి భయం ఇది కొత్తగూడెం మున్సిపాల్టీ పరిధిలోని గణేష్‌ టెంపుల్‌ సమీపంలో ఉన్న ఆర్కే సూపర్‌మార్కెట్‌ యాజమాన్యం ధౌర్జన్యం.షాపుల ముందు ఉన్న నిర్ధేశిత పార్కింగ్‌ స్థలంలో ఇతరులు వాహనాలను నిలపాలంటే భయపడాల్సిన పరిస్థితి కొత్తగూడెంలో నెలకొంది. దీంతో వివిధ అవసరాల కోసం వచ్చే వాహనాలను ఎక్కడ పార్కింగ్‌చేయాలో అర్థంకాక సతమతమవుతున్న పరిస్థితి నెలకొంది. వాళ్ల షాపుల ముందు ఇతర వాహనాలను నిలపక పోవడం, రోడ్లపై వాహనాలు నిలిపితే పోలీసులు చలాన్లు వేస్తుండటంతో వాహన చోధకులు, ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది.

కొంతమంది షాపుల యజమానులు ఏకంగా ప్రత్యేకమైన సిబ్బందిని ఏర్పాటు చేసుకొని వారి షాపుల ముందు ఇతర వాహనాలను నిలపకుండా అడ్డుకుండటంతో తీవ్రవాగ్వివాదాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి. ఈ కోవలోనే ఓ వాహన చోదకుడు గణేష్‌ టెంపుల్‌ సమీపంలో ఉన్న ఆర్కే సూపర్‌మార్కెట్‌ ముందు తన వాహనాన్ని నిలిపి మరోచోటికి వెళ్లడంతో ఆషాపు ముందు నియమించుకున్న సిబ్బంది వాహన చోదకుడితో తీవ్ర వాగ్వివాదానికి దిగారు. బండి తీయాల్సిందేనని ఖరాకం డిగా చెప్పడంతోపాటు ఏకంగా ఆవాహనాన్ని తీసు రోడ్డుపై పెట్టారు. షాపులోని ఓనర్‌తోపాటు ఇతర సిబ్బంది సైతం వాహన చోదకుడిపై విరుచుకుపడ్టారంటే ఇక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ట్రాఫిక్‌ పోలీసులకు మామూళ్లు ఇస్తు న్నామంటూ ఆ షాపుల ముందు మావాహనాలే నిలిపేందుకు మాకు అనుమతులు ఉన్నాయని చెప్పడం, పోలీసులకు చెప్పినా మాకేం కాదంటూ చెప్పడం చూస్తుంటే పోలీసులపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని షాపుల యజ మానులు ఏకంగా రాళ్లను,బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాలు నిలపకుండా అడ్డుకుంటున్నారు. నడిచేందుకు వీలు లేకుండా ఫుట్‌పాత్ను సైతం కబ్జా చేస్తున్నా పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడు. వాహన చోదకులు వాహనాలు రోడ్లపై నిలుపు తుంటే చలాన్లు రాసేట్రాఫిక్‌ పోలీసులు అసలు ఈ పరిస్థితికి కారణం ఎవరైనా కోణంలో పరిశీలించకపోవడం విచారకరం. ఇప్పటికైనా ట్రాఫిక్‌ పోలీసులు స్పందించి షాపు యజమా నులు వాహన చోదకులపై చేస్తున్న ధౌర్జన్యాలతోపాటు షాపుల ముందు వాహనాలను నిలుపనీయని పరిస్థితి పై దృష్టిసారించడంతోపాటు అందు కు కారకులు అవుతున్న వారిపై ర్యలు తీసుకోవాలని వాహన చోదకులకు పార్కింగ్‌ ఇబ్బందులు లేకుండా చూడాలని, ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీ సైతం దృష్టిసారించాలని ప్రజలు కోరుకుంటున్నారు. మరి ఆదిశగా పోలీసులు చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూద్ధాం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు