Wednesday, May 8, 2024

మునుగోడు నియోజకవర్గం దత్తత ఉత్తమాటే

తప్పక చదవండి
  • చౌటుప్పలో డిగ్రీ కాలేజ్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌
  • మునుగోడు ఎమ్మెల్యే అసెంబ్లీలో ఎప్పుడు
    ప్రజల సమస్యలపై మాట్లాడలేదు..
  • పలువురు బీఎస్పీ పార్టీలో చేరిక..
    ` విలేఖరుల సమావేశంలో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌..

చౌటుప్పల్‌ : బహుజన సమాజ్‌ పార్టీ బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ సమక్షంలో మునుగోడు నియోజకవర్గం నుండి వందమంది వివిధ పార్టీల నుండి బీఎస్పీ పార్టీలో చేరారు. అనంతరం విలేకరుల సమావేశంలో డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ… దత్తత ఉత్తమా టేనా అని అన్నారు. రాష్ట్రంలో త్వరలో జరిగే సర్వత్రిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని, అధికార పార్టీకి సంబంధించిన డబ్బు, మద్యాన్ని అడ్డుకోకుండా కేవలం ప్రతిపక్ష పార్టీలో డబ్బు మధ్యాన్ని పట్టుకున్నదని ఇది కరెక్ట్‌ కాదన్నారు. అదేవిధంగా మునుగోడు ఉప ఎన్నికల్లో విద్యుత్తు శాఖ మంత్రి, గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డి మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని చెప్పి, మునుగోడు మండలం సోలిపురం గ్రామానికి బ్రిడ్జి వేస్తానని చెప్పి ఇంతవరకు చేయలేదని మర్రిగూడెం ప్రభుత్వం హాస్పిటల్‌ లో 30 పడకలు ఇస్తామని ఇంతవరకు నిర్మించలేదు మరియు చౌటుప్పల్‌ లోనే మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి చౌటుప్పల్‌ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తానని ఇంతవరకు చేయలేదని ఆరోపించారు. ఎమ్మెల్యే అసెంబ్లీలో మునుగోడు నియోజకవర్గం ప్రజా సమస్యలపై ఏనాడు మాట్లాడిన సందర్భం లేదని తెలిపారు. మరియు దండు మల్కాపురం కందిషిక్కుల భూమిని ఆక్రమించుకొని ప్రభుత్వాన్ని అప్పజెప్పి కమిషన్‌ తీసుకోవాలని చూస్తున్నారు. మరియు మునుగోడు నియోజకవర్గం లో ఈసారి ఎన్నికల్లో ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ప్రజలకు ప్రభాకర్‌ రెడ్డిని ఓడిరచడం ఖాయంమన్నారు. అనంతరం మునుగోడు నియోజకవర్గం ఇంచార్జి ఆందోజు శంఖారాచారి ఆధ్వర్యంలో ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర మహిళా కన్వీనర్‌ నర్ర నిర్మల , నలగొండ జిల్లా అధ్యక్షులు పూదరి సైదులు, మునుగోడు నియోజకవర్గం ఇంచార్జి ఏర్పుల అర్జున్‌ ,మునుగోడు నియోజకవర్గం చేరికల కమిటీ కన్వీనర్‌ పల్లె లింగస్వామి , మహిళా కన్వీనర్‌ పద్మ యాదవ్‌ ,రాష్ట్ర నాయకులు నరసింహ ,నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి కత్తుల నరసింహ ,నియోజకవర్గం కోశాధికారి పరమేష్‌,నియోజకవర్గం కార్యదర్శిలు ఎర్రోల్ల వెంకటయ్య, అంకెపాక శంకర్‌, సీనియర్‌ నాయకులు సుక్క బుగ్గరాములు, శుక్రా ప్రమీల, మండల అధ్యక్షులు తగరం సుభాష్‌ చంద్రబోస్‌ ,ప్రభుదాస్‌ , బొల్లూరి శివాజీ ,మండల ప్రధాన కార్యదర్శి రమేష్‌ ,కార్యదర్శి ఉదరి రమేష్‌, ఎర్ర దానయ్య, మున్సిపల్‌ అధ్యక్షులు లింగస్వామి, ఉపాధ్యక్షులు నర్సింహ్మ , జమ్ముల క్రాంతి, సీనియర్‌ నాయకులు కొమ్ము వెంకటేష్‌, బివిఆర్‌ కన్వీనర్‌ సామ్రాట్‌ కిరణ్‌, చామట్ల రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు