Saturday, April 27, 2024

గ్రామపంచాయతీ ఎన్నికలకు వేళాయె..

తప్పక చదవండి

తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలకు త్వరలో నగారా మోగనుంది.సుమారు 12,700 గ్రామ పంచాయతీ లలో ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే సంవత్సరం జనవరిలో గ్రామపం చాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈనెల చివరి వారంలో నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించవలసిందిగా అన్ని జిల్లాల పాలనాధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం నుండి ఆదేశాలు జారీ అయినట్లు చర్చ జరుగుతుంది. 2019 జనవరిలో పంచాయతీ ఎన్నికలు మూడు దశలో జరిగాయి. అన్ని పంచా యతీల్లో ఫిబ్రవరి 1 సర్పంచ్‌ తో సహా ఉపసర్పంచ్‌. వార్డ్‌ మెంబ ర్లుకొలువు తీరనున్నారు. వీరి పదవి కాలం ఫిబ్రవరి 1 తో ముగి యనున్నది .గ్రామపంచాయతీ చట్టం నిబంధనల ప్రకారం ఎన్ని కల ప్రక్రియ పూర్తిచేసి అదే రోజు ఫలితాలను ప్రకటించాల్సి ఉం టుంది. వీరి పదవి కాలం ముగియడానికి మూడు నెలల ముందు గానే ఎన్నికలను ప్రారంభించాల్సి ఉంటుంది .అయితే ఇటీవలనే అసెంబ్లీ ఎన్నికలు జరగడం వల్ల ఈ ఎన్నికలు కాస్త ఆలస్యమైన ట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్‌ ప్రభుత్వం గ్రామపంచాయతీ ఎన్నికలను సక్రమంగా నిర్వహించ డానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు, పోలింగ్‌ అధికారులు నియామకం, ఎన్నికల విధులలో పాల్గొనను న్న సిబ్బందికి శిక్షణ ఇవ్వడం తదితర కార్యక్రమా లను ప్రారంభిం చాలని కలెక్టర్లకు ఎన్నికల సంఘం నుంచి స్పష్టమైన ఆవేశాలు వచ్చినట్లు తెలుస్తుంది .రాష్ట్రంలో నూతన ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన నేపథ్యంలో గ్రామపంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు పాత పద్ధతిలోనే ఉంటాయా? లేదా తిరిగి రిజర్వేషన్లు మారు స్తారా? అనేటువంటి సంక్లిష్ట పరిస్థితి ఉంది. నిజానికి పంచాయతీ పరంగా పాత వానినే కొనసాగించాలి.కానీ కొత్త ప్రభుత్వం చట్ట సవరణ చేస్తే రిజర్వేషన్లు మారే అవకాశాలున్నట్టు తెలుస్తుంది .గ్రామ కార్యదర్శులు ఇప్పటికే సర్పంచ్‌ వార్డ్‌ మెంబర్లకు సంబం ధించిన రిజర్వేషన్లపై వివరాలు పంపించారు. గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రజలకు వర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం 2019లో చట్టం చేసింది. సుమారు 700 మంది ఓటర్ల కు ఒక పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. 200 మంది ఓటర్లు ఉంటే అక్కడ ఒక ప్రెసిడెంట్‌ ఆఫీసర్‌ ఒక పోలింగ్‌ ఆఫీ సర్‌, 201 నుంచి 400 ఓటర్లు ఉండే పోలింగ్‌ కేంద్రాల్లో ఒక ప్రెసిడెం ట్‌ అధికారీ ఇద్దరు పోలింగ్‌అధికారులుఉంటారు. సర్పంచి ఎన్ని కల్లో బ్యాలెట్‌ పద్ధతిలోనే ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీ ఎన్నికల బ్యాలెట్‌ పత్రాల్లోనూ నోటా ఉంటుంది. గతంలో లాగే ఉదయం ఏడుగంటల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు పోలింగ్‌, మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉం టుంది. రాష్ట్రంలో కొత్తగా కొలువుతీరిన కాంగ్రెస్‌ పార్టీ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతుంది. ఇప్పటికే ఆయా గ్రామా ల్లో సర్పంచు లుగా పోటీలో వున్న వారు గ్రూపుల వారీగా సమా వేశాలు పెట్టి తనను సర్పంచ్గా ఎన్నుకోవాలని గ్రామాల అభివృద్ధికి పూర్తిస్థాయి లో సహకరించి రాష్ట్ర ప్రభుత్వం నుండి తగినన్ని నిధులు తెచ్చేలా శాసనసభ్యుల మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తానని హామీలు ఇస్తున్నారని చర్చ జరుగుతుంది. ఏదేమైనా ఈసారి జరిగే ఎన్నికలు రసవత్తరంగా జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు జరి గినా తర్వాత గ్రామపంచాయతీ ఎన్నికలు సమీపించడంతో ఆయా గ్రామాలలో రాజకీయం రనరంగం ఆసక్తిగామారనుంది. ఇప్పటికే పోటీలో నిలిచే సర్పంచి అభ్యర్థులు విందులు వినోదాలతో ఓటర్ల ను మచ్చిక చేసే పనిలో నిమగ్నమయ్యారు.ఓటర్లకుకూడా దండిగా డబ్బులు పంచెల ఏర్పాట్లు చేస్తోంది. ప్రతిపక్ష పార్టీలు కూడా తమ వారిని సర్పంచు అభ్యర్థులుగా నిలబెట్టి గెలిపించి కునే ప్రయ త్నాలు చేస్తున్నారు అనిచెప్పవచ్చు. జోష్‌మీద వున్న కాంగ్రెస్‌ పార్టీ శాసన సభ్యులు ఈఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారు. మరోనెలరోజులలో గ్రామాలలో సర్పంచి ఎన్నికల సందర్భంగా మైకులు,డి.జేలు మోగనున్నాయి.ఎన్నికలుసజావుగా నిర్వహించేం దుకు పోలీస్‌శాక కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తోంది.
` కామిడి సతీష్‌ రెడ్డి 9848445134

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు