Monday, May 13, 2024

క్రిస్మస్‌ వేడుకలకు పటిష్టమైన భద్రత బందోబస్త్‌..

తప్పక చదవండి
  • క్రిస్మస్‌ వేడుకలకు చర్చి సందర్శించే భక్తులు సుఖ సంతోషాలతో పండుగను జరుపుకోవాలి
  • క్రిస్మస్‌ జాతర పై కమాండ్‌ కంట్రోల్‌ సి.సి. కెమెరాల, డ్రోన్‌ కెమెరా ద్వారా నిఘా
  • సమాచారం కోసం ప్రత్యేక పోలిస్‌ కంట్రోల్‌ రూమ్‌
  • జిల్లా అదనపు ఎస్‌.పి. అడ్మిన్‌.ఎస్‌. మహేందర్‌

మెదక్‌ : మెదక్‌ పట్టణంలో గల ప్రపంచ ప్రసిద్ది సి.ఎస్‌.ఐ. చర్చ్‌లో క్రిస్మస్‌ వేడుకల సంద ర్భంగా భారీ బందోబస్త్‌ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా అదనపు ఎస్‌. పి.అడ్మిన్‌.ఎస్‌. మహేందర్‌ అన్నారు. జిల్లా అదనపు ఎస్‌.పి. అడ్మిన్‌.ఎస్‌. మహేందర్‌ పర్యవేక్షణలో పటిష్టమైన భద్రతా ఏర్పా ట్లు చేయడం జరిగినది. ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్‌. పి.అడ్మిన్‌ .ఎస్‌. మహేందర్‌ మాట్లాడుతూ… ఆసియాలోనే అతి పెద్ద చర్చి మెదక్‌ లో ఉందని, చర్చిని చూసేందుకు, ఇక్కడ ప్రార్థనలు చేసేందుకు లక్షలాది మంది భక్తులు సందర్శించడం జరుగుతుందని, కావున ఈ జాతరలో భక్తులకు ఆటంకం కలుగ కుండా, వాహనాల పార్కింగ్‌ గురించి, ట్రాఫిక్‌ నియంత్రణ గురించి పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అదే విధంగా మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ఎలాంటి అవాచనీయ సంఘటనలు జరగకుండా మొత్తం 4 సెక్టార్‌ లను ఏర్పాటు చేసి జిల్లా అదనపు ఎస్‌.పి. పర్యవేక్షణలో నిజామాబాద్‌, వికారాబాద్‌, సంగారెడ్డి,కామారెడ్డి జిల్లాల సిబ్బందిలో ముగ్గురు డి.ఎస్‌.పి.లు, 14 మంది సి.ఐ./ఆర్‌.ఐ.లు, 56 మంది ఎస్‌.ఐ./ ఆర్‌.ఎస్‌.ఐ.లు, ఎ.ఎస్‌.ఐ./ హెడ్‌ కానిస్టేబు ల్‌లు 83 మంది, కానిస్టేబుల్‌లు 175 మంది, మహిళా సిబ్బంది 75 మంది, హోం గార్డులు 129 మంది, మరియు 8 అక్సెస్‌ కంట్రోల్‌ టీంలు, 4 డే బైనాకులర్‌ టీంలు, 2 రోప్‌ పార్టీలు, స్పెషల్‌ పార్టీలు, క్రైమ్‌ టీమ్‌,షీ టీమ్స్‌, ఎ.ఆర్‌. సిబ్బంది, కలిపి మొత్తం దాదాపు 535 మందితో పటిష్టమైన బందోబస్తు విధులు నిర్వహి ంచనున్నట్లు తెలిపారు. ఈ జాతర బందోబస్త్‌ ను కమాండ్‌ కంట్రోల్‌ సి.సి. కెమెరాల మరియు డ్రోన్‌ కెమెరా ద్వారా నిఘా ఏర్పాటు చేశామన్నారు. అలాగే జాతరకు వచ్చే భక్తులు తమ యొక్క వాహనాలను ఎక్కడపడితే అక్కడ పార్కింగ్‌ చేయకుండా పార్కింగ్‌ కోసం కేటాయించిన స్థలాల్లోనే తమ వాహనాలను నిలుపుకోవాలని తెలిపినారు. అదేవిధంగా తమ వెంట తీసుకోని వచ్చే వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని, అపరిచితులను నమ్మి తమ యొక్క వస్తువులను ఇవ్వరాదని అన్నారు. జాతరలో ఎవరైనా చిన్న పిల్లలు తప్పిపోయినట్లయితే చర్చ్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలిస్‌ కంట్రోల్‌ రూమ్‌లో వారి వివరాలు తెలిపాలని, అనుమానితంగా వుండే వస్తువులు, వ్యక్తులు పరిసర ప్రాంతాల్లో కనిపిస్తే వెంటనే పోలిస్‌ కంట్రోల్‌ రూమ్‌లో తెలపాలని అన్నారు. జాతరలో భద్రతలో భాగంగా బి.డి.టీం, డాగ్‌ స్వాడ్‌లను ఏర్పాటు చేయడం జరిగినదని, భద్రతలో విషయంలో ఎలాంటి రాజీపడకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని, అలాగే భద్రత విషయంలో ప్రజలు పోలిసు వారికి సహకరించాలని కోరారు. క్రిస్మస్‌ వేడుకలకు చర్చి సందర్శించే భక్తులు సుఖ సంతోషాలతో పండుగను జరుపుకోవాలని, సామాజిక దూరం పాటించాలని, ఈ సందర్భాగా జిల్లా ప్రజలకు అదనపు ఎస్‌.పి. క్రిస్మస్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపినారు. అదేవిధంగా సిబ్బంది కూడా సామాజిక దూరం పాటిస్తూ ప్రతి ఒక్కరూ మాస్కులను తప్పనిసరిగా దరించాలని సూచించారు. ఈ సంధర్భంగా బందోబస్త్‌కు వచ్చిన సిబ్బందికి డ్యూటిలు వేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో మెదక్‌ డి.ఎస్‌.పి. ఫణీంద్ర, తూప్రాన్‌ డి.యెస్‌.పి.యాదగిరి రెడి, ఏ.ఆర్‌. డి.ఎస్‌.పి. రంగ నాయక్‌, మెదక్‌, తూప్రాన్‌ సబ్‌ డివిజన్ల సి.ఐ., ఎస్‌.లు, మెదక్‌ జిల్లా ఏ.ఆర్‌. సిబ్బంది. నిజామాబాద్‌, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల సిబ్బంది ఉన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు