Wednesday, May 15, 2024

అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న

తప్పక చదవండి
  • రెడీ టు సర్వ్‌ ఫౌండేషన్‌..

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ రెడ్డిహిల్స్‌లోని నిలోఫర్‌ ఆసుపత్రికి వద్ద రెడీ టూ సర్వ్‌ ఫౌండషన్‌ ఆధ్వర్యంలో అన్న దానం కార్యక్రమం నిర్వహించారు, అన్న దాన కార్యక్రమంలో పాల్గొన్న సినీ నటి నటులు శ్రీ సంధ్య రాణి, నందు కుమార్‌ సౌథెరన్‌ గ్రూప్‌ అఫ్‌ హోటల్స్‌ లొరా మద్దిసాన్‌ యాక్టర్‌ రాజేందర్‌ గారు మోటివేషన్‌ స్పీకర్‌ పాల్గొన్నారు. నంద కుమార్‌ మాట్లాడుతూ అందరూ ఉండి కూడా అనాధలై కొందరు, ఏ దిక్కుమొక్కు లేని అభాగ్యులు మరికొందరు, భిక్షటనను చేస్తూ కొందరు, మతిస్థిమితం కోల్పోయి రోడ్లపై తిరుగుతూ మరికొందరు, ఆకలితో అలమటిస్తూ కొందరు, ఆకలి బాధను తట్టుకోలేక చెత్తకుప్పల్లో మీరు తిని పారేసిన వ్యర్థపదార్థలను తింటూ ఆకలి తీర్చుకుంటూ మరికొందరు. నేడు ఇలా ఎందరో మరెందరో అనాధలు, మతిస్థిమితము లేని అభాగ్యులు, మానసిక వికలాంగులు మన చుట్టూనే ఉన్నా చూసి చూడనట్టు, పట్టీ పట్టనట్టు, మనకెందుకులే అని వ్యవహరించే మనుషులు ఉన్న నేటి ఈ సమాజంలో మానవతా దృక్పధంతో కొన్ని వందల మంది అనాధలను, అభాగ్యులను, మానసిక వికలాంగులను చేరదీసి, వారికి ఆశ్రయం కల్పించి, వారికి సరైన వైద్యంతో పాటు మూడు పూటలా పౌష్టికాహారానం దిస్తూ, తమను తమ కుటుంబ సభ్యుల చెంతకు చేరుస్తూ, వారి జీవితాలలో వెలుగులు నింపుతున్న రెడీ టూ సర్వ్‌ ఫౌండషన్‌ శంకర్‌కి మరియు వారి టీంకు అభినందించారు. పెద్ది శంకర్‌, చైర్మన్‌ రెడీ టూ సర్వ్‌ ఫౌండషన్‌ ఫ్రెండ్స్‌ ప్రస్తుతం ఫౌండషన్‌ ఓల్డ్‌ ఏజ్‌ హోమ్‌లో మతిస్థిమితం కోల్పోయినవాళ్ళు 35 మంది అభాగ్యులు ఉన్నారు. మీ పుట్టినరోజులు లేదా పెళ్లిరోజులు, మరేదైనా మీఇంట్లో శుభాకార్యములు ఉంటే మన ఓల్డ్‌ ఏజ్‌ హోమ్‌ అనాధ ఆశ్రమంలో జరుపుకోండి. ఒక్కపూట అన్నదానం చేసి వారందరి ఆకలిని తీర్చినవారు అవుతారు. అన్నము పరబ్రహ్మ స్వరూపం. అన్ని దానాలకన్నా అన్నదానమెంతో గొప్పది ఫ్రెండ్స్‌. దయచేసి ఎవ్వరూ కూడా అన్నాన్ని వృధా చేయకండి. మనఆశ్రమానికి సహాయం చేయాలనుకున్న దాతలేవరైనా మానవతా దృక్పథంతో స్పందించి మనఆశ్రమంలోని 34 మంది అభాగ్యులు అనాధలు, రేషన్‌ గానీ, నిత్యవసర సరుకులను గానీ, కూరగాయలను గానీ, మీకు తోచినంతలో ఆశ్రమానికి దయచేసి సహాయం చేయండి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు