Monday, April 29, 2024

బహుజన ధిక్కార స్వరం మారోజు వీరన్న

తప్పక చదవండి

దళిత బహుజన సామాజిక విప్లవకారుడు కులవర్గ జమిలి పోరాట నిర్మాత తెలంగాణ మలిదశ పోరాటంలో వికసించిన అగ్నిపుష్పం దళిత బహుజనల విముక్తి పోరాటాలలో విశిష్టమైన అధ్యయనం ఆయనది. విముక్తి పోరాటాలలో విశిష్టమైన అధ్యాయంనం ఆయనది. ఆయనే బహుజనుల ధిక్కారస్వరం మారోజు వీరన్న. ఉదయించిన సూర్యుడు అస్తమించక మా అన్నడనేదే నానుడికి ప్రతిరూపమైన వీరన్న జయంతి ఈ రోజు. ఉద్యమాల గడ్డ ఉమ్మడి నల్లగొండ జిల్లా తుంగతుర్తి మండ లం కరివిరాల కొత్తగూడెంలో విప్లవ భావాలు గల ఆదర్శ దంపతులైన సూరమ్మ రామలింగంకు 1962 జనవరి 1 తేదీన వీరన్న జన్మించాడు వీరన్నలో చిన్నప్పటినుంచి శాస్త్రీయ దృక్పథం దృక్కో ణం అలవాట యింది. పాఠశాల చదువులలో రామాయణం నాటి కలో పరాక్రమంతో వాలిని చంపిన రాముడు దేవుడా? అనుమా నంతో సీతని అడవికి పంపిన రాముడు దేవుడెలా అయ్యాడు? అని ప్రశ్నించాడు సమాజంలో వివక్షత దోపిడీ అసమానతలు అర్థం చేసుకుంటూ 14 సంవత్సరాల వయసులోనే ఊరు తిరగబ డిరది అనే కథ రాశాడు కథనాటిక చాలా ప్రజా దారుణ పొందిం ది. తుంగతుర్తి లో స్కూలు చదువు ముగించుకుని ఇంటర్‌ సూర్యా పేట హైదరాబాదులో చదివాడు అనంతరం సైఫాబాద్‌ కాలేజీలో బిఎస్సి లో చేరాడు. విద్యార్థి సమస్యలపై పిడిఎస్యులో చేరి క్రియాశీలక పాత్ర పోషించి పిడిఎస్యు నేతగా ఎదిగాడు. విద్యార్థి నాయకుడిగా చంద్రపుల్లారెడ్డి గ్రూపు రాజకీయాలను విశ్లేషిస్తూ సమకాలీన భౌతిక రాజకీయ ఆర్థిక సాంస్కృతిక పరిస్థితులపై సమావేశాలు నిర్వహించేవాడు. తరువాత పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై మండల కమిషన్‌ విధానాలను ప్రోత్సహిస్తూ ఉద్యమం నడిపాడు 12 డెంటల్‌ 8 మెడికల్‌ కాలేజీలు క్యాపిటే యిన్‌ ఫీజు వసుల్లకు నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌ రెడ్డి ఇచ్చిన అనుమతి రద్దు జరిగేంత వరకు పోరాడాడు. జాతీయ అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమాలను నిషితంగా అధ్యయనం చేస్తూ విప్లవ విజయానికి కొత్తదారులు వెతికేవాడు తెలంగాణ సాయుధ పోరాటం శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాటం వీరన్న పై ప్రభావం చూపాయి. విద్యార్థులు రాజకీయాలకు దూరంగా ఉండకూడదని పూర్తి కాలం కార్యకర్తగా మారాడు కారంచేడు చుండూరు నక్సల్బరి పోరా టాల సంఘటనలకు ప్రభావితుడ య్యాడు దళిత మహాసభ ఉద్యమాల్లో భాగస్వామి అయి పిడిఎస్యును కూడా భాగస్వామ్యం చేశాడు. అంబేద్కర్‌ పూలే కాన్సీరాంల రచనలను పాఠ్యాంశంగా మార్చాలని కోరాడు. బాబ్రీ మసీదు విధ్వంసం తరువాత వీరన్న ఆలోచనలో స్పష్టత వచ్చింది పీడిత వర్గాలు ఐక్యం కాకుండా ఆధిపత్య కుల వ్యవస్థను తొలగించలేమని వివరించాడు కుల సంఘాల ద్వారా ఆత్మగౌరవ అస్తిత్వ పోరాటాలు చేయాలంటూ అనేక సంఘాలు ఏర్పాటు చేశాడు కులవర్గ జమిలి పోరాటాలు చేయకుండా గెలుపు సాధ్యం కాదన్నాడు కుల పోరాటాలు చేపట్టాలని డిమాండ్‌ ని పార్టీలో చేర్చాడు దళిత మైనారిటీ ప్రజాస్వామిక వేదిక డపోడం ఏర్పాటు చేశాడు. ప్రత్యేక తెలంగాణ కోసం తెలంగాణ మహాసభను ఏర్పాటు చేసి విస్తృతంగా తిరిగాడు అస్తిత్వ ఉద్యమాలకు దిక్సూచిగా నిలిచాడు ఆధిపత్యాన్ని ప్రశ్నించి పిడికిలి ఎత్తిన మారోజు వీరన్న కుల ప్రతిపాదికన రిజర్వేషన్ల ను బలపరచాలని పిడిఎస్యు తరపున నిలదించాడు. ప్రతిభ ఆధారంగా ఉత్తీర్ణత కావాలనే అగ్రకుల డిమాండ్‌ ను తీవ్రంగా వ్యతిరేకించాడు భారతదేశంలో విప్లవం విజయం వంతం కాకపోవడానికి కారణం ప్రపంచ దేశాలలో ఎక్కడా లేని కులమని వీరన్న నిర్ధారించాడు. కుల వర్గ జమిలి పోరాటాలు చేయకుండా కులేతర ఒంటరి వర్గ పోరాటాలు ఒంటిచేతి చెప్పట్లేనని కులవర్గ జమిలి పోరాటాలు చేయాలని స్పష్టంగా నినందించాడు. కులవర్గ జమిలి పోరుబాటే ఇండియా విప్లవ బాట అన్నాడు కులవర్గ సమస్యలు ఉన్న భారతదేశంలో వర్గ పోరాటాలతో పాటు కుల పోరాటాలు చేపట్టాలని డిమాండ్‌ ను పార్టీలో చేర్చాడు దానిపై లోతైన విశ్లేషణ జరుగుతున్న సమయంలోనే (డఫోడం దళిత మైనారిటీ ప్రజాస్వామిక వేదిక డఫోడం ఏర్పాటు చేశాడు) అదే జనశక్తి పార్టీలో చీలికకు కారణమైంది. కులం పై పార్టీలో చర్చలు జరగాలని ఆశించాడు. కానీ ఎలాంటి చర్చలు జరగకపోవడంతో నిరాశ చెందాడు. ఆదిపత్యాన్ని ప్రశ్నించి పిడికిలేత్తిన మారోజు వీరన్న 1999 మే 16న హైదరాబాద్‌ ఆటోలు ప్రయనిస్తున్న అతడిని ఆనాటి ముఖ్య మంత్రి చంద్రబాబు కిరాయి గుండాలు వీరన్నని ఎత్తుకుపోయి హత్య చేశారు. దాన్నే ఆనాటి ప్రభుత్వం కరీంనగర్‌ లో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయాడని అబద్ధపు బూటకపు కథలు చెప్పారు. భౌతికంగా మారోజు వీరన్న దూరమైన పీడిత వర్గాల పోరాటంలో జీవించే ఉంటాడు శ్రామిక వర్గ దృక్పథం లేని కుల పోరాటాలు కుల నిర్మూలన లక్ష్యం లేని వర్గ పోరాటాలు విముక్తి సాధించలేవు అందుకే మారోజు వీరన్న చూపించిన రాజకీయ సైద్ధాంతిక వెలుగులో పురోగమించడమే ఆయనకు మనము ఇచ్చే అసలైన జన్మదిన నివాళులు.
` బొట్ల దేవరాజు 8142055143

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు