Thursday, May 16, 2024

ఆసియా పోటీలకు అర్హత సాధించిన నేరేడుచర్ల బాలుడు

తప్పక చదవండి
  • జాతీయ టై క్వాండో పోటీలో సిల్వర్‌ మెడల్‌ గెలిచి

నేరేడుచర్ల : చన్‌ హాంగ్‌ ఇంటర్నేషనల్‌ టైక్వాండో ఫెడరేషన్‌ వారి ఆధ్వర్యంలో జరిగిన మొదటి జాతీయ టై క్వాండో పోటీలో నేరేడుచర్ల కు.చెందిన కొణతం.గమన్‌రెడ్డి అండర్‌ 20కిలోల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ లోని రేపల్లె లో జరిగిన జాతీయ స్థాయి పోటీలలో సిల్వర్‌ మెడల్‌ సాధించారు. నేపాల్‌ లో జనవరి 8-10 వరకు జరిగే ఆసియా పోటీలకు అర్హత సాధించారు. కోచ్‌ సైకం సుబ్బారావు, అలకపుర్‌ టౌన్‌ షిప్‌ లో ఉన్న సిట్స్‌ సంస్థలో శిక్షణ పొందాడు. గతంలో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి లో పథకాలు సాధించాడు. ఇప్పుడు అంతర్జాతీయ పోటీల కు సన్నద్ధం అవుతున్నారు. గమన్‌ రెడ్డి నేరేడుచర్ల మాజీ సర్పంచ్‌ కొణతం.సత్యనారాయణ రెడ్డి మనుమడు. విజయం సాధిం చడం పట్ల తల్లిదండ్రులు ఉదయ్‌ కుమార్‌ రెడ్డి, శోభన కుటుంబ సభ్యులు, ఇన్స్టిట్యూట్‌ నిర్వాహకులు అభినందనలు తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు