Tuesday, October 15, 2024
spot_img

ఢిల్లీని కమ్మేసిన పొగమంచు

తప్పక చదవండి
  • రైళ్లు, విమానాల రాకపోకల్లో ఆలస్యం

న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీని పొగమంచు కప్పుకుంది. ఢిల్లీ – ఎన్‌సీఆర్‌ పరిధిలో మంచు ప్రభావంతో అనేక రైళ్లు, విమానాలు రద్దు అయ్యాయి. దీంతో ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. శనివారం అత్యల్పంగా 10.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దట్టమైన పొగమంచు కారణంగా భారత వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. ’పంజాబ్‌, హరియాణా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ లకు హై అలర్ట్‌. డ్రైవింగ్‌ చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. పొగమంచు వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది’ అని ఐఎండీ ఎక్స్‌ లో పోస్ట్‌ చేసింది. రైళ్లు, విమానాలను రద్దు చేయడమే కాకుండా కొన్నింటిని దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉదయం 8.30 వరకు పరిస్థితులు అనుకూలించక పోవడంతో 80కి పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. కఠినమైన పరిస్థితులనడుమే రాజధానిలోని కర్తవ్య మార్గంలో గణతంత్ర దినోత్సవ పరేడ్‌ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు