Monday, April 29, 2024

ఈ నెల 21న గగన్‌యాన్‌ మిషన్‌ తొలి పరీక్ష

తప్పక చదవండి

గగన్‌యాన్‌ మిషన్‌లో భాగంగా మొట్టమొదటి వెహికల్‌ డెవలప్‌మెంట్‌ ఫ్లైట్‌(టీవీ-డీ1)ను ఈ నెల 21న తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి చేపట్టనున్నారు. దీని కోసం వాహనాన్ని మొదటి ప్రయోగ వేదికపైకి తీసుకొచ్చారు. పరీక్షలో భాగంగా మాడ్యూల్‌ను అంతరిక్షంలోకి పంపడం, దానిని సముద్రంలో పడేలా చేయడం, అనంతరం మాడ్యూల్‌ను స్వాధీనం చేసుకుని పునర్వినియోగానికి సిద్ధం చేయడం వంటివి చేపట్టనున్నారు. నావికాదళం ఇప్పటికే మాడ్యూల్‌ను తిరిగి పొందేందుకు అవసరమైన మాక్‌ ఆపరేషన్లను చేపట్టింది. సిబ్బంది మాడ్యూల్‌తో పాటు టీవీ`డీ1 క్రూఎస్కేప్‌ సిస్టమ్‌ను ఇస్రో పరీక్షించనుంది. అంతరిక్షంలో వ్యోమనౌక సమస్యను ఎదుర్కొంటే సిబ్బందిని తిరిగి భూమికి తీసుకురావడంలో ఇది సాయపడ నుంది. ప్రయోగం విజయవంతమయితే మొదటి మానవరహిత గగన్‌యాన్‌ మిషన్‌గా ఇది నిలవనుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు