Saturday, July 27, 2024

న్యూస్‌ క్లిక్‌కు బిగుస్తోన్న సీబీఐ ఉచ్చు

తప్పక చదవండి

న్యూఢిల్లీ : ఆన్‌లైన్‌ న్యూస్‌ పోర్టల్‌ న్యూస్‌క్లిక్‌ గత కొన్ని రోజులుగా వార్తల్లో వినిపిస్తున్న పేరు. చైనా నుంచి నిధులు అందుతున్నాయనే ఆరోపణలతో దాని వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పురకాయస్థను ఇటీవల ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేయడం కలకలం రేపింది. సీబీఐ కూడా రంగంలోకి దిగి దర్యాప్తు చేపడుతోంది. అందులో భాగంగా బుధవారం ఉదయం నుంచి న్యూస్‌ క్లిక్‌ వ్యవస్థాపకుడు ప్రబీర్‌ ఇళ్లు, ఆఫీస్‌లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. ఏకకాలంలోఇళ్లు, ఆఫీస్‌లో తనిఖీలు చేపట్టారు. ఇప్పటికే, ఆ సంస్థలో పనిచేసే సీనియర్‌ జర్నలిస్టులు, ఉద్యోగుల ఇళ్లల్లో ఢిల్లీ పోలీసులు సోదాలు చేపట్టారు. ప్రబీర్‌తో పాటు హెచ్‌ఆర్‌ హెడ్‌ అమిత్‌ చక్రవర్తిని అరెస్ట్‌ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. నిధులు వ్యవహారం గురించి వారిని ప్రశ్నిస్తున్నారు. భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు న్యూస్‌ క్లిక్‌కు చైనా నుంచి నిధులు అందినట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. ప్రబీర్‌పై ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉండటంతో సీబీఐ కూడా రంగంలోకి దిగింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. దీంతో న్యూస్‌ క్లిక్‌కు సీబీఐ ఉచ్చు బిగుస్తోంది. అయితే, ’న్యూస్‌ క్లిక్‌’ వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పుర్కాయస్థ తదితరులపై ఢల్లీి పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌, వాస్తవానికి, తీవ్రవాదం మినహా మరే ఇతర నేరాలను వెల్లడిరచని అస్పష్టమైన ఆరోపణల సమ్మేళనంగా వుంది. ’న్యూస్‌ క్లిక్‌’లో ప్రచురితమైన ఏ వార్తా కథనం లేదా సమాచారాన్ని ఉటంకించకుండానే, దేశ భద్రతను దెబ్బ తీయడానికి కుట్ర పన్నడం దగ్గర నుండి 2019 పార్లమెంట్‌ ఎన్నికలకు అంతరాయం కలిగించడం వరకు, ప్రభుత్వంపై అసంతృప్తికి కారణమవడం నుండి కీలక సేవలకు అంతరాయం కలిగించడం వరకు అనేక నేరాలకు పాల్పడ్డారంటూ ఎఫ్‌ఐఆర్‌ పేర్కొంది. కుట్రకు పాల్పడ్డారని, వివిధ గ్రూపుల మధ్య శతృత్వాన్ని పెంపొందించడానికి ప్రయత్నించారంటూ చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యు.ఎ.పి.ఎఉపా), ఐపిసి నిబంధనలను వర్తింపచేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపంగా లేదా తీవ్రవాద చర్యగా పేర్కొనగలిగే ఎలాంటి విధ్వంసకర చర్యను ఆ ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించకపోవడం అన్నింటి కంటే గుర్తుంచుకోదగ్గ అంశంగా వుంది. ప్రభుత్వంపై అసంతృప్తిని రగిల్చి, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను దెబ్బ తీసే, దేశ ఐక్యత, భద్రతకు ముప్పు కలిగించే లక్ష్యంతో, శత్రువులు భారత్‌ లోకి అక్రమంగా విదేశీ నిధులను చొప్పించారనే సాధారణ వర్ణన మాత్రమే ఆ ఎఫ్‌ఐఆర్‌లో వుంది. అరుణాచల్‌ ప్రదేశ్‌, కాశ్మీర్‌లు భారత్‌లో భాగం కాదని చూపించే ఇమెయిల్స్‌ మార్పిడి ప్రాతిపదికగా కుట్ర జరిగిందంటూ ఎఫ్‌ఐఆర్‌ ప్రస్తావించింది. 202021లో రైతుల ఆందోళన సుదీర్ఘంగా సాగేలా చూసేందుకు ప్రయత్నాలు జరిగాయని, తద్వారా సేవలు, ఇతర నిత్యావసర సరఫరాలకు ఆటంకం కలిగిందని ఎఫ్‌ఐఆర్‌ పేర్కొంది. మొత్తంవిూద, ‘న్యూస్‌ క్లిక్‌’కు అమెరికన్‌ కోటీశ్వరుడు నెవిªలలె రారు సింగమ్‌ జరిపే చెల్లింపులు, అలాగే ఆ వెబ్‌సైట్‌ జర్నలిస్టు సమాచారాన్ని కలిపి దేశ భద్రతను దెబ్బ తీసేందుకు, చట్టవ్యతిరేక కార్యకలాపాలను రెచ్చగొట్టేందుకు, తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేసేందుకు చైనా నిధులను వినియోగిస్తున్నారనే ఒక కేసును రూపొందించేందుకు పోలీసులు ప్రయత్నించారనేది స్పష్టమైంది. దీనికి యు.ఎ.పి.ఎ (ఉపా) కూడా అనుకూలంగా వుంటుంది. ఇక, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో చైనా కుట్ర సిద్దాంతాన్ని పాలక బిజెపి వాడుకునేందుకు కూడా అవకాశం వుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు