Wednesday, May 8, 2024

మళ్లీ కలవర పెడుతున్న కరోనా భయం

తప్పక చదవండి

భారతదేశం నుండి కరోనా పారిపోయిందని ఎలాంటి భయం లేదని ప్రజలందరూ స్వేచ్ఛగా తిరుగుతుంటే తాజాగా మన దేశంలో విజృంభిస్తున్న కరోనా జే. యన్‌ 1 వేరియంట్‌ వేలాదిమంది ప్రజలను కలవర పెడుతోంది. దీంతో అప్రమత్తమైన మన భారత ప్రభుత్వం మన దేశంలో కూడా కరోనా జాగ్రత్తలు విధించేలా ఉన్నట్లు తెలుస్తుంది. కరోనా టీకా వేసుకున్నాక ధీమాగా ఉండొద్దని కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్‌ తయారుచేసిన సంస్థలు మళ్లీ హెచ్చరిస్తున్నాయి. ప్రస్తుతము కొత్త రూపంలో ముంచుకొస్తున్న కరోనా జే. యన్‌ 1 వేరియంట్‌ మరో మారు తమ విశ్వరూపం చూపిస్తుందా అనే ఆందోళనలో ప్రజలు ఉన్నారు. మనదేశంలోకి నవంబర్‌ నెలలో ప్రవేశించిందని అక్కడక్కడ పదుల సంఖ్యలో కేసులు నమోదు అయ్యాయని కేరళ రాష్ట్రంలో కూడా ఈ వేరియంటు తన ప్రతాపం చూపిస్తుందని మరణాలు కూడా వున్నాయని ఆరోగ్య శాఖ స్పష్టం చేస్తుంది.శ్వాస కోస సంబంధిత సమస్యలు హెచ్చి శీతాకాలం సహజంగా భయపెడుతున్న క్రమం లో పరీక్షలు పెంచి, పాజిటివ్‌. వారికి జాగ్రత్తలు తీసుకునేలా ఏర్పాట్లు చేయాలి. భారత ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరిస్తుంది. దీనిపైన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరు గతంలో లాగానే యధావిధిగా కరోనా జాగ్రత్తలు పాటించాలని, మాస్కు విధిగా ధరించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలలో, విద్యాలయాలలో ఆరోగ్య సూత్రాలు పాటించి కోవిడ్‌ మళ్ళీ వ్యాప్తి కాకుండా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కూడా హెచ్చరించారు..కరోనా కేసులు మన దేశంలోనే కాకుండా అమెరికా, బ్రిటన్‌, బెల్జియం, ఫ్రాన్స్‌ ,డెన్మార్క్‌ తదితర దేశాల్లో కూడా విస్తరించాయి. ఇన్ఫెక్షన్‌ కలిగించే శక్తి ఉంది కనుక తక్షణమే వైద్యులను సంప్రదించాలని పరీక్షలు జరిపించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.అసలే క్రిస్మస్‌ వేడుకలు,మరో పక్క నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి అందరూ సిద్ధం అవుతూ వున్నారు.షాపింగ్‌ మాల్స్‌,బేకరీ ,స్వీట్‌ షాప్‌ లలో సందడి మొదలైంది. కావున ప్రతీ ఒక్కరూ పూర్తిగా అప్రమత్తం , జాగ్రత్త గా వుండాలి.సామాజిక దూరం,మాస్క్‌ లు మనకు రక్ష.సానిటైజర్‌ మన వెంట ఎప్పటికీ వుండాలి. కాబట్టి మళ్లీ మనమందరం కరోనా వ్యాప్తి కాకుండా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు మాస్కు ధరించుదాం. గుంపులు గుంపులుగా తిరగకుండా సామాజిక దూరం పాటించి కరోనా వ్యాప్తిని అరికట్టడంలో మన వంతుగా కృషి చేద్దాం.
` కామిడి సతీష్‌ రెడ్డి 9848445134

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు