Saturday, May 11, 2024

సిఎం అభ్యర్థిపై అధిష్ఠానందే నిర్ణయం

తప్పక చదవండి
  • ఖమ్మంలో పదికి పది కాంగ్రెస్‌ గెలవడం ఖాయం : రేణుకాచౌదరి

ఖమ్మం : ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ఎవరు అడ్డు పడ్డా పదికి పది కాంగ్రెస్‌ గెలుస్తుందని మాజీ ఎంపీ రేణుకా చౌదరి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం విూడియాతో మాట్లాడుతూ.. ‘‘సీఎం పదవిని చాలా మంది ఆశిస్తారు… గెలిచి వచ్చిన వారి హక్కు … హై కామాండ్‌ నిర్ణయం. కర్ణాటకలో డీకే శివరాం సీఎం అనుకున్నారు…. కానీ సిద్ద రామయ్య సీఎం అయ్యారు. ప్రభుత్వం ఏర్పాటు అయ్యేంత సీట్లు కాంగ్రెస్‌కు వస్తాయి’’ అని స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీలు ప్రజల్లోకి వెళ్లాయన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్‌లతో నిరుద్యోగులను కేసీఆర్‌ మోసం చేశారన్నారు. 18 ఏళ్ళ యువతీ యువకులకు ఓటు హక్కు కల్పించింది రాజీవ్‌ గాంధీ అని అన్నారు. బీఆర్‌ఎస కొత్త సినిమాను ప్రజలు నమ్మరని.. ఈ ఎన్నికలలో బీఆర్‌ఎస్‌కు ప్రజలు తగిన బుద్ది చెబుతారన్నారు. ‘‘నన్ను ఆంధ్రాకు ఆహ్వానించారు… సంతోషం అనిపించింది’’ అని అన్నారు. ఓట్లకు డబ్బులు పంచి గెలుద్దాం అనుకునే వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాబోతుందని తెలిపారు. అసమర్ధ ప్రభుత్వాలు… ప్రజలను హింసించారని… మైనారిటీలు కాంగ్రెస్‌ వెంట ఉన్నారని మాజీ ఎంపీ అన్నారు. ఎంఐఎంకి మైనారిటీలు దూరం అయ్యారని.. మహ్మద్‌ అజారుద్దీన్‌ ప్రచారంలో పాల్గొంటున్నారని తెలిపారు. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని తెలిపారు. కడుతుండంగానే డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళు కూలిపోతున్నాయని మండిపడ్డారు. లక్షలాది మంది ప్రజలకు ఇందిరమ్మ ఇళ్ళు కట్టించామని గుర్తుచేశారు. మహారాష్ట్ర పోయి సీఎం కేసీఆర్‌ రైతు బంధు అంటే నవ్వు వస్తుందన్నారు. రైతుల చేతులకు బేడీలు వేసిన చరిత్ర టీఆర్‌ఎస్‌ ది అని విమర్శించారు. భవిష్యత్తు ఉండాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. కేటీఆం ఐటీ కింగ్‌ అంటా… వాస్తవాలను మరిచిపోవద్దన్నారు. ఓటు సామాన్యుడికి బ్రహ్మాస్త్రమన్నారు. సంభాని, ఎడవల్లి కృష్ణ పార్టీ మారటం బాధ కలిగించిందన్నారు. కమ్యూనిస్టులతో పోత్తులపై భట్టి విక్రమార్క చర్చలు జరిపారని.. భవిష్యత్తులో మళ్ళీ కాంగ్రెస్‌ గూటికి చేరుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్టు చేయడం బాధాకరమన్నారు. టీడీపీ పోటీ చేయకపోవడం… మద్దతు ప్రకటించటం… సీపీఐ కూడా మద్దతు ప్రకటించటం సంతోషమని రేణకా చౌదరి పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు