Saturday, December 2, 2023

ఆటోవాలాలకు హామీ

తప్పక చదవండి
  • ఆటోవాలాలకు శుభవార్త చెప్పిన సీఎం
  • ఫిట్ నెస్ ఫీజు రూ. 700, పర్మిట్ రూ. 500 మాఫీ
  • అధికారంలో రాగానే ఫిట్‌నెస్, పర్మిట్ ఛార్జీలు రద్దు
  • ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చి కిలో బియ్యం రూ.2కు ఇచ్చారని వ్యాఖ్య
  • సరైన నాయకుడిని ఎన్నికుంటేనే రాష్ట్ర అభివృద్ధి
  • 55 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ ఏం చేసింది
  • మానకొండూరులో కేసీఆర్ ప్రజాశీర్వాద సభ

కరీంనగర్‌ : దేశానికి స్వాతంత్య్ర వచ్చి 75 ఏండ్లు పూర్తయిన రావాల్సినంత ప్రజాస్వామ్య పరిణతి రాలేదని సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రజాస్వామ్య పరిణతి వచ్చినప్పుడే ప్రజలకు మేలు జరుగుతదని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మానకొండూర్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు ఆగమాగం కావద్దని అన్నారు. ఓటేసుడుతోటే దుకాణం ఒడిసిపోదని, అక్కడే కథ మొదలైతదని చెప్పారు. మీరు గెలిపించిన ఎమ్మెల్యే వెనుక ఉన్న పార్టీ అధికారంలోకి వస్తదని చెప్పారు. కాబట్టి బాగా ఆలోచించి ఆచీతూచీ ఓటేయాలని సూచించారు. ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయినా రావాల్సినంత ప్రజాస్వామ్య పరిణతి రాలేదు. ప్రజాస్వామ్య పరిణతి వచ్చినప్పుడే ప్రజలకు మేలు జరుగుతది. విచక్షణతోటి బాగా ఆలోచించి మంచి అభ్యర్థికి, మంచి పార్టీకి ఓటెయ్యాలి. మాయ మాటలు నమ్మి ఆషామాషీగా ఓటు వేయొద్దు. అమెరికా లాంటి దేశాల్లో ఇట్ల సభలు పెట్టి ఓట్లడుగరు. టీవీలల్లనే ప్రచారం చేస్తరు. మన దేశంల కూడా ఆ రోజులు రావాలె. ఏ పార్టీకి ఓటేస్తే మంచి జరుగుతది.. ఏ పార్టీకి ఓటేస్తే చెడు జరుగుతది..? అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయగలగాలె. ప్రజలకు ఉన్న ఒకే ఆయుధం ఓటు. ఆ ఓటును సక్రమంగా వినియోగించుకోవాలె’ అని సీఎం చెప్పారు. ‘పార్టీల చరిత్ర, నడవడిక చూసి ఓటు వేయాలె. బీఆర్‌ఎస్‌ పార్టీ చరిత్ర ఏందో మీకు తెలుసు. బీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. తెలంగాణ అభివృద్ధి కోసం. తెలంగాణ ఏర్పాటైనంక బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంత బాగా అభివృద్ధి చేసిందో మీరందరూ చూస్తున్నరు. మరె 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ ఏం చేసింది..? అడుగడుగునా తెలంగాణను మోసం చేసింది. కాంగ్రెస్‌ పాలనలో ఎక్కడ చూసిన కరువు కాటకాలే ఉండె. పత్తికాయలు పగిలినట్లు రైతులు గుండెలు పగిలి చనిపోయిండ్రు. అదీ కాంగ్రెస్‌ పరిపాలన’ అని సీఎం ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్‌ పరిపాలనలో పత్తికాయలు పగిలినట్లు రైతుల గుండెలు పగిలి ఆత్మహత్య చేసుకున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. మానకొండూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ పాల్గొని రసమయి బాలకిషన్‌కు మద్దతుగా ప్రసంగించారు. బీఆర్‌ఎస్‌ పుట్టిందే తెలంగాణ ప్రజలు, హక్కుల కోసం. ఈ రాష్ట్రాన్ని 50 ఏండ్లు పాలించింది కాంగ్రెస్‌ పార్టీ. ఇల్లంతకుంటతో పాటు పలు మండలాల్లో పత్తి కాయ పగిలినట్లు మావోళ్లు గుండెలు పగిలిపోయి చనిపోయారని బాలకిషన్‌ గుర్తు చేశారు. పత్తికాయలు పగిలినట్టు రైతుల గుండెలు పగిలి ఆత్మహత్య చేసుకున్నది అప్పులపాలైంది కాంగ్రెస్‌ రాజ్యంలో అని కేసీఆర్‌ తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తామని అంటున్నారు. అన్నమే లేకుండే.. తిన్నోడు తిన్నడు తిననోడు తినలేదు. ఇందరిమ్మ రాజ్యం బాగుంటే ఎన్టీ రామరావు పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది. ఇందిరామ్మ రాజ్యం బాగుంటే.. ఎన్టీ రామారావు 2 రూపాయాలకే కిలో బియ్యం ఎందుకు పెట్టాల్సి వచ్చింది. ఇవన్నీ ఆలోచించాలి. ఆ బియ్యం పెట్టిన తర్వాత పేదల కడుపు నిండిరది. అప్పటిదాకా సగం తిని సగం పడుకున్న వాళ్లు ఉండ్రి. ఇది నిజం కదా..? ఇందిరమ్మ రాజ్యం సక్కగా ఉంటే హైదరాబాద్‌, బొంబై, భీవండి ఎందుకు వలసపోయారు. కూలినాలీ చేసుకునే గతి ఎందుకు పట్టింది. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ. అందర్నీ పట్టుకుపోయి జైళ్లో వేసుడు. ప్రభుత్వాలు కూలగొట్టుడు. అది ఇందిరమ్మ రాజ్యం అంటే. ఉన్నోడు ఉండే లేనోడు లేకనే ఉండే. మళ్లా ఆ రాజ్యం తెస్తమని మాట్లాడుతున్నారు ఎవర్ని గోల్‌ చేయడానికి. ఉన్న తెలంగాణను ఊడగొట్టింది ఇదే కాంగ్రెస్‌ పార్టీ కదా..? 58 ఏండ్లు కోట్లాడి బయటపడ్డాం. ఎంతో గోస పోసుకున్నారు. ఇల్లంతకుంటలో నా క్లాస్‌మేట్స్‌, స్నేహితులు ఉండే, సిద్దిపేటలో చదివినోళ్లు. పెళ్లిళ్లకు కూడా వచ్చాను. ఎక్కడ చూసినా దుబ్బలే ఉండే. ఏం లేకుండే, మన్ను కూడా లేకుండే, బతక లేకుండా ఉండే. వానాకాలం పంట పండితే పండినట్టు. చివరకు గడ్డి లేక పశువులను అమ్ముకున్న దయనీయ పరిస్థితి అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు