Monday, May 20, 2024

విషాదంగా మారిన పెళ్లి వేడుక..

తప్పక చదవండి
  • వివాహ వేడుకలో అగ్నిప్రమాదం

మోసుల్ : ఇరాక్‌ లో ఇటీవలే ఘోర ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఓ వివాహ వేడుకలో అగ్నిప్రమాదం చోటు చేసుకొని సుమారు 100 మందికిపైగా సజీవదహనమయ్యారు. మరో 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇరాక్‌ మోసుల్ నగర శివార్లలోగల అల్-హమ్దానియాలో ఉన్న ఓ ఫంక్షన్‌ హాల్‌లో గత వారం ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కాగా, ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతోంది.
వీడియోలో పెళ్లి తంతులో భాగంగా వధూవరులు ఎంతో రొమాంటిక్‌గా డ్యాన్స్‌ చేస్తూ కనిపిస్తారు. ఆ సమయంలో అక్కడ ఇండోర్‌ పటాసులు కాలుస్తారు. ఆ తర్వాత కొద్దిసేపటికే వేదికపై భాగం నుంచి ఒక్కసారిగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఇది గమనించిన అతిథులు ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు బయటకు పరుగులు తీస్తారు. అయితే, క్షణాల్లోనే ఆ మంటలు ఫంక్షన్‌హాల్‌ మొత్తం వ్యాపిస్తాయి. ఊహించని ఈ ఘటనతో అప్పటిదాకా పెళ్లి సందడితో కళకళలాడిన ఆ ఫంక్షన్‌ హాల్‌.. కాసేపట్లోనే హాహాకారాలు, ఆర్తనాదాలతో మార్మోగింది. శవాల దిబ్బగా మారిపోయింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు