Friday, May 3, 2024

ఆ వార్తలన్నీ వట్టివే..

తప్పక చదవండి
  • వోల్టాస్‌ సెల్లింగ్‌పై టాటా గ్రూప్‌ స్పందన..!

వోల్టాస్‌ లిమిటెడ్‌ను విక్రయిస్తున్నట్లుగా వచ్చిన వార్తలను మాతృ సంస్థ టాటా గ్రూప్‌ స్పందించింది. గృహో పకరణాలకు చెందిన వ్యాపారాన్ని విక్రయిస్తున్నట్లుగా వచ్చిన వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. వార్తలన్నీ తప్పని.. సత్యదూరమైనవని స్టాక్‌ మార్కెట్లకు పంపిన సమాచారం కంపెనీ పేర్కొంది. మీడియాలో వచ్చిన వార్తలతో షేర్‌ హోల్డర్లు, ఇన్వెస్టర్లను ఆందోళనతో పాటు ఇబ్బందికి గురి చేశాయని పేర్కొంది. ఇదిలా ఉండగా.. టాటా గ్రూప్‌ ఉప్పు నుంచి విమానాల వరకు వివిధ వ్యాపారులను చేస్తున్నది. అయితే, టాటా గ్రూప్‌లోని గృహోపకరాల కంపెనీ వోల్టాస్‌ను విక్రయించనున్నదని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయనే వార్తలు వచ్చాయి. వోల్టాస్‌ 1954లో ఏర్పాటైంది. కంపెనీ ఎయిర్‌ కండీషనర్లు, వాటర్‌ కూలర్లు, కమర్షియల్‌ రిఫ్రిజిరేటర్లను తయారు చేస్తున్నది. భారత్‌తో పాటు పశ్చిమ ఆసియా, ఆఫ్రికా తదితర దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నది. వోల్టాస్‌ అర్సెలిక్‌తో కలిసి జాయింట్‌ వెంచర్‌ను సైతం ఏర్పాటు చేసింది. దేశీయ రిఫ్రిజిరేటర్ల మార్కెట్‌లో వోల్టాస్‌ కంపెనీకి 3.4 శాతం, వాషింగ్‌ మెషిన్ల మార్కెట్లో 5.4 శాతం వాటా ఉన్నది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు