Friday, May 17, 2024

కోటక్‌ మ్యూచువల్‌ ఫండ్‌ హైదరాబాద్‌లో సీబీఎస్‌ఈ భాగస్వామ్యంతో ‘సీఖో పైసో కి భాషా’

తప్పక చదవండి

హైద్రాబాద్‌ : కోటక్‌ మ్యూచువల్‌ ఫండ్‌ హైదరాబాద్‌లోని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) భాగస్వామ్యంతో, పెట్టుబడి దారుల విద్య మరియు అవగాహన కార్యక్రమం, ‘సీఖో పైసో కి భాషా’ని నిర్వహిస్తోంది. ఉపాధ్యాయుల ఆర్థిక అవగాహన వృద్ధిని పెంపొందించడం కోసం వారిని శక్తివంతం చేసే లక్ష్యంతో విస్తృతమైన విద్య, అవగాహన కార్యక్రమాలను నిర్వహిం చడం ద్వారా ఆర్థిక అక్షరాస్యతకు మార్గం సుగమం చేసేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడిరది, అంతిమంగా ఇది సంభావ్య ప్రగతిశీల భవిష్యత్తు వైపు భారతదేశ ప్రయాణానికి దోహద పడుతుంది. తెలంగాణ, హైదరాబాద్‌లోని 2925 మంది సీబీఎస్‌ ఈ ఉపాధ్యాయులకు ఆర్థిక అక్షరాస్యత గురించి అవగాహన కల్పించడం,అవగాహన కల్పిం చడం ఈ కార్యక్రమం లక్ష్యం. వీరిలో 50% మంది మహిళలు ఉంటారని అంచనా, వీరందరికీ సమానమైన ఎదుగుదల మరియు అభివృద్ధికి ప్రోత్సహించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది. కార్యక్రమంలో భాగంగా, సెంటర్‌ ఫర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ లెర్నింగ్‌ (సీఐఈఎల్‌) నుండి ప్రోగ్రామ్‌ మొత్తం అంతటా తగినవిధంగా నాణ్యత ఉండేలా చూసుకుంటూ, ప్రభావవంతమైన సెషన్‌లకు నాయకత్వాన్ని వహించిన 500 మంది నిపుణులైన శిక్షకులను తీసుకువచ్చింది. ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌, బోలారం జెజె నగర్‌ పోస్టాఫీసు ప్రిన్సిపాల్‌ స్మితా గోవింద్‌ మాట్లాడుతూ, ‘‘ సీఖో పైసో కి భాషా అనే ఈ కార్యక్రమంలో పాల్గొనడం, మా ఉపాధ్యాయులకు సమాచారంతో కూడిన ఆర్థిక ఎంపికలు చేయడానికీ, వారి లక్ష్యాలను విశ్వాసం తో కొనసాగించడానికి అవసరమైన పరిజ్ఞానాన్ని అందించడానికి మాకు వీలు కల్పిస్తుంది’’, అని అన్నారు. కింజల్‌ షా, హెడ్‌- డిజిటల్‌ బిజినెస్‌, మార్కెటింగ్‌, అనలిటిక్స్‌, కోటక్‌ మ్యూచువల్‌ ఫండ్‌ మాట్లాడుతూ, ‘‘ఈ ఇన్వెస్టర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ అవేర్‌నెస్‌ ప్రోగ్రాం ‘సీఖో పైసో కి భాషా’ ద్వారా మేము ఆర్థిక సాధికారతను పెంపొందించడానికి మరింత ఎక్కువగా కట్టుబడి ఉన్నాము. మన దేశ భవిష్యత్తును రూపొందించడం లోనూ, కొత్త తరాన్ని రూపొందించడంలోనూ, ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారని మేము నమ్ముతున్నాము. సీబీఎస్‌ఈతో మా భాగస్వామ్యం ఆర్థిక అక్షరాస్యత, పెట్టుబడి గురించి గౌరవనీయులైన అధ్యా పకులకు అవగాహన కల్పించడం మరియు చైతన్యవంతం చేయడం. ఎప్పుడైతే, ఉపాధ్యాయులు ఆర్థిక అవగాహన కలిగి ఉంటారో వారు ఆర్థిక వ్యవస్థను మెరుగు పరచడంలో సహాయపడవచ్చు. వారందరితో కలిసి మేము భవి ష్యతును రూపొందించగలము’’, అని అన్నారు. ఈ కార్యక్రమం, దేశ పురోగతి, అభివృద్ధి జరగా లనే ఆకాంక్షతో సంపూర్ణంగా జతకలిసే లక్ష్యంతో, ఆర్థికంగా సాధికారత కలిగిన భారతదేశాన్ని సాధించే దిశగా ఒక ముఖ్య మైన దశను సూచిస్తుంది. ‘సీఖో పైసో కి భాషా’ దేశ ఆర్థిక వ్యవస్థను రూపు మాపడానికి సహాయపడుతుందని ఆశిస్తున్నాను.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు