Wednesday, September 11, 2024
spot_img

డబ్బు, మద్యం ప్రవాహాన్ని అరికట్టండి

తప్పక చదవండి
  • ఐదేళ్లలో అభ్యర్థుల ఆదాయం విపరీతంగా పెరిగింది
  • రాష్ట్రంలో ఎన్నికలను ప్రహాసంగా మారుస్తున్నారు
  • అభ్యర్థులు ఎన్నికల నియమావళి సరిగ్గా పాటించడంలేదు
  • ఎన్నికల నిర్వహణపై ఈసీ నిక్కచ్చిగా వ్యవహరించాలి
  • కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీం న్యాయవాదుల ఫిర్యాదు

హైదరాబాద్‌ : తెలంగాణ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయవాది జగన్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఎన్నికలకు సర్వం సిద్దం అవుతున్న వేళ, కొన్ని విషయాల్లో కేంద్ర ఎన్నికల సంఘం నిక్కచ్చిగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది అని ఆయన తెలిపారు. ముఖ్యంగా 2018లో పోటీ చేసిన అభ్యర్థుల ఆధాయాలు, ఈ ఐదేళ్లలో విపరీతంగా పెరిగి పోయాయని పేర్కొన్నారు. గత అఫిడవిట్‌, తాజాగా సమర్పించే అఫిడవిట్లను పోల్చి చూడాలి అని చెప్పామని ఆయన వెల్లడిరచారు. ఈ ఐదేళ్లలో ఆదాయం ఏ విధంగా పెరిగింది.. అక్రమ పద్దతిలోనే, సరైన మార్గంలోనా అనే విషయాన్ని ముందే పరిశీలించాలి అని సుప్రీంకోర్టు లాయర్‌ జగన్‌ అన్నారు. చాలా మంది అభ్యర్థులు ఎన్నికల నియమావళి సరిగ్గా ఫాలో కావడం లేదు.. పైగా డబ్బులు, మద్యం పంచడం తెలంగాణలో నార్మల్‌ అయింది.. ఎన్నికలను ప్రహాసంగా మారుస్తున్నారు అని ఆయన ఆరోపించారు. దయచేసి డబ్బు, మద్యం ప్రవాహాన్ని అరికట్టి ఓటర్లను ప్రభావితం చేయకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌ దే.. ప్రస్తుత సమయంలో ఎన్నికల అధికారుల నిఘా చాలా కీలకం.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలు.. ఓట్ల కోసం ప్రకటనలు చేసే పత్రికలు, టీవీల్లోనే క్రిమినల్‌ కేసులపై కూడా ప్రకటనలు ఇవ్వాలి అని సుప్రీంకోర్టు న్యాయవాది జగన్‌ డిమాండ్‌ చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు