Wednesday, April 24, 2024

అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతాం..

తప్పక చదవండి

  • హామీ ఇచ్చిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్..

హైదరాబాద్ : బీఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామీణ క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామని స్వేరోస్ నెట్వర్క్ వ్యవస్థాపకులు, డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. అక్టోబర్ 22 న గురుకుల విద్యాసంస్థల వ్యవస్థాపకులు ఎస్.ఆర్. శంకరన్ జయంతి పురస్కరించుకొని స్వేరోస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో కౌటాలలో కబడ్డీ, వాలీబాల్ క్రీడా పోటీలను ప్రారంభించారు.

- Advertisement -

అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లా సానికి పెంపొందించడంతో పాటు వ్యక్తుల మధ్య పోటీతత్వం పెరుగుతుందన్నారు. క్రీడల వల్ల యువత శారీరకంగా మానసికంగా దృఢంగా తయారవుతారని తెలిపారు. సిర్పూర్ ప్రాంతంలో క్రీడల్లో ప్రతిభ కనబరిచిన గ్రామీణ క్రీడాకారులను అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామన్నారు. యువతను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దే విధంగా గత పది సంవత్సరాల నుండి క్రీడాకారులను ప్రోత్సహిస్తూ గెలుపొందిన జట్లకు ఆర్థిక పారితోషకాన్ని అందివ్వడం జరుగుతుందన్నారు.

తొలి రోజు కబడ్డీ క్రీడలో దరంపల్లి,మొగడ్ దగడ్, అందేవెల్లి, డబ్బా ఎక్స్ రోడ్, కొత్తగూడెం,ముత్తంపేట్, అర్కగూడ జట్లు గెలుపొందాయి. వాలీబాల్ క్రీడలో మురళిగూడ, ముత్తంపేట్, తలాయి, సులుగుపల్లి, కుంటల మానెపల్లి, డోర్పెల్లి, అరకగుడ, బాబా సాగర్ జట్లు గెలుపొందాయి. ఈ క్రీడలు మరో మూడు రోజులపాటు కొనసాగుతాయి. కబడ్డీ 75 జట్లు, వాలీబాల్ కు 50 జట్లు క్రీడల్లో పాల్గొననున్నాయి. ఈ కార్యక్రమంలో స్వేరోస్ నెట్వర్క్ చీఫ్ కన్వీనర్ బల్గూరి దుర్గయ్య,స్వేరోస్ నెట్వర్క్ రాష్ట్ర అధ్యక్షులు పుల్ల కిషన్, స్పోర్ట్స్ కన్వీనర్ డా.సోలపోగుల స్వాములు, చాతల్ల సదానందం తదితరుల పాల్గోన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు