Thursday, May 16, 2024

మాట నిలబెట్టుకున్న తల్లికి మద్దతు ఇవ్వండి..

తప్పక చదవండి
  • తెచ్చినోడికి 10 ఏళ్ళు అవకాశం.. మరి ఇచ్చినోళ్లకు..
  • తెలంగాణ తెచ్చినోళ్ల కన్నా, ఇచ్చినోల్లే గొప్పోళ్ళు..
  • తెలంగాణ విశ్వాసం ఇకనైన తెగించి చూపాలి!
  • మాట నిలబెట్టుకున్న ఆ తల్లికి మద్దతిద్దాం..
  • సోనియాగాంధీ రుణం తీర్చుకుందాం!
  • ఫామ్‌ హౌస్‌ పాలనకు సమాధి చేసి.. ప్రజాస్వామ్య పాలనకు పట్టం కడుదాం..!

ఉమ్మడి పది జిల్లాలకు చెందిన నాలుగు కోట్ల ప్రజల చిరకాల స్వప్నమైన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను ఆనాటి తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టకముందే కాంగ్రెస్‌ గుర్తించింది. రాజకీయంగా కాంగ్రెస్‌ నష్టపోతుందని తెలిసినా, యువకుల బలిదానాలకు సోనియా గాంధీ చలించిపోయారు. అందుకే తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు. గడచిన సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్‌ బహిరంగ సభలో సోనియా గాంధీ మాట్లాడారు. తనకు ఎన్ని అవాంతరాలు ఏర్పడిన తాను ఇచ్చిన మాటకు కట్టుబడి హామీ నెరవేర్చాను. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి తీరాను. మాట నిలబెట్టుకున్న నాకు మనస్ఫూర్తిగా మద్దతు ఇవ్వండి అని తెలంగాణ ప్రజలను ఆమె కోరింది. జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ ప్రజలను కోరారు. నాడు కరీంనగర్‌ అంబేద్కర్‌ స్టేడియంలో తెలంగాణ కలను సహకారం చేస్తానని మాట ఇచ్చారు. తాను ఆ మాట నిలబెట్టుకున్నానని తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చామని అందుకోసం ఇప్పుడైనా ఒక అవకాశం కాంగ్రెస్‌ పార్టీకి ఇవ్వాలని, తెలంగాణలో కాంగ్రెస్‌ ను అధికారంలోకి తేవాలని సోనియాగాంధీ ఇక్కడి ప్రజానీకానికి మనవి చేశారు.

అభివృద్ధికి పెద్దపీట..
కాంగ్రెస్‌ పార్టీకి అవకాశం ఇస్తే, తెలంగాణలో ప్రజాస్వామ్య పాలనతో పాటు ప్రజల సంక్షేమం, అభివృద్ధికి పెద్ద పీట వేస్తామని సోనియా గాంధీ హామీ ఇచ్చిన విషయం విధితమే. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఆరు గ్యారంటీల పథకాలపై తమ ప్రభుత్వం తొలి సంతకం చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడమే కాదు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కూడ
తన కర్తవ్యం అన్నారు సోనియా గాంధీ. తమకు అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపిడమే తన కల అన్నారు.

- Advertisement -

తెలంగాణ తెచ్చినోళ్ళకు 10 ఏళ్లు అధికారం.. మరి ఇచ్చినోళ్లకు..!
ఎవరైనా మనకు కడుపునిండా అన్నం పెడితే వారిని కలకాలం గుర్తుంచుకుంటాం. మనకు మేలు చేస్తే తప్పక వాళ్ల రుణం తీర్చుకోవాలని కోరుకుంటాం. ఇది తెలంగాణ బిడ్డల నైజం. మరి అలాంటిది నాలుగు కోట్ల మంది ఒకే ఒక్క కోరిక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అని అందరం ముక్తకంఠంతో నినదించాం. అంతేకాదు సుమారు 1200 మంది బిడ్డలు ఈ ఒక్క నినాదం సాకారం అయ్యేందుకు తమ ప్రాణాలను ఈ నేలకు దారపోశారు. నాడు తెలంగాణ బిడ్డల బలిదానాలకు చలించిన సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చి తీరాలని నిర్ణయించుకొని, తమ పార్టీలోని నాయకత్వాన్ని, ప్రభుత్వంలోని వారిని ఒప్పించి ఆమె తెలంగాణ కలను సాకారం చేసిన దీరవనితగా అందరి మనసుల్లో స్థానం సంపాదించింది. కాకపోతే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ కు కాకుండా, తెలంగాణ తెచ్చిన అని చెప్పుకున్న కేసీఆర్‌ కు 10 ఏళ్లు ప్రజలు పట్టం కట్టారు.
తెలంగాణ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఏ మాత్రం ఉపయోగించకుండా ఈ రాష్ట్రాన్ని కెసిఆర్‌ ప్రభుత్వం అధోగతిపాలు చేసింది. రాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులు, రైతులు చివరికి ప్రజాప్రతినిధులైన సర్పంచులు కూడా ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడడం పాలకుడి నిరంకుశత్వానికి పరాకాష్టగా మిగిలింది. తెలంగాణలో జరిగిన అతి పెద్ద ఉద్యమాలుగా పిలువబడే మిలియన్‌ మార్చ్‌, సకల జనుల సమ్మె, సాగరహారం లాంటి కార్యక్రమాలకు సంబంధమే లేని తెలంగాణ రాష్ట్ర సమితి చివరికి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడుతున్న తరుణంలో కూడ ప్రత్యక్ష కార్యాచరణలో పాల్గొనలేదు. జరిగిన చరిత్రనే ఇందుకు సాక్ష్యం. అయినా 2014, 2018లో తెలంగాణ జనం మాయమాటలకు, గారడి వేషాలకు అవకాశం ఇచ్చి నేడు తలబాదుకుంటోంది. ఇప్పుడు అవకాశం వచ్చింది. కనీసం ఈసారైనా జ్ఞానోదయంతో కాస్త పరిణతితో ఆలోచించి, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన వాళ్లకు ఒక అవకాశం ఇచ్చి, వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన గురతర బాధ్యత నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలపై ఉన్నది. తెలంగాణ తెచ్చినం అని చెప్పుకునే వారి కంటే.., ఇచ్చినోళ్లు నూరు శాతం గొప్పోళ్ళు! ఇచ్చే వాళ్ళు ఉంటే.. తెచ్చేవారు బోలెడు మంది.

తెలంగాణ తెచ్చుకున్న విశ్వాసం తెగించి చూపాలి.!
తెలంగాణ రాష్ట్ర ఇచ్చిన వారికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే ఒక అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవకాశం ఇచ్చిన వారికే ఇచ్చి, మళ్లీ మళ్లీ వారినే గెలిపిస్తే.. వచ్చేది బలుపే! అందుకే నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన తరుణం వచ్చింది. తెలంగాణ తల్లిని ఎవరు చూసింది లేదు, విగ్రహాల్లో తప్ప. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కల, ఆకాంక్షను రాష్ట్ర హోదా కల్పించి సాకారం చేసిన సోనియా గాంధీ మాత్రమే మనందరికీ కనిపించే తల్లి. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి హృదయానికి ఈ విషయం తెల్సిందే. అందుకే తెలంగాణ తెచ్చుకున్న విశ్వాసం తెగించి చూపాలి.. సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలి!

ఫామ్‌ హౌస్‌ పాలనను సమాధి చేసి, ప్రజాస్వామ్య పాలనకు పట్టం కడుదాం.!
ప్రాణాలను ధారపోసి సాధించిన తెలంగాణలో ప్రజలు కన్న కలలు, వారి ఆకాంక్షలు పదేళ్లయిన ఇంకా నెరవేరనేలేదు. నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మాటలన్నీ నీటి మూటలుగానే మిగిలిపోయాయి. పాలకుడి మాటలన్నీ ఒట్టి బూటకంగా తయారయ్యాయి. అమరుల త్యాగ ఫలితం దొర గడీలో తెరమరుగైంది. సచివాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన పాలకుడు ఫామ్‌ హౌస్‌ కే పరిమితమయ్యాడు. ఇదేమని ప్రశ్నిస్తే, నిర్బంధం మొదలుపెట్టాడు. ప్రభుత్వ రంగ వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయి. ప్రశ్నించే హక్కుల సంస్థలన్నీ మౌనం దాల్చక తప్పని దుస్థితి ఏర్పడిరది. ప్రజలారా.! ఆలోచించండి..! ఫామ్‌ హౌస్‌ పాలనను సమాధి చేసి, ప్రజాస్వామ్య పాలనకు పట్టం కడదాం!

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు