Monday, April 29, 2024

స్టూడెంట్ మేనిఫెస్టో విడుదల – ఏబీవీపీ

తప్పక చదవండి
  • స్టూడెంట్ మ్యానిఫెస్టో ను రాజకీయ పార్టీలు అన్ని విధిగా వారి వారి మ్యానిఫెస్టోలో చేర్చాలి లేనిపక్షంలో రాబోవు ఎన్నికల్లో విద్యార్థులు అందరూ కలిసి ప్రజల్లో చైతన్యాన్ని నింపి గుణపాఠం చెప్పాల్సి వస్తుంది : ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ..

హైదరాబాద్ : గురువారం రోజు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల న్యూస్ సెమినార్ హాల్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో స్టూడెంట్ మ్యానిఫెస్టో విడుదల చేయడం జరిగింది. మేనిఫెస్టోలో ముఖ్యంగా విద్యార్థిని ఉద్యోగం అంశాలను చేర్చడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు పూర్తయినా కానీ రాష్ట్రంలో అధికారంలో వచ్చిన బీ.ఆర్.ఎస్. ప్రభుత్వం విద్యార్థులను నిరుద్యోగులను పూర్తిగా విస్మరించి , విద్యాలయాలను ధ్వంసం చేయడం జరిగింది .ఏబీవీపీ చాలా రకాల ఉద్యమాలను చేసి విద్యార్థుల గొంతుకగా నిలుస్తూ కొన్ని సమస్యలను సాధించడం జరిగింది.. అయినప్పటికీ చాలా రకాల సమస్యలు అలానే మిగిలి ఉన్నాయి.. కాబట్టి రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలకు స్టూడెంట్ మేనిఫెస్టోను ఆయా పార్టీల మేనిఫెస్టోలో పొందుపరచాల్సిందిగా ఏబీవీపీ డిమాండ్ చేయడం జరుగుతుంది.. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలో బోధన, బోధనేతర ఖాళీలను భర్తీ చేసి 8624 పాఠశాలలను పునర్ ప్రారంభించాలని, రాష్ట్రంలో యూనివర్సిటీల నీటిలోనూ సెల్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ చేసి బ్లాక్ గ్రాండ్ ను విడుదల చేసి, టీచింగ్ నాటి పోస్టులను భర్తీ చేయాలి.. విద్యా హక్కు చట్టాన్ని, ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి, విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి.. అదే విధంగా జాతీయ విద్యా విధానం 2020 ను అమలుపరిచి విశ్వవిద్యాలయాల్లో ఉపాధి కల్పించే నూతన కోర్సులను ప్రవేశపెట్టాలి.. టిఎస్పిఎస్సి ని ప్రక్షాళన చేసి, ఖాళీగా ఉన్న ఒక లక్ష 91 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలి. పై డిమాండ్ ను రాజకీయ పార్టీలు అన్ని విధిగా వారి వారి మేనిఫెస్టోలో చేర్చాలి.. లేని పక్షంలో రాబోయే ఎన్నికల్లో విద్యార్థులు అందరూ కలిసి ప్రజల్లో చైతన్యాన్ని నింపి గుణపాఠం చెప్పాల్సి వస్తుందని ఏబీవీపీ హెచ్చరిస్తుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పృథ్వి తేజ, కమల్ సురేష్, శ్రీనాథ్, జీవన్ శ్రీరామ్, రాజు మహేష్, హరిప్రసాద్, సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు