Saturday, April 27, 2024

తెలంగాణ ‘ఓటర్లకు’ బుద్ధి చెబుతున్న కాంగ్రేస్‌ నేతలు

తప్పక చదవండి

కాంగ్రెసులో అప్పుడే ముఖ్యమంత్రి,ఉప ముఖ్యమంత్రి,కీలక మం త్రిత్వ శాఖల వాటాల కోసం పదవుల కుమ్ములాట మొదలైంది. ఒక వైపు ఎన్నికలు ముగిసి, కాంగ్రేసుకు అనుకూలంగా ఫలితాలు వెలువడుతున్న దశలోనే సోషల్‌ మీడియాలో రేవంత్‌ రెడ్డే కాబోయే ముఖ్యమంత్రి అంటూ ప్రచారం మొదలైంది.ఫలితాలు చివరి దశలో ఉండగా రేవంత్‌ రెడ్డి,మీడియాతో మాట్లాడుతూ ఉండగానే అక్కడ గుమికూడన కాంగ్రేస్‌ శ్రేణులు,రేవంత్‌ అభిమానులు ‘‘సీయం..సీయం.’’ అంటూ నినాదాలు చేశారు. ఇలా, సోషల్‌ మీడియాలో రెవంత్‌ రెడ్డి ముఖ్య మంత్రిగా,సీతక్క ఉప ముఖ్య మంత్రిగా లీకులు వెలువడటాన్ని కాంగ్రేసులో సీని యర్‌ నేతలు కలత చెందారు. సీఎంగా రేవంత్‌ రెడ్డి పైనే అధిష్టా నం మొగ్గు చూపుతుందని లీకులు వెలువడుతూన్న దశలో సీని యర్‌ నేతలు ఒక్కసారిగా కోపానికి వచ్చినట్టే తెలిసింది. రేవంత్‌ రెడ్డి కాంగ్రేసులో చేరటాన్ని, పీసీసీ ప్రెసిడెంటుగా నియమించ బడటం.. కాంగ్రేసులో సీనియర్లు లీడర్లు మొదటి నుండి వ్యతిరేకి స్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా కాబోయే ముఖ్య మంత్రి రేవంత్‌ రెడ్డే అంటూ ప్రచారం జరగడాన్ని వారు జీర్ణించుకోలేక పోతు న్నారు. దశాబ్ధాలుగా కాంగ్రేసును నమ్ముకున్న సీనియర్‌ నేతలు పైగా పలుదశల్లో ఉన్నత పదవులు నిర్వహించిన భట్టివిక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, శ్రీధర్‌ బాబు,కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి,దామోదర రాజనరసింహ,కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, జగ్గారెడ్డి మొదలైన వారు రేవంత్‌ రెడ్డిని ‘‘టీడీపీ కోవర్ట్‌’’ అంటూ,’’ చంద్రబాబు ఏజెంట్‌ ‘‘అంటూ ఆయనను గతంలో నిందించిన వారే. ఆయన నాయకత్వంలో పనిచేయటానికి తిరస్కరించిన వారే. వివరాల్లోకి వెళితే…సీఎంగా రేవంత్‌రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో నూ తాము అంగీకరించేది లేదని సీనియర్లు,కేంద్ర అధిష్టాన దూత లకు తెగేసి చెప్పినట్లు అనధికార వార్తలు వెలువడుతు న్నాయి. రేవంత్‌ రెడ్డితో పోల్చితే తాము ఎందులో తక్కువ అని అధిష్టాన దూతలను నిగ్గదీసినట్లు సమాచారం వస్తుంది.ఈ అంశంపై సోమవారం హోటల్‌ ‘ఎల్లా’ లో జరిగిన సమావేశంలో నేతల మధ్య వాగ్వావివాదం జరిగినట్టు తెలుస్తుది.ఒక దశలో సీఎంగా రేవంత్‌ రెడ్డి తప్ప… ఎవరిని ఎంపిక చేసినా తమకు పర్వాలేదని ఉత్తమ కుమార్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, రాజనర్సింహ, రాజగోపాల్‌ రెడ్డి స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తుంది. వారు అధిష్టానదూతల దృష్టికి తీసుకువచ్చిన అంశాల్లో ప్రధానంగా… రేవంత్‌ రెడ్డికి గతంలో ఏమాత్రం పరిపాలన అనుభవం లేదని,ఆయన ఎమ్మెల్యే గా పనిచేశారే గానీ,ఎప్పుడూ ప్రభుత్వ పదవులు నిర్వహించిన పాలనానుభవం లేదనీ,పైగా ‘‘ఓటుకు నోటు’’ కేసులో ఆయన నిందితుడుగా ఉన్నాడని,ఇది పార్టీ ప్రతిష్టకు ఇబ్బందికరంగా ఉంటుందని వారు తమ అభిప్రాయం సూటిగా అధిష్టాన దూతలకు చెప్పినట్లు తెలుస్తుంది.అలాగే రేవంత్‌ రెడ్డి ఎన్నికల ప్రచార సమయంలో రైతులకు ‘‘మూడు గంటల కరెంటు’’ సరిపోతుంది అనడం,ఇతర అంశాలపై కూడా అదుపు లేకుండా మాట్లాడటంపై అధిష్టానానికి ఫిర్యాదు వెళ్లింది.ఇలాంటి వ్యక్తిని సీఎంను చేస్తే ప్రభుత్వానికి,కాంగ్రేసు పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని వారు అధిష్టానానికి చెప్పినట్టుగా తెలుస్తుంది. అలాగే,సీనియర్‌ నేత శ్రీధర్‌ బాబుకు స్పీకర్‌ పదవి ఇస్తామని ప్రతిపాదించగా ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది.అవసరమైతే ఏ పదవీ లేకుండానే పార్టీకి సేవ చేస్తానని చెప్పినట్టు తెలుస్తుంది. భట్టి విక్రమార్కకూడా స్పీకర్‌ పదవిని తిరస్కరించినట్టు తెలుస్తుంది.ఎవరికి వారు సీఎం పదవిని లేదా కీలక శాఖల కోసం పట్టుపడుతున్నట్లు తెలుస్తుంది. సీఎం పదవితో పాటు మంత్రి పదవులపై పార్టీ నేతలు వర్గాలుగా విడిపోయినట్టు తెలిసింది. ఎవరికి వారు పదవుల కోసం కేంద్రంలో తమ లాబీలతో పైరవీలు చేస్తున్నట్టు తెలుస్తుంది. కొందరు నేతలు రేవంత్‌ రెడ్డిని సపోర్టు చేస్తూ ఉండగా,మరికొంతమంది బట్టి విక్రమార్కని,మరికొందరు ఉత్తమ కుమార్‌ రెడ్డిని బలపరుస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో నిజమెంత ఉందో గానీ,అధిష్టానికే మరి కొందరు బెదిరింపులకు, బ్లాక్‌ మెయిలింగ్‌ కు దిగుతున్నట్లు సమాచారం ఉంది.’’ ఏం తమాషా చేస్తున్నారా? ఖమ్మంలో, గాంధీభవన్లో టిడిపి జెండాలు ఎగరేస్తున్నారు? ఇది పార్టీ అనుకుంటున్నారా ఇంకేమైనా అనుకుంటున్నారా మా దగ్గర పదిమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎక్కువ తక్కువ మాట్లాడితే బయటకు వెళ్ళిపోతామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్‌ బెదిరించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో, ఒకవేళ,ఇప్పుడు ఏకంగా రేవంత్‌ ను ముఖ్యమంత్రి గా అధిష్టానం నిర్ణయిస్తే వారు ఆయనకు సహకరిస్తారా? రాష్ట్రంలో పరిపాలన సజావుగా సాగేనా,ఎన్నికలలో ప్రజలకు కాంగ్రేస్‌ పార్టీ,రాహుల్‌ గాంధీ వ్యక్తిగతంగా ఇచ్చిన అలవికాని 6 వాగ్ధానాలు…ఇతర హామీల నెరవేర్పు జరిగేనా? అని గుడ్డిగా కాంగ్రేసుకు ఓటువేసిన ప్రజలలో సందేహాలు తలెత్తుతున్నాయి.ఓటర్లు తలలు పట్టుకుంటు న్నారు. గతంలో కాంగ్రేస్‌ పాలనలో గల లొసుగుల వల్ల,రాష్ట్ర పాలనలో కేంధ్ర అధిష్టాన మితిమీరిన జ్యోక్యం వల్ల యన్‌.టీ.ఆర్‌. నాయకత్వలో తెలుగు దేశం పార్టీ ఆవిర్భవించింది.చంద్రబాబు పాలన సూధీర్గ కాలం ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగింది. కాంగ్రేస్‌,టీడీపీ వివక్షాపూరిత పాలనా లోపాల వల్లనే తెలంగా రాష్ట్ర ఉద్యమం,ఆతరువాత కేసఆర్‌ పాలన వచ్చింది. నిజానికి, గత పది సంవత్సరాలలో బీ.ఆర్‌.యస్‌.ప్రభుత్వపాలనలో అనేక వినూతన సంక్షేమ పథకాలను తీసుకు వచ్చింది. దాదాపు రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ప్రభుత్వ పథకాలలో ఏదో రూపంలో లబ్ధిపొందిన వారు లేరంటే అతిశయోక్తి లేదు.24 గంటల విద్యుత్తు,శుభ్రమైన తాగు నీరు,పుష్కలంగా సాగునీరు, సకా లంలో ఎరువులు, రైతుభీమా, మొదలైన సుమారు 300 పథకాలు చాలా వరకు అమలయ్యాయి. క్షేత్ర స్థాయిలో కొన్నింటి లో అమలులో లోపాలు ఉండవచ్చు. అయితే, 10 సంవత్సరాల పాలన తరువాత ప్రజలలో పాలనా వైఫల్యలపై మొఖమెత్తడం సహజం. కాళేశ్వరంపిల్లర్లు ఒరగటం, నిరుద్యగ సమస్య,ఉద్యోగుల వేతనాలు,డీఏ,ఇతర ప్రయోజనాలలో అసంతృప్తి,పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ పరీక్షల నిర్వాహణ లోపాలు. ముఖ్యమంత్రి,ఇతర మంత్రులు ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు అందుబాటులో ఉండరు అన్న విషయం బాగా ప్రచారంలోకి వచ్చింది. ఏదిఏమైనా,పలు ఎన్నికల సర్వేలలో కూడా కేసీఆర్‌ పై వ్యక్తిగత వ్యతిరేకత వ్యక్తం కాలేదు. ప్రతి పక్షాల నుండి ముఖ్యం గా బీజేపీ నుండి కుటుంబ పాలనగా ముద్ర పడినపప్పటికీ ఐటీ, మున్సిపల్‌, అర్భన్‌,పరిశ్రమల శాఖా మంత్రిగా దేశంలో నెంబర్‌ ఒన్‌ మంత్రిగా కేటీఆర్‌ పేరు తెచ్చుకున్నాడు. అలాగే హరీష్‌ రావు కూడా ఏశాఖ ఇచ్చినా సమర్ధవంతంగా పనిచేశాడు. పార్టీపరంగా వివాద రహితుడిగా, ట్రబుల్‌ షూటర్‌ గా పేరు తెచ్చుకున్నాడు.ఇక కవిత పార్లమెంట్‌ లో ప్రజా సమస్యలను ధైర్యంగా, హిందీ, ఇంగ్లీ షులో అనర్ఘళంగా ప్రస్తావించటంలో తన సమర్ధతను నిరూపించు కున్నది. తెలంగాణలో అనేక ప్రజాసంక్షేమంతో పాటు ఆర్ధిక అభి వృద్ధికి కూడా బాగానే కృషిచేసింది. అనేక జాతీయ, అంతర్జాతీయ ఇండికేటర్స్‌ బీ.ఆర్‌. యస్‌ పాలనకు కితాబులు ఇచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి సంక్షేమలపై దేశ విదేశాల నుండిఅనేక ప్రశంసలు వచ్చాయి.కేసీఆర్‌ ప్రభుత్వ పొడ గిట్టని బీజేపీ కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి అనేక అవార్డులు రివార్డులు కూడా వచ్చాయి.ఏదిఏమైనా అంతిమంగా ప్రజలు తీర్పే ప్రజాస్వామ్యంలో ముఖ్యం .ఆ తీర్పును అందరూ శిరసావహించ వలసిందే. చూద్ధాం… ముఖ్యమంత్రి ఎవరైనా,ఎవరికి మంత్రి పదవులు దక్కినా కాంగ్రేస్‌ ప్రభుత్వం తన సమస్యలను అధిక మించి చక్కని పరి పాలన అంధిస్తుందని, కలతలు, వివాదాలు లేకుండా ఐక్యంగా మంత్రులు ముఖ్యమంత్రికి సహకరించి అవినీతి రహిత సమర్ధ పాలనతో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను సకాలంలో నెరవేస్తుందని ఆశిద్దాం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు