Sunday, April 28, 2024

కలచివేస్తున్న గుండెపోటు మరణాలు

తప్పక చదవండి
  • గుజరాత్‌లో 6 నెలల్లో 1000 మృతి
  • చిన్నాపెద్ద తేడా లేకుండా పెరుగుతున్న గుండెపోటు బాధితుల సంఖ్య
  • 2 లక్షలకుపైగా మందికి సిపిఆర్‌పై అవగాహన

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఆకస్మిక గుండెపోటు మరణాలు అందరినీ కలచివేస్తున్నాయి. పసిప్రాయం మొదలు నడివయస్సు వరకు పలువురు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. మరీముఖ్యంగా యువతే ఎక్కువగా గుండెపోటు బారిన పడి ప్రాణాలు వదులుతున్నారు. ఈ మధ్య నిత్యం ఇలాంటి ఘటనలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా తర్వాత యువగుండెకు ముప్పు వాటిల్లుతోంది. అప్పటివరకూ బాగానే ఉన్నవారు అంతలోనే ఉన్నచోటే కుప్పకూలి గుండెపోటుతో ప్రాణాలు వదులుతున్నారు. ఇక గుజరాత్‌ రాష్ట్రంలో గుండెపోటు మరణాలు మరీ అధికంగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ఏకంగా వెయ్యికిపైగా గుండెపోటు మరణాలు నమోదు కావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చీనీయాంశమవుతోంది. గడిచిన ఆరు నెలల్లో గుండెపోటు కారణంగా 1,052 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వెల్లడిరచింది. వీరిలో 80 శాతం మంది 1125 ఏళ్ల మధ్య ఉన్న వారేనని తెలిపింది. ఇలా గుండెపోటు ఘటనలు పెరుగుతోన్న నేపథ్యంలో సీపీఆర్‌పై దాదాపు 2లక్షల మంది టీచర్లు, కాలేజీ ప్రొఫెసర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ‘గుండెపోటుతో ఆరు నెలల్లో 1,052 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 80శాతం మంది 1125 ఏళ్ల మధ్య వయసువారే. ఈ విద్యార్థులు, యువకులకు ఊబకాయులు కూడా కాదు. హృదయ సంబంధిత కారణాలతో రోజుకు సగటున 173 కాల్స్‌ ఎమర్జెన్సీ విభాగానికి వస్తున్నాయి’ అని గుజరాత్‌ విద్యాశాఖ మంత్రి కుబేర్‌ డిరడోర్‌ వెల్లడిరచారు. ‘బాధితుల్లో ఎక్కువగా చిన్నవయసు వారే ఉండటంతో గుండెపోటుపై యువకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. క్రికెట్‌ ఆడుతుండగా, గార్బా నృత్యం చేస్తున్న సమయంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మరణాల నేపథ్యంలో టీచర్లు సీపీఆర్‌పై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దాదాపు రెండు లక్షల మంది టీచర్లు, ప్రొఫెసర్లకు శిక్షణ ఇవ్వనున్నాం. ఈ శిక్షణలో 2,500 మంది వైద్య నిపుణులు పాల్గొంటారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ శిక్షణా కార్యక్రమంలో ఉపాధ్యాయులందరూ భాగస్వామ్యం కావాలి’ అని మంత్రి సూచించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు