Saturday, April 27, 2024

వరుసగా రెండోరోజు

తప్పక చదవండి
  • నష్టాల్లో ముగిసిన మార్కెట్లు..
  • 534 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌..!

దేశీయ బెంచ్‌ మార్క్‌ సూచీలు బుధవారం నష్టాల్లో ముగిశాయి. సూచీలు గరిష్ఠానికి చేరుకోగా మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నేపథ్యంలో మార్కెట్లు వరుసగా రెండోరోజు నష్టపోయాయి. ఉదయం 71,832.62 పాయింట్ల వద్ద నష్టాలతో మొదలైన సెన్సెక్స్‌ ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేదు. ఇంట్రాడేలో 71,862 పాయింట్ల వరకు చేరినా.. చివరకు 535.88 పాయింట్ల నష్టంతో 71,356.60 వద్ద స్థిరపడిరది. నిఫ్టీ 148.45 పాయింట్ల నష్టంతో 21,517.35 వద్ద ముగిసింది. మరో వైపు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అదానీ గ్రూప్‌ షేర్లు లాభాల్లో కొనసాగాయి. బుధవారం ట్రేడిరగ్‌లో దాదాపు 1,917 షేర్లు పెరగ్గా.. 1,390 షేర్లు పతనమయ్యాయి. మరో 79 షేర్లు మాత్రం మారలేదు. సెన్సెక్స్‌లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, టెక్‌ మహీంద్రా నష్టపోయాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. హిండెన్‌బర్గ్‌ ఆరోపణలపై అదానీ కేసుకు సంబంధించిన సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. ఇందులో అదానీ గ్రూప్‌కు ఊరట కలిగింది. సెబీ చేపట్టిన దర్యాప్తులో జోక్యం చేసుకునేందుకు నిరాకరిస్తూ ప్రత్యేక దర్యాప్తు బృందం అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అదానీ షేర్లు భారీగా పెరిగాయి. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌ షేరు 11 శాతం, అదానీ టోటల్‌ గ్యాస్‌ 10 శాతం పెరిగాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 2.45శాతం, అదానీ గ్రీన్‌ ఎనర్జీ 6.08శాతం, అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ 1.53శాతం, అదానీ పవర్‌ 4.99శాతం, అదానీ విల్మర్‌ 4.02 శాతం, అంబుజా సిమెంట్‌ 0.76శాతం లాభపడ్డాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు