Tuesday, May 7, 2024

ఆటోవాలా.. మహాలక్ష్మితో దివాలా..?

తప్పక చదవండి

‘ప్రపంచ ప్రజా రవాణా వ్యవస్థలో విమానయానం, రైలు, రోడ్డు మార్గాలు ఎంతో ముఖ్యమైనవి. అంతేకాకుండా ప్రపంచ, దేశ, రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో ప్రాముఖ్యత గలవి. వీటిలో సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలకు రైలు, రోడ్డు మార్గాలు ఎక్కువ ఉపయోగపడతాయి. రోడ్డు మా ర్గంలో బస్సులు, ఆటోలు సేవలందిస్తాయి. బస్సుల్లో ప్రభుత్వం, ప్రైవేటివి ఉంటాయి. ఇక ఆటోలు జీవనో పాధి కోసం నడుపుకునేవారి వద్దే ఉంటాయి. మరి అలా ంటి ఆటోలు తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసు కొచ్చిన మహాలక్ష్మి పథకంతో ప్రస్తుతం కొంత దివాలా తీస్తు న్నాయి. అసెంబ్లీ ఎన్నికల కాంగ్రెస్‌ హామీల ఆరు గ్యారెం టీల్లోని ఈపథకాన్ని డిసెంబర్‌ 9నుంచి అమలు చేస్తుండగా ఈ సమస్య ఏర్పడిరది. ఆర్టీసీబస్సుల్లో ఆడ పిల్లలు, మహిళలు, ట్రాన్స్‌ జెండర్లకు పూర్తిగా ఉచిత ప్రయాణంతో ఆటోలా ఉపాధిపై ప్రభావం చూపింది. దీంతో ఆటో వాళ్లు సర్కారును నిరసిస్తూ తప్పక రోడ్డెకాల్సి వచ్చింది.
లక్షల మంది ఉపాధి… అయితే తెలంగాణలో నవంబర్‌ 30వ తేదీ వరకు మొత్తం రిజిస్టర్డ్‌ వాహనాల సంఖ్య 1.6 కోట్లకు చేరింది. ఇందులో సుమారు 4.7లక్షల వరకు ఆటోలు ఉన్నట్లు రాష్ట్ర రవాణా శాఖ నివేదిక పేర్కొంది. ఈ మధ్య తీసుకున్న కొత్తవాటి చేరికతో సంఖ్య మరింత పెరిగే ఉంటుంది. సుమారు కోటి జనా భాలో.. ప్రజా రవాణాలో 35లక్షల మంది ప్రయా ణికుల అవసరాలు ఆటోలు తీరుస్తున్నట్లు ట్రాఫిక్‌ పోలీసు వర్గాల అంచనా. ఆ ఆటోల ఫిట్‌నెస్‌ కు ఏడాది కోసారి రూ.700, సర్టిఫికెట్‌ కు రూ.500 ఛార్జీతో కలిపి మొత్తం రూ.1200 అవుతుంది. అంతేగాక కేంద్రంలోని బీజేపీ మోదీ ప్రభుత్వం విపరీతంగా డీజిల్‌, పెట్రోల్‌ ధర పెంచేసింది. ఇలాంటి తరుణంలో రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంతో వారు ఉపాధి కోల్పోతు న్నారు. దాంతో ధర్నాలు చేస్తున్నారు. గతంలో హైదరా బాద్‌ మహానగరంలో ఒక ఆటోవాలాకు.. అన్ని ఖర్చులు ఫోనూ రోజుకు రూ.1,500 వరకు మిగిలేది. గ్రామీణ ప్రాంతాల్లో కనీసం రూ.800-1,000 మధ్య ఉపాధి దొరికేది. ప్రస్తుత రోజుల్లో పట్నంలో రూ.500. ఇక పల్లెల్లో చెప్పలేం?.
మార్పులు అవసరం.. దీంతో ఆటో వాలాలు చేసేదేంలేక ఈనెల 4న శుక్రవారం ఇందిరా పార్కు వద్ద మహాధర్నా చేపట్టను న్నట్లు తెలిపారు. దీనికితోడు ఆర్టీసీలోని అద్దె బస్సుల యజమానులు ఈనెల 5న సమ్మెకు దిగుతామని ప్రకటిం చారు. ఎందుకంటే.. ప్రయాణికుల రద్దీ మరీ ఎక్కువ పెర గడంతో బస్సులు పాడవుతాయని ఈ నిర్ణయం తీసుకు న్నారు. ఈ పథకం వల్ల చాలా చోట్ల బస్సుల్లో సీట్ల కోసం మహిళలు జుట్లు పట్టుకొని, బట్టలు చిరిగేదాకా కొట్టుకున్న ఘటనలు ఈ మధ్య వెలుగు చూశాయి. ఇలాంటి వాటిని ప్రభుత్వం దృష్టిలో ఉంచు కొని మహాలక్ష్మి పథకంలో మార్పు చేర్పులు చేయాలి. అందులో భాగంగా వయోవృ ద్ధులు, ఐదేళ్ల వయసు నుంచి డిగ్రీలోపు చదువు తున్న ప్రతి ఒక్కరికి పూర్తి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే బాగుం టుంది. లేదంటే, ప్రస్తుత జీరో చార్జి టికెట్లకు బదులు.. గతంలో తీసుకు న్న చార్జీల్లో టికెట్‌ పై 50 శాంతం(సగం) టికెట్‌ రుసు ము తీసుకోవాలి. దీనివల్ల ఆర్టీసీకి ప్రస్తుతం వస్తున్న రూ.3-4 కోట్ల నష్టాన్ని కొంత మేర తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఆటోల వినియో గం మళ్లీ పెరిగి వారికి ఎంతోకొంత ఉపాధి దొరుకుతుంది.
ఉపాధి కల్పించాలి.. ఈవిషయంలో ప్రభుత్వ మార్పు చేర్పులు చేయకున్నా సర్కారుకు ఇది సాధ్యపడక పోయినా ఆటో వాళ్లకు మాత్రం కొన్ని ఉపాధి అవకాశాలు కల్పిం చాలి. అందులో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి లైసెన్సు లు ఉచితంగా జారీ చేయాలి. సబ్సిడీలో ఆటోలు ఇప్పించి ప్రభుత్వ రంగ సంస్థ(కార్పొరేషన్లకు ఎటాచ్‌ చేయాలి)ల్లో పెట్టించాలి. వారికొచ్చే నెలవారి బిల్లు క్రమంతప్పకుండా అందేలా గవర్నమెంట్‌ చూడాలి. ఈ విధంగా చేయడం వల్ల ఆటో వాలాలకు ఉపాధి దొరుకుతుంది. దాంతో ప్రభుత్వంపై వ్యతిరేకత పోతుంది. ఉచిత బస్సు మహాలక్ష్మి పథకం సాఫీగా కొనసాగడానికి అవకాశం ఉంటుంది’.

  • తలారి గణేష్‌ 9948026058
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు