Friday, May 3, 2024

సరూర్‌ నగర్‌ సర్కిల్‌ -5..

తప్పక చదవండి
  • ఇచ్చట అన్ని అక్రమ నిర్మాణాలు నిర్మించబడును…?
  • అక్రమ నిర్మాణ దారులకు కొండంత అండదండలు అందిస్తున్న టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు..?

సరూర్‌ నగర్‌ (ఆదాబ్‌ హైదారాబాద్‌) : జి.హెచ్‌.ఎం.సి. ఎల్బీనగర్‌ జోన్‌, సరూర్‌ నగర్‌ సర్కిల్‌ -5లో అంతులేని అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్నారు కొందరు.. ప్రభుత్వ నిబంధనలు మాకు వర్తించవు అంటూ డొమెస్టిక్‌ అనుమతులు తీసుకొని కమర్షియల్‌ భవనాలు నిర్మించడం,రెండు, మూడు అంత స్తులకు అనుమతులు తీసుకొని నాలుగు, ఐదు అంతస్తులు నిర్మించడం సరూర్‌ నగర్‌ సర్కిల్‌ -5 లో కామన్‌గా మారిపోయింది.. ఇక్కడ అన్ని అక్రమ నిర్మాణాలు నిర్మించబడును అనే విధంగా సరూర్‌ నగర్‌ సర్కిల్‌లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్నారు.. చైతన్యపురి డివిజన్‌ పరిధిలో ఓ నిర్మాణ దారుడు రెండు అంతస్తుల కు అనుమతులు తీసుకొని ప్రభుత్వ నిబంధ నలు తుంగలో తొక్కి ఏదేచ్చగా తన ఇష్టాను సారంగా అదనంగా ఒక అంతస్తు,పెంట్‌ హౌస్‌ నిర్మిస్తున్నాడు, మరో నిర్మాణ దారులు, ప్రభుత్వం నుండి రెండు అంతస్తుల భవనానికి అనుమతులు దరఖాస్తు చేసుకున్నారు.. టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ఆ భవనానికి అనుమతులు ఏలాంటి అనుమతులు ఇవ్వలేదు.. కానీ సదరు నిర్మాణ దారులు తమ ఇష్టానుసారంగా కమర్షి యల్‌ భవనాన్ని నిర్మిస్తున్నారు. మరో నిర్మాణ దారుడు ఆర్‌.కే.పురం డివిజన్‌ పరిధిలో రెండు అంతస్తులకు అనుమతులు తీసుకొని ప్రభుత్వ నియమ, నిబంధనలు ఉల్లంఘించి, నాలుగు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తు న్నాడు… మరో ఇద్దరు నిర్మాణ దారులు సరూర్‌నగర్‌ డివిజన్‌ పరిధిలో ప్రభుత్వం నుండి ఏలాంటి అనుమతులు లేకుండా షేడ్స్‌ నిర్మిస్తున్నారు.. ఈలాంటి అక్రమ నిర్మాణాలపై అధికారులకు ఫిర్యాదులు చేస్తే వాటిని పరిశీలించే లోపే నిర్మాణాలు పూర్తి అవుతున్నాయని సామాజిక కార్యకర్తలు వా, పోతున్నారు.. ఈలాంటి అక్రమ నిర్మాణాలు సరూర్‌ నగర్‌ సర్కిల్‌ -5లో పదుల సంఖ్యలో ఉన్న అధికారులు అటు వైపు కన్నెత్తి చూడని వైనం, అందుకు కారణం అందుకున్న చీకటి ముడుపులే అని, అక్రమ నిర్మాణ దారులకు టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు కొండంత …అండదండలు పుష్కలంగా ఉన్నాయని, టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల పై విజిలెన్స్‌ అధికారులు లోతైన దర్యాప్తు జరిగితే అసలు వ్యవహారం బయటపడే అవకాశం, ఉందని సామాజిక కార్యకర్తలు వాపోతున్నారు.. మరికొన్ని అక్రమ నిర్మాణాలపై.. మరో కథనంతో మీ ముందుకు…

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు