- జీతాలపై క్లారీటీ ఇచ్చిన రవాణా, బీసీ సం క్షేమశాఖా మం త్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ : ప్రజా పాలనపై సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో నియోజకవర్గ స్థాయి కాం గ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది.. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా రవాణా, బీసీ సం క్షేమశాఖా మం త్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.రేపటి నుంచి వచ్చే నెల జనవరి 6వ తేదీ వరకు జరిగే ప్రజా పాలనను విజయవంతం చేయాలని కోరారు .అర్హులైన ప్రతి కుటుంబానికి ఆరు హామీలు వచ్చేలా ప్రభుత్వం దరఖాస్తు ఫారాలను అందిస్తుందని ఆయన తెలిపారు. అప్పు లపై స్వేద పత్రాన్ని విడుదల చేసిన బీఆర్ఎస్ నాయకులు.. ముందుగా కల్వ కుంట్ల కుటుంబీకుల ఆస్తుల నిర్మా ణ పత్రాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఉద్యో గులు, పెన్షనర్లకు ప్రతినెలా 1 నుం చి 5వ తేదీలోపు జీతాలు అం దేలా ప్రభుత్వం చర్య లు తీసుకుం టుందని మం త్రి పొన్నం ప్రభాకర్ వెల్లడిం చారు. అనం తరం కరీం నగర్ జిల్లా తిమ్మా పూర్ మం డలం ఆలుగునూర్ లోని శ్రీ రాజరాజేశ్వ రి దేవి ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యే క పూజలు చేశారు.
ఇచ్చిన హామీలపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది…
ఎన్ని కల్లో ఇచ్చి న హామీలను అమలు చేసేం దుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిన విషయం తెలిసిందే.. ఎన్ని కల సమయంలో ఇచ్చి న ఆరు హామీల అమలుకు లబ్ధిదారులను ఎం పిక చేసేం దుకు కాం గ్రెస్ ప్రభుత్వం సరికొత్త కార్య క్రమానికి శ్రీకారం చుట్టిం ది. ఈ నెల 28 నుం చి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపరిపాలన నిర్వహిస్తోంది.. ఈ ప్రజాపరిపాలన కార్య క్రమం లో భాగం గా పది రోజుల పాటు గ్రామసభలు నిర్వ హిం చి ప్రజల నుం చి నేరుగా అధికారులు దరఖాస్తులు తీసుకోనున్నా రు. అయితే.. ఈ దరఖాస్తులు ఎక్క డ దొరుకుతాయి.. ఎలా పూరిం చాలి.. దానికి ఎలాం టి పత్రాలు కావాలి వంటి సందేహాలు ప్రజలకు ఉన్నా యి. అయితే.. వాటన్నిం టికీ చెక్ పెడుతూ ప్రభుత్వం పబ్లిక్ అడ్మి నిస్ట్రేషన్ దరఖాస్తు ఫారాన్ని విడుదల చేసిం ది. తెలం గాణ ప్రభుత్వం అభయహస్తం పబ్లిక్ గవర్నెన్స్ అప్లికేషన్ పేరుతో దరఖాస్తు ఫారమ్‌ను సిద్ధం చేసిం ది. అయితే.. ఒక్కో పథకానికి ప్రత్యే కం గా దరఖాస్తు చేయాల్సి న అవసరం లేకుం డా.. అం దరికీ ఒకే దరఖాస్తును సిద్ధం చేసింది.