Sunday, September 15, 2024
spot_img

హరీష్ రావు నోటి దూల వల్ల ఆగిన రైతు బంధు..

తప్పక చదవండి
  • 2 రోజుల క్రితం రైతుబంధు నిధుల విడుదలకి అనుమతి ఇచ్చిన ఈసీ..
  • రైతు బంధు కు ఇచ్చిన అనుమతి ని ఉపసంహరించుకున్న ఈసీ..
  • హరీష్ రావు రాజకీయ లబ్ధి కోసం సిద్దిపేటలో తన నోటి దూల వల్ల ఆగిన రైతు బంధు
  • తెలంగాణ శాసనసభకు సాధారణ ఎన్నికలు, 2023 సందర్భంగా ఎంసీసీ మరియు అనుబంధ ఎన్నికల నిభందనలు ఉల్లంఘించిన కారణంగా రైతుబంధును నిలిపివేస్తున్నట్లు వెల్లడించిన ఈసీ
  • రైతుబంధు నిధులు విడుదల చేయకుండా కుట్ర
  • ప్రభుత్వ తీరుతోనే ఈసీ నిర్ణయం
  • నెపాన్ని కాంగ్రెస్‌పైకి నెట్టే కుట్ర
  • రైతుబంధు నిలిపివేతపై రేవంత్‌ వ్యాఖ్య

హైదరాబాద్ : రైతు బంధు విడుదలకు ముందు అనుమతి ఇచ్చిన ఎన్నికల సంఘం తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అందుకు గల కారణాలను ఈసీ వెల్లడించింది. దీనికి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలే కారణమని ఎన్నికల సంఘం తెలిపింది. అయితే, అంతకు ముందు ఈసీ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం రైతు బంధుకు సంబంధించి నేతలెవరూ పబ్లిసిటీ చేసుకోవద్దు. అయితే రైతు బంధు డబ్బులు మంగళవారం రైతుల అకౌంట్లో పడతాయని హరీశ్ రావు ఓ సభలో తెలిపారు. ఎన్నికల ప్రచార సభల్లో రైతుబంధు గురించి ప్రస్తావించరాదని.. లబ్ధి పొందేలా వ్యాఖ్యలు చేయవద్దని ముందే ఈసీ షరతు విధించింది. కాగా, రైతుబంధుపై మంత్రి హరీశ్రావు చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి విరుద్ధమని పేర్కొంటూ తాజాగా ఈసీ అనుమతి నిరాకరించింది. దీంతో, బీఆర్ఎస్కు షాక్ తగిలింది.


రైతుబంధు నిలిపివేతపై రేవంత్‌ వ్యాఖ్య

- Advertisement -

రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశ్యం మామా ` అల్లుళ్లకు లేదని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అన్నారు. హరీష్‌ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించు కుంటున్నట్టు ఈసీ ఆదేశాలు ఇవ్వడమే దీనికి నిదర్శనమన్నారు. ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు న్యాయం జరగదన్నారు. రాష్ట్రంలో రైతులు ఆందోళన చెందవద్దన్నారు. మంత్రి హరీశ్‌ రావు వల్లే రైతుబంధు ఆగిందని.. కాంగ్రెస్‌ వచ్చిన 15 రోజుల్లో పైసలిస్తమని రేవంత్‌ రెడ్డి తెలిపారు. రైతుబంధు పంపిణీకి ఈసీ ఇచ్చిన అనుమతిని కేసీఆర్‌ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఏదో ప్రయోజనం కోరి చివరి వరకూ రైతుబంధును పంపిణీ చేయకుండా నిలిపివేస్తే.. ఈలోగా ఈసీకి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఈసీ వెనక్కి తీసేసుకుంది. ఈ నెల 24 నుంచి రైతుబంధు అనుమతికి ఎలక్షన్‌ కమిషన్‌ అనుమతి ఇచ్చింది. అయితే సీఈసీ నిబంధనలు ఉలంగించి నందుకు అనుమతి రద్దు చేసింది. ’రైతుబంధు’ నిధుల విడుదలకు ఈసీ అనుమతి వెనక్కు తీసుకున్న నేపథ్యంలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి స్పందించారు. ఈసీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ట్వీట్‌ చేశారు. ’రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప నిజంగా రైతులకు మేలు చేయాలని ఉద్దేశం మామ, అల్లుళ్లకు లేదు. మంత్రి హరీష్‌ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతి వెనక్కు తీసుకుంటున్నట్లు ఈసీ ఆదేశాలివ్వడం దీనికి నిదర్శనం. ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప తెలంగాణలో రైతులకు న్యాయం జరగదు. రైతులు ఆందోళన చెందొద్దు. 10 రోజుల్లో కాంగ్రెస్‌ రాగానే రూ.15 వేల రైతు భరోసా అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తాం.’ అని పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు