Friday, May 3, 2024

రోడ్లను కబ్జా చేస్తారు ఇల్లు కట్టేస్తారు

తప్పక చదవండి
  • షాద్‌ నగర్‌ మున్సిపాలిటీ పరిధిలో అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు..
  • అధికారుల పర్యవేక్షణ లేక యదేచ్ఛగా నిర్మాణాలు..
  • 40 ఫీట్ల రోడ్డు కాస్త నాలుగు ఫీట్ల గల్లిగా తయారు చేశారు..
  • ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్‌.. నిద్రమత్తులో మున్సిపల్‌ అధికారులు..

షాద్‌ నగర్‌ : షాద్‌ నగర్‌ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలకు అంతులేకుండా పోతోంది. అక్రమార్కులకు అడ్డుకట్ట వేసేవారే లేకుండా పోయా రు. ఏ వీధిలో చూసినా రోడ్లను కబ్జా చేస్తూ.. పార్కింగ్‌కు సెల్లార్ల ను వదిలేయకుండా.. బాల్కానీలను పెంచి బహుళ అంతస్థులు నిర్మిస్తున్నారు. అనుమతులు తీసుకోకుండా దర్జాగా ఇల్లు కట్టేస్తు న్నారు ఇంతజరుగుతున్నా మున్సిపల్‌ అధికారులు నిమ్మకు నీరె త్తినట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకోవాలని ఇటీవల మున్సిపల్‌ పట్టణ అభివృద్ధి శాఖ మున్సి పల్‌ కమిషనర్లకు సూచించినా వారిలో కదలిక కనిపించడం లేదు.. షాద్‌ నగర్‌ మున్సిపల్‌ అధికారులు కార్యాలయాలకే పరి మితం కావడంతో అక్రమ కట్టడాలు కొనసాగుతూనే ఉన్నాయి. క్షేత్రస్థాయిలో అక్రమ కట్టడాలను గుర్తించాల్సింది పోయి తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. మున్సి పాలిటీ పరిధిలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొందరు జీప్ల్‌స టూకు అనుమతి తీసుకొని ఐదు అంత స్థుల భవనాలను నిర్మిస్తున్నారు. ఈ విధంగా తప్పుడు అనుమ తులతో ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిద్ర మత్తులో తూగుతున్నారన్న ఆరోపణలు వస్తు న్నాయి. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకులోనై, మామూళ్లకు అలవాటు పడే అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. కొందరు పార్కిం గ్‌కు సెల్లార్స్‌ వదిలేయకుండా బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టి యథేచ్ఛగా అద్దెకు ఇచ్చుకుంటు న్నారు. ఇప్పటికైనా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, టౌన్‌ప్లానింగ్‌ అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలపై కొరడా రaుళిపించాలని స్థానికులు కోరుతున్నారు..
భూముల ధరలకు రెక్కలు రావడంతో కొందరు రోడ్లను దర్జాగా కబ్జా చేస్తున్నారు. పాత జాతీయ రహదారి నుండి 40 ఫీట్ల రోడ్డును కాలనీ దగ్గరికి వచ్చేసరికి నాలుగు ఫీట్ల గల్లీలుగా మార్చేస్తున్నారు.. యదేచ్చగా రోడ్లను ఆక్రమిస్తూ ఇండ్లు కట్టేస్తున్నారు నానాటికి కాంక్రీట్‌ జంగల్‌గా తయారవుతున్న ఈ నగరంలో తిరగడానికి దేవుడెరుగు కాస్తంత వర్షం పడిరదంటే నీరు బయటకు పోకుండా చెరువుల్లా కాలనీలు తయారవుతున్నాయి కొందరు అక్రమార్కులు అధికారుల చేతులు తడుపుతూ.. నాయకుల అండతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారనే విమర్శలు వస్తు న్నాయి. నగరంలో మూడంతస్తులకు పైన నిర్మాణాలు చేపట్టాలంటే ఆ భవనం చుట్టూ ఫైర్‌ ఇంజిన్‌ తిరిగేంతా స్థలం, ఇంకుడు గుంతలు, సెల్లార్‌, భవిష్యత్‌ రోడ్డు విస్తరణ అనుకూ లంగా ఉండాలి. కానీ ఇవేమి పాటించకుండానే ఇష్టం వచ్చిన ట్లుగా నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే ఈ నిర్మాణాల్లో రాజకీయ జోక్యం ఎక్కువ అవడంతో అడ్డూఅదుపు లేకుండా పోతుంది ఇంత జరుగుతున్న మున్సిపల్‌ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అక్రమ కట్టడాలకు చర్యలు ఎక్కడ అని స్థానికులు హెచ్చరిస్తున్నారు. అక్రమార్కులు నిబంధనలను గాలికి వదిలేసి కొంతమంది బడా నాయకుల అండదండలు ఉండడంతో పనులు కాని చేస్తున్నా రు. దీనితో మున్సిపాలిటీ ఆదాయానికి భారీ గండి పడుతుంది. అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే ఇంతటివారైనా ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని చాలా సందర్భాలలో అధికారు లు చెప్పిన వారిలో కదలిక కనిపించడం లేదు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లోన్కె మామూళ్లకు అలవాటు పడి అక్రమ నిర్మాణాలనుఅడ్డుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.. విధులను ఆచరించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతు న్నారని. అధికారులకు ఫిర్యాదులు చేస్తే నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం తప్ప అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకున్న పాపాన పోకపోగా అటువైపు కన్నెత్తి చూడటం కూడా లేదని స్థానికులు చెబుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు