Tuesday, October 15, 2024
spot_img

నేడు ప్రమాణస్వీకారం

తప్పక చదవండి
  • ఉదయం 11 గంటలకు ప్రొఫెసర్‌ కోదండరామ్‌, మీర్‌ అలీఖాన్‌ల ఎమ్మెల్సీలుగా ప్రమాణం
  • మండలి సభ్యులుగా నామినేట్‌ కావడంతో ప్రమాణానికి రాక

హైదరాబాద్‌ : శాసనమండలికి నియమితులైన ప్రొఫెసర్‌ కోదండరామ్‌, మీర్‌ అలీఖాన్‌లు మంగళవారం ప్రమాణం చేయనున్నారు. ఈ మేరకు మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడడ్డికి సమాచారం అందించారు. నిజానికి సోమవారమే వారు ప్రమాణ స్వీకరం చేయాల్సి ఉంది. ఈ మేరకు వారు మండలికి వచ్చినా ఛైర్మన్‌ రాకపోవడంతో వెనుదిరిగారు. ప్రమాణ స్వీకారం గురించి మండలి ఛైర్మన్‌ కు సమాచారం ఇవ్వలేదని టీజెఎస్‌ అధ్యక్షులు కోదండరాం అన్నారు. ఉదయం 11 గంటలకు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయడానికి కోదండరాం,అలీఖాన్‌ లు మండలికి వెళ్లారు. అయితే అక్కడ మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అందుబాటులో లేరు. దీంతో కాసేపు అక్కడే ఎదురు చూశారు. అనంతరం మాట్లాడిన ఆయన.. తాము మండలి ఛైర్మన్‌ కు సమాచారం ఇవ్వకుండా వచ్చామన్నారు. మండలి ఛైర్మన్‌ కు ఆరోగ్యం బాగాలేదని చెప్పారు..అయితే వస్తారేమోనని కాసేపు వెయిట్‌ చేశామన్నారు. జనవరి 30న ఉదయం 9.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పారు. సెక్రటరీతో మండలి ఛైర్మన్‌ కు సమాచారం పంపించామన్నారు. మండలి ఛైర్మన్‌ తమకు ఫోన్లో టచ్‌ లోకి రాలేదన్నారు. గవర్నర్‌ కోటాలో ఇంతకుముందు ఇద్దరిని నామినేట్‌ చేసిన వారి విషయంలో కోర్టు కేసు నడుస్తుందన్నారు. రాజ్యాంగ బద్దంగానే తాము నామినేట్‌ అయ్యామన్నారు. తమ ఎన్నికకు సంబంధించి గవర్నర్‌ కూడా గెజిట్‌ విడుదల చేసిందని చెప్పారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు