(ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడవడమే ఇతగాడి క్వాలిఫికేషన్.. )
- లక్డారంలో 4 ఎకరాల అనుమతితో 15 ఎకరాలు తవ్విన వైనం..
- కాసులకు కక్కుర్తి పడి ఆ వైపు చూడని మైనింగ్ అధికారులు..
- అనుమతులు సంపూర్తిగా లేకుండానే అడ్డగోలు దందా..
- పొల్యూషన్, ఇరిగేషన్ ఏన్.ఓ.సి లు ఇతగాడికి అవసరం లేదు..
- 100ల కోట్ల అక్రమాలపై అలుపెరుగని పోరాటం చేసిన న్యాయవాది రవి కృష్ణ..
- మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి వెళ్లిన అక్రమ మైనింగ్ వ్యవహారం..
- తక్షణమే విచారణకు ఆదేశించిన మంత్రి..
- సంగారెడ్డి ఆర్డీఓ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కమిటీ వేసిన జిల్లా కలెక్టర్ ..
- తొలిరోజే అనేక అక్రమాలను గుర్తించిన కమిటీ..
- 15 రోజుల్లో విచారణ జరిపి చర్యలు తీసుకొంటామన్న ఆర్డీఓ రవీందర్ రెడ్డి
నువ్వు ఎమ్మెల్యే తమ్ముడివా..? మీ కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉందా..? ఇంకేముంది బాస్.. రెచ్చిపో.. ఇల్లీగల్ గా నీకు నచ్చింది చేసేసుకో.. ఎవరూ నీ జోలికి రారు.. నువ్వు చేసే అవినీతిని సైతం నీతిమయం చేసేస్తారు.. అధికారులు మీ పాదాల చెంత వాలిపోతారు.. దానికి మీరు చేయవలసింది.. అధికార బలాన్ని వినియోగించుకోవడం.. కాస్తంత డబ్భులు ఖర్చుపెట్టడం అంతే.. రోజుల్లోనే మీరు లక్షాధికారులు కావచ్చు.. లక్ బాగుంటే కోటీశ్వరులు అయిపోవచ్చు.. ఛలో.. ఈ కోవకే చెందుతారు పఠాన్ చెరు బీ.ఆర్.ఎస్ ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి.. ఆయన అవినీతిపై ఒక లుక్ వేద్దాం..
హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లాలో, పఠాన్ చెరువు నియోజక వర్గం, లక్డారం గ్రామ శివారులో సర్వే నెంబర్ 738 ప్రభుత్వ భూమిలో అడ్డగోలుగా మైనింగ్ తవ్వకాలు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు భారీగా కన్నం పెడుతున్నారు .. ఎలాంటి ఎన్‌ఓసి లు లేకుండా విచ్చల విడిగా మైనింగ్ తవ్వకాలు చేస్తూ కోట్లు కొల్లగొడుతున్న గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు మధు సుధన్ రెడ్డి, నాలుగెకరాల అనుమతితో.. పది హేను ఎకరాల మైనింగ్ అక్రమంగా తవ్వి 100 లకోట్లు కొల్లగొట్టాడు అక్రమార్కుడు.. వాల్టా చట్ట నిబంధనలకు తూట్లు పొడిచి, యథేచ్ఛగా లక్డారం పెద్ద చెరువును కలుషితం చేస్తూ,స్థానిక ప్రజలు రోగాల బారిన పడటానికి కారకుడయ్యాడు మధుసూదన్ రెడ్డి.. తన అన్న స్థానిక ఎమ్మెల్యే అవ్వడంతో ఇష్టారీతితో అక్రమాలకు పాల్పడినారనే విమర్శలు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున వెల్లువెత్తతున్నాయి..అక్రమ మైనింగ్ పై లక్డారం ప్రజలతో పాటు, రైతులకు నష్టం కలుగకుండా,సహజ వనరులు కలుషితం కాకుండా,అవినీతికి తావు లేకుండా ఉండుటకు ఆధారాలతో అలుపెరగని పోరాటం చేసిన న్యాయవాది రవికృష్ణ.. గత ప్రభుత్వంలో ఎన్ని పిర్యాదులు చేసిన అధికారులు పట్టించుకోక పోవడంతో.. రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ దృష్టికి ఆధారాలతో న్యాయవాది రవి కృష్ణ తీసుకెల్లాడు..దీనికి స్పందించిన మంత్రి తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసి అక్రమాలకు కళ్లెం వేశాడు మంత్రి.. క్రషర్ల ఆగడాలు, భూ కబ్జాలు, అక్రమ మైనింగ్ ల పై మంత్రి సీరియస్ అవ్వడంతో కలెక్టర్ తక్షణమే సంగారెడ్డి డివిజన్ ఆర్డీఓ సమక్షంలో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశారు.. నిబంధనలు పాటించడం లేదని, పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారని వాటిని, రక్షించాలని ప్రజల గొంతుకగా మారినా రవికృష్ణ నాటి ప్రభుత్వంలో ఎన్ని పిర్యాదులు చేసిన పట్టించుకోలేదు.. మంత్రి దామోదర్ రాజా నర్సింహా ఆదేశాలు ఇస్తే గాని అధికారులు అక్రమాలపై చర్యలు తీసుకొకపోవడం..మైనింగ్, పొల్యూషన్,ఇరిగేషన్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.. ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొడుతూ, అధికారం అడ్డం పెట్టుకొని,అక్రమాలకు పాల్పడి వందల కోట్లు గత ప్రభుత్వంలో దొడ్డి దారిన సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.. అధికార వ్యామోహంతో చేసిన వీరి అక్రమాలకు చరమ గీతం పాడే విధంగా మంత్రి దామోదర కాంగ్రెస్ ప్రభుత్వంలో పారదర్శకమైన పాలన అందడం కోసం తీసుకున్న నిర్ణయంతో హర్షం వ్యక్తం చేశారు.. లక్డారం గ్రామ ప్రజలు.. జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయడంతో తొలిరోజు సంగారెడ్డి జిల్లా ఆర్డీఓ కార్యాలయంలో అధికారులు సమావేశమయ్యారు.. సమావేశ అనంతరం అక్రమ మైనింగ్ నడిపిస్తున్న ఎమ్మెల్యే తమ్ముడి అక్రమ దందాపై విచారణ మొదలు పెట్టారు.. అధికారులు అక్కడికి వెళ్లడంతో కళ్ళు బైర్లు కమ్మే నిజాలు బట్టబయలు అయ్యాయి.. కమిటీ ఆకస్మికంగా తనిఖీ చేయడంతో పఠాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి అక్రమంగా మైనింగ్ నడుపుతున్నట్లు గుర్తించారు. ఎలాంటి అనుమతి లేకుండా నే జిలిటెన్ స్టిక్స్ తో బ్లాస్టింగ్స్ చేస్తూన్నట్లు కమిటీ గుర్తించింది.. అధికారులను చూసిన వెంటనే ఉలిక్కి పడ్డ సిబ్బంది బ్లాస్టింగ్ కోసం వినియోగించే వైర్లను కాల్చే ప్రయత్నం చేశారని అధీకారులు పేర్కొన్నారు.. మైనింగ్ లో పని చేస్తున్న సిబ్బంది మైనర్ల మేజర్ల అనేది కూడా పరిశీలిస్తామని తెలిపారు.. అంతే కాకుండా గ్రామస్థులను అడిగి వారి సమస్యలను తెలుసుకొని నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న క్రషర్లపై చర్యలు తీసుకుంటాం అని ఆర్డీఓ రవీందర్ రెడ్డి స్పష్టం చేశారు..
మధుసూదన్ రెడ్డి పై పిర్యాదు చేసిన తహశీల్దార్
కేసు నమోదు చేసిన పోలీసులు
పటాన్ చెరువు తహశీల్దార్ సి.భాస్కర్ లక్డారం గ్రామ శివారు సర్వే నెంబర్ 738 ప్రభుత్వ భూమిలో చేస్తున్న అక్రమ మైనింగ్ పైన తేది :- 27-01-2024 రోజున స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు..తహశీల్దార్ పిర్యాదు మేరకు పోలీస్ అధికారులు సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్ సప్లై కంపెనీ యజమాని గూడెం మధుసూదన్ రెడ్డి పై కేసు నమోదు చేశారు..ఎఫ్. ఐ.అర్ నెంబర్ 97/2024 కలదు..ప్రస్తుతం మధుసూదన్ రెడ్డి అన్న గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరువు ఎమ్మెల్యే గా ఉండడం తో చర్యలు తీసుకుంటారా..?లేదా..? అన్నది వేచి చూడాల్సి ఉంది..