Monday, April 29, 2024

ఆత్మగౌరవ పోరాటానికి, అన్నిటికీ సిద్ధం..

తప్పక చదవండి

ఏ పార్టీ మన పోరాటాన్ని గుర్తించి టిక్కెట్‌ ఇస్తామని ఆహ్వానించినా ప్రజలే అధిష్టానంగా, ప్రజల సమస్యలే ఎజెండాగా ముందుకు పోతున్న తాను ప్రజలు అందరితో చర్చించి వారి అభీష్టానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటానని.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సబ్బండ వర్గాల ప్రజల ఆత్మగౌరవమే ప్రధాన ఎజెండాగా ఎన్నికల బరిలో నిలబడి కొట్లాడాలని నిర్ణయించుకున్నానని ఎన్‌ఎంఆర్‌ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు ముదిరాజ్‌ అన్నారు…

  • అనునిత్యం ప్రజల మధ్యనే ఉన్నా..
  • ప్రజల ఆదేశాల మేరకే పోటీ చేస్తున్నా..
  • మన పోరాటానికి, సేవకు మద్దతుగా పార్టీలు మనల్ని గుర్తిస్తాయి…
  • ప్రజల నిర్ణయమే శిరోధార్యంగా నిర్ణయం తీసుకుందాం..
  • వెల్లడిరచిన నీలం మధు ముదిరాజ్‌..
  • చిట్కుల్‌ గ్రామ వడ్డెర కాలనీల ప్రజలతో ఆత్మీయ సమ్మేళనం…

హైదరాబాద్‌ : గురువారం తన స్వగ్రామైన చిట్కుల్‌ లోని పలు కాలనీలలో గ్రామ ప్రజలతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి ఆశీస్సులు తీసుకున్నారు నీలం మధు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు రాజకీయ ఓనమాలు నేర్పి, రాజకీయంగా ఈ స్థాయికి తీసుకువచ్చిన నా కుటుంబ సభ్యుల లాంటి మీ అందరి ప్రేమ, ఆప్యాయతలు, సహకారం మర్చిపోలేనన్నారు. మీ ఇంట్లో బిడ్డగా తనకు గ్రామంలోని సమస్యలన్నీ తెలుసని, తాను సర్పంచ్‌ గా చాలా సమస్యలను పరిష్కరించానని అన్నారు. తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే, చిట్కుల్‌ గ్రామాన్ని మరింతగా అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. మీ ఇంట్లో బిడ్డగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్‌ చెరు నియోజకవర్గ ప్రజల అభీష్టం మేరకు బరిలో నిలబడుతున్నానని ఆయన స్పష్టం చేశారు. తనకు అనుక్షణం అండగా నిలబడుతూ.. తనను ఈ స్థాయికి తీసుకువచ్చిన మీ అందరి ఆదరాభిమానాలు ఆశీస్సులతో ముందడుగు వేయడానికి తన కుటుంబ సభ్యులైన మీ అందరితో సమావేశం అయ్యానని తెలిపారు. ఈనెల 16 నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా చేపడుతున్న పాదయాత్రకు ప్రజల ఆశీస్సులు, చల్లని దీవెనలు కావాలని విజ్ఞప్తి చేశారు. మీరిచ్చే ఆశీస్సులు కొండంత అండగా ముందడుగు వేస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల మద్దతు కూడగడదామన్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ, అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మన బహుజనులను అన్ని పార్టీలు విస్మరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా మనం వెనకడుగు వేయకుండా పోరాటం చేసి మన సత్తా నిరూపించుకొవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.మన బడుగు, బలహీన వర్గాలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం దొరికినప్పుడే మనందరికీ సమ న్యాయం జరుగుతుందన్నారు. ప్రజలే దేవుళ్లుగా, ప్రజల మాటే వేదంగా తీసుకుని అందరి అభిప్రాయాలను సేకరించి, పోరాటాన్ని ప్రారంభిస్తున్నానని స్పష్టం చేశారు. మన ఈ ధర్మ పోరాటాన్ని చూసి పార్టీలు తప్పక గుర్తిస్తాయనే నమ్మకం తనకు ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు వెంకటేశ్‌, రాజ్‌ కుమార్‌, మురళీ, మంజలి శ్రీనివాస్‌, శాంత్‌ కుమార్‌, పీట్ల లక్ష్మణ్‌, మంజలి యాదయ్య, ముద్దంగుల వెంకటేష్‌, బరంబస్‌, సుబ్బారావు, తాతారావు, మంజలి హనుమంతు, కాలనీవాసులు, ఎన్‌.ఎం.ఆర్‌. యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు