Tuesday, May 14, 2024

దేవాలయ భూములపై హక్కులు కల్పించండి

తప్పక చదవండి
  • అవేదన చెందుతున్న ఆ గ్రామాల ప్రజలు..
  • యాచారం మండలంలో పర్యటించిన కోదండ రామ్‌

ఇబ్రహీంపట్నం : యాచారం మండలంలోని నజ్దిక్‌ సింగారం రెవిన్యూ పరిధిలో 2500 ఎకరాల విస్తీర్ణం గల దేవాలయ భూములపై నాలుగు తరాల నుంచి సాగులో ఉన్న కురుమిద్ద, తాటిపర్తి, సింగారం రైతులు భూముల పైన ఉండే వివాదాల పరిష్కారం దిశగా పరిశీలించడానికి తెలంగాణ రాష్ట్ర పోరాట ఉద్యమ నేత, తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం శుక్రవారం భూములను పరిశీలించారు. 4 గ్రామాల రైతుల భూముల పైన స్వతంత్రానికి పూర్వం నుంచి సాగులో ఉన్నామని కోదండ రామ్‌ కి రైతులు తెలియచేశారు.

రైతులకు 1950 లో పిటి, 37, 36 టేనెంట్‌ అప్పటి ప్రభుత్వం మంజూరు చేశారనీ అన్నారు. కానీ రెవెన్యూ రికార్డులో1970 నుండి దేవాలయ భూమి మాకు తెలియకుండానే రికార్డులో నమోదు చేశారని వాపోయారు. రికార్డుల్లో ఉన్న దేవాలయ భూములనీ ఎలాంటి ప్రొసీడిరగ్స్‌ లేకుండా రాశారని దానిని తొలగించి మాకు పట్టా , హక్కులు కల్పించడానికి కృషి చేయాలని, ప్రభుత్వం కు సూచించాలని కోరారు. అనంతరం కోదండ రామ్‌ మాట్లాడుతూ… భూ సమస్య కొరకు రైతుల వద్ద ఉన్న హక్కు పత్రాలు మరియు వరుసగా ఒకే కుటుంబం నుండి 4 తరలుగా కబ్జాలో ఉండి సాగు చేస్తున్న రైతులకు న్యాయ కోసం పోరాటాలుచేస్తూ , న్యాయ స్థానం దృష్టికి తీసుకెళ్దాం అని తెలిపారు. కార్యక్రమంలో తాటిపర్తి సర్పంచ్‌ దూస రమేష్‌, కవుల సరస్వతి రైతులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు