Sunday, April 28, 2024

పట్నం వర్సెస్‌ పైలెట్‌..!

తప్పక చదవండి
  • బీఆర్‌ఎస్‌ పార్టీలో మళ్లీ వర్గపోరు
  • కుర్చీలు విసురుకున్న ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే
  • లోక్‌ సభ ఎన్నికల సన్నాహక సమావేశాలు
  • తెలంగాణ భవన్‌ వేదికగా గొడవ
  • మాజీ హరీష్‌ రావు ముందు ఘటన

హైదరాబాద్‌ : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్‌ రెడ్డి, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డిల మద్య వర్గపోరు మరోసారి బయటపడిరది. ఈసారి నియోజకవర్గంలో కాకుండా ఏకంగా తెలంగాణ భవన్‌లో బహిర్గతమైంది. రానున్న చేవెళ్ల లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో భారాస వర్గపోరు బయటపడిరది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, హరీష్‌ రావు మరికొంతమంది సీనియర్‌ నాయకుల అధ్యక్షతన జరుగుతున్న సమీక్షా సమావేశంలో తాండూరు నియోజకవర్గ నాయకుల మధ్య వివాదం చెలరేగింది. పట్నం మహేందర్‌ రెడ్డి మాట్లాడే సమయంలో రోహిత్‌ రెడ్డి వర్గం నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో ఎమ్మెల్సీ మహేందర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాల పరస్పర నినాదాలతో వాతావరణం వేడేక్కింది. ఇక పరస్పరం పట్నం మహేందర్‌ రెడ్డి, పైలెట్‌ రోహిత్‌ రెడ్డి కుర్చీలు సైతు కుర్చీలు విసురుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇరు వర్గాలకు మాజీ మంత్రి హరీష్‌ రావు సర్దిచెప్పారు. మహేందర్‌ రెడ్డి, రోహిత్‌ రెడ్డితో హరీష్‌ రావు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బహిరంగంగా సమీక్ష సమావేశంలో గొడవపడితే పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న హరీష్‌ రావు ఇద్దరు నేతలకు సర్ధి చెప్పినట్లు తెలిసింది. కాగా, మ్నెదట్నుంచి పైలట్‌, పట్నం మధ్య వర్గ విభేదాలు ఉన్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇద్దరు నేతలు కలిసిపోయారు. అప్పుడు సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న ఫైలట్‌కు మరోసారి టికెట్‌ ఇవ్వగా.. అసంతృప్తితో ఉన్న పట్నం మహేందర్‌ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దీంతో ఇద్దరు కలిసి ఎన్నికల్లో పని చేశారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోవటం, ఫైలట్‌ కూడా ఓటమిపాలవటంతో రెండు వర్గాల మధ్య మరోసారి వర్గ విభేదాలు మ్నెదలయ్యాయి. పట్నం వల్లే ఫైలట్‌ ఓడిపోయాడని.. రోహిత్‌ వర్గం చెబుతుండగా.. పట్నం మహేందర్‌ రెడ్డికి టికెట్‌ ఇస్తే గెలిచి ఉండేవారని ఆయన వర్గం వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎవరికి వారు విడిపోయి తెలంగాణ భవన్‌ సాక్షిగా నేడు గొడవపడ్డారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం తలెత్తింది. దీంతో మాజీ మంత్రి హరీశ్‌రావు కలగజేసుకొని ఇరువర్గాలకు సర్దిచెప్పారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు