Friday, May 3, 2024

జనం కోసమే ‘జర్నలిస్ట్‌’లు

తప్పక చదవండి

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిరంతరం ప్రజాశ్రేయ స్సుకై పరితపిస్తూ, ప్రజాస్వామ్య పరిరక్షణకు నాల్గవ స్థంభంగా నిలబడి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎందరో పాత్రికేయులు నిస్వార్థ సేవలను అందిస్తున్నారు. వారి నిజ జీవితంలో ఆర్థిక, సామాజిక సమస్యలతో, ఎన్నో ఒడిదుడుకుల నడుమ జీవిస్తూ, అతికష్టతరంగా వారి కుటుంబాలను పోషించుకుంటున్నారు. అలాంటి జర్నలిస్టులను కాపాడుకోవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఎంతైనా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరుగు తున్న అన్యాయాన్ని ఎదురిస్తూనిధులు, నీళ్లు, నియామకాలే లక్ష్యం గా జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెగేసి కొట్లాడిన వర్గాల్లో జర్నలిస్టులు కూడ ముందు వరుసలో ఉన్నా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించి, రెండు దఫాలుగా అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం జర్నలిస్టులను ఊరించుడే తప్ప చేసిందేమి లేదు. దీంతో ఆగ్రహించిన పాత్రికేయ లోకం సైతం బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ పతనాన్ని కోరుకున్నారు. ఎట్టకేలకు గత ఎన్ని కల్లో కారు బోల్తాపడి పాలన హస్తగతమైంది. అయితే జర్నలిస్టుల సమస్య అంతటితో తీరిపోయిందనుకుంటే అంతకంటే పొరపాటు మరోటి లేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో నైనా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అవుతాయా అనే సందేహం లేకపోలేదు.
మీడియా అకాడమి చైర్మెన్‌ నియామకం…?.. జర్నలిస్టుల క్షేమం, సంక్షేమ పథకాలు, చిన్న, మధ్య తరగతి మీడియా సంస్థలను కాపాడుకునేందుకు ‘ప్రెస్‌ అకాడమీ’ ఎంతగానో దోహదప డుతుంది. అలాంటి మహోన్నతమైన మీడియా అకాడమి చైర్మన్‌ పీఠం కైవసం చేసుకునేందుకు ఆర్థిక పలుకుబడి కలిగిన వ్యక్తులు, వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు, రాజకీయ అండదండలు కలిగిన నేతలు, కనీసం జర్నలిస్టుల సమస్యలు, భాదలు, ఏనాడు పాత్రికేయులతో తత్సంభం లేని తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు. చిన్న, మధ్యశ్రేణి జర్నలిస్టుల అవసరాలు, సంక్షేమం, వివిధ సమస్యలపై అవగాహణ కలిగి, జర్నలిస్‌ సంఘాలన్నింటికి అనుకూలంగా, అట్టడుగు స్థాయి వర్గాలకు చెందిన వ్యక్తులకే చైర్మన్‌ పీఠం కట్ట బెట్టాలని పలు జర్నలిస్ట్‌ సంఘాల నేతలు సిఎం రేవంత్‌ రెడ్డిని కోరుతున్నారు.
సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలి.. ప్రజలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాపాలన పథకంతో అందిస్తున్న ఆరుగ్యారెంటీల్లో జర్నలిస్టులకు ప్రత్యేక కోటను కేటాయించి, రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం మీడియా అకాడమీ ఆధ్వర్యంలో వర్కింగ్‌ జర్నలిస్టుల సౌకర్యార్ధం నూతన పథకాలకు శ్రీకారం చుట్టాలి. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో వర్కింగ్‌ జర్నలిస్టుల జాబితాను సేకరించి, ఇళ్ల స్థలాలు, డబుల్‌ బెడ్‌ రూం, ఆయా కేంద్రాల్లో ప్రెస్‌ క్లబ్‌ భవనాలు, ప్రతి నెల గౌరవ వేతనం, జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థల్లో ఉచిత విద్య, సబ్సిడి వాహనాలు, బ్యాంకులు, వివిధ కార్పోరేషన్‌ లలో ప్రభుత్వ చొరవతో రుణాలు, హెల్త్‌ కార్డులను పకడ్బందీగా అమలు చేస్తూ, బస్సు, రైళ్ల పాసులను మంజూరీ చేస్తూ, వయస్సు పైబడిన సీనియర్‌ జర్నలిస్టులకు ప్రతినెల ఫించన్‌ వంటి సౌకర్యాలు కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు