Monday, April 29, 2024

ఎన్నికల విభాగం సిబ్బందికి ముందస్తు శిక్షణ తరగతులు..

తప్పక చదవండి
  • జనగామ కలెక్టరేట్ సమావేశ మందిరంలో కార్యక్రమం.

జనగామ : మంగళవారం నాడు, కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ అధ్యక్షతన రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, అంచనాల వ్యయం, వీడియో సర్వే లైన్ సిస్టం, అనుమతుల మంజూరు, చెక్ పోస్టుల నిర్వహణ, తదితర అంశాలపై సంబంధిత ఎన్నికల విభాగం సిబ్బందికి ముందస్తు శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది..

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ మాట్లాడుతూ.. ఎన్నికల విభాగానికి సంబంధించి ప్రతి విభాగానికి ఒక నోడల్ అధికారిని నియమించి ఇప్పటికే పాలు ధాఫాల్లో శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందని అన్నారు.. జిల్లాలోని మాస్టర్ ట్రైనర్స్ ద్వారా సంబంధిత విభాగానికి సంబంధించి అనుసరించాల్సిన వ్యూహం, ఎన్నికల నిబంధనల ప్రకారం ఎలా విధులు నిర్వహించాలో చెక్ పోస్టుల నిర్వహణ, సీజింగ్, తదితర అంశాలపై సుదీర్ఘ శిక్షణ సమావేశం నిర్వహించారు.. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని విభాగాల సిబ్బంది సిద్దంగా ఉండాలని ఆయన ఆదేశించారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు