Thursday, May 2, 2024

ఆంధ్రప్రదేశ్‌లో పవన్‌ కు అడ్రస్‌ ఉండదు

తప్పక చదవండి
  • పక్క రాష్ట్రంలో శాశ్వత నివాసం
  • మోసాలు చేసేవారికి మద్దతు ఇవ్వడం సిగ్గుచేటు
  • పవన్‌ కల్యాణ్‌ పై జగన్‌ ఘాటు విమర్శలు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ భీమవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అరాచక శక్తులకు మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. దత్తపుత్రుడు పక్క రాష్ట్రంలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పవన్‌ కల్యాణ్‌ అడ్రస్‌ ఉండదన్నారు. చంద్రబాబు సీఎం అయితే చాలు అని అవే వేలకోట్లు రూపాయలని భావిస్తున్నారన్నారు. అసలు పొత్తులో ఎన్ని సీట్లు ఇచ్చినా అసలు సీట్లు ఇవ్వకపోయినా ఒప్పుకుంటాడన్నారు. మోసాలు చేస్తూ ప్రజలను దోచుకునేవారికి మద్దతు ఇవ్వడం సిగ్గుచేటు అని పవన్‌ కళ్యాణ్‌పై ధ్వజమెత్తారు. ప్రజలు కోసం త్యాగాలు చేసే నాయకులు ఉంటారు. అయితే ఈ దత్తపుత్రుడు ప్యాకేజీల కోసం తనను నమ్మకున్న వారిని త్యాగం చేసే రాజు పవన్‌ కల్యాణ్‌ అని పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఆడవాళ్లను ఆట వస్తువులుగా చూస్తూ పెళ్లి అనే పవిత్ర వ్యవస్థను నాశనం చేసిన వ్యక్తి పవన్‌ కళ్యాణ్‌ అని జగన్‌ విమర్శించారు. నాలుగేళ్లకొసారి పెళ్లి చేసుకోవడం తిరిగి వారికి విడాకులు ఇవ్వడం మళ్ళీ మరొకర్ని పెళ్ళి చేసుకోవడం అలవాటుగా మారిందన్నారు. కార్లను మార్చినంతా సులభంగా భార్యలను మార్చుతున్నా పవన్‌ కల్యాణ్‌ ఈ రాష్ట్రాన్ని సక్రమంగా పరిపాలిస్తారన్న నమ్మకం లేదన్నారు. ఇలాంటివారిని మనం నాయకులగా ఎన్నుకుంటే రాష్ట్రంలో ఆడపిల్లలు పరిస్థితి దారుణంగా ఉంటుందని విమర్శించారు. సమాజంలో ఇటువంటి వ్యక్తులను ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు అయితే భావితరాలు వారు వారిని స్ఫూర్తిగా తీసుకుంటే నేటి సంప్రదాయం కుటుంబం వ్యవస్థ నాశనం అవుతుందన్నారు. ప్యాకేజీలు కోసం తమ పార్టీ కార్యకర్తలను తాకట్టు పెడుతున్న ఈ దత్తపుత్రుడు రాజకీయాలు చేయడానికి అర్హత లేదన్నారు. నాయకత్వం, విశ్వసనీయత లేని వారిని ఎన్నుకుంటే ప్రజలకు మంచి జరగదు అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌ మెంట్‌లో భాగంగా 23-2024 విద్యా సంవత్సరంలో జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికానికి అర్హలైన 8,09,093 మంది విద్యార్థులకు రూ.584 కోట్లు రూపాయలను పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగిన కార్యక్రమంలొ సీఎం జగన్‌ బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు