Monday, April 29, 2024

ఆరెంజ్‌ క్యాప్‌ గెలవాలి..

తప్పక చదవండి
  • అత్యధిక సెంచరీలు చేయాలి..
  • గిల్‌ న్యూఈయర్‌ రెజల్యూషన్స్‌ ఫోటో వైరల్‌

కొత్త ఏడాది వచ్చిందంటే అందరూ ‘న్యూఈయర్‌ రెజల్యూషన్స్‌’ నిర్దేశించుకోవడం కొత్తేమీ కాదు. అయితే వీటిని కొనసాగిస్తూ లక్ష్యం దిశగా నడిచేవాళ్లు చాలా తక్కువమంది ఉంటారు. ఆరంభ శూరత్వంతో వాటిని నాలుగైదు రోజులు పాటించి తర్వాత మూలన పడేసేవారే ఎక్కువ. చిత్తశుద్ధితో ఏడాదిపాటు శ్రమించి ఫలితాలు సాధించేవాళ్లు చాలా తక్కువ ఉంటారు. కానీ టీమిండియా ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ మాత్రం ఆ దిశగా సక్సెస్‌ అయ్యాడు. ఈ ఏడాది (2023లో) అతడు పెట్టుకున్న టార్గెట్స్‌లో చాలావరకూ అచీవ్‌ చేశాడు. భారత్‌ తరఫున అత్యధిక సెంచరీలు చేయాలి.. ఐపీఎల్‌లో ఆరెంజ్‌ క్యాప్‌ నెగ్గాలి వరల్డ్‌ కప్‌ గెలవాలి.. అంటూ రెజల్యూషన్స్‌ పెట్టుకున్న నాటి ఫోటోను షేర్‌ చేశాడు.
ఈ మేరకు గిల్‌ తాజాగా తన ఇన్‌స్టా ఖాతాలో ఒక పేపర్‌ మీద తన చేతిరాతతో రాసుకున్న 2023 రెజల్యూషన్స్‌ ను షేర్‌ చేశాడు. అందులో ‘మోస్ట్‌ హండ్రెడ్‌ ఫర్‌ ఇండియా.. నా కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలి.. వరల్డ్‌ కప్‌.. ఆరెంజ్‌ క్యాప్‌..‘అని రాసుకున్నాడు. గిల్‌ రెజల్యూషన్స్‌ పెట్టుకున్న వాటిలో చాలా మట్టుకు సాధించాడు. 2023 ఐపీఎల్‌లో ఆరెంజ్‌ క్యాప్‌ గెలిచింది ఈ యువ ఓపెనరే కావడం విశేషం.
అంతేగాక భారత్‌ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన వారి జాబితాలో కూడా గిల్‌ ముందువరుసలోనే ఉన్నాడు. వన్డేలలో గిల్‌ ఐదు శతకాలు సాధించాడు. ఇందులో ఓ డబుల్‌ సెంచరీ (కివీస్‌పై) కూడా ఉంది. వన్డేలలో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో కోహ్లీ (6) ముందున్నాడు. గిల్‌.. వన్డేలతో పాటు టీ20లలో ఒకటి, టెస్టులలోనూ ఓ సెంచరీ చేశాడు. మూడు ఫార్మాట్లలో కలిపి ఈ ఏడాది గిల్‌ ఏడు సెంచరీలు చేయగా కోహ్లీ 8 సెంచరీలు సాధించాడు. మొత్తంగా ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్ల జాబితాలో మాత్రం గిల్‌ ముందున్నాడు. ఈ ఏడాది గిల్‌.. 2,154 పరుగులు చేశాడు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు