Friday, May 17, 2024

ఒకరిద్దరు చెప్తే సీఎం కాను

తప్పక చదవండి
  • కరీంనగర్ ఆత్మగౌరవాన్ని దారుస్సలాంకు తాకట్టు పెట్టిన్రు
  • ఓట్ల కోసం జెండాలు మార్చే దుర్మార్గులకు గుణపాఠం చెప్పండి
  • బీసీ కమిషన్ ఏర్పాటు చేసిన ఘనత మోదీదే
  • ప్రధాని నరేంద్ర మోడీ సభను విజయవంతం చేయాలి
  • బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్ ఆస్తులు స్వాధీనం
  • మేడిగడ్డకు వచ్చే దమ్ముందా? నిపుణులను తీసుకొస్తా
  • కేసీఆర్, కేటీఆర్ లకు బండి సంజయ్ సవాల్

కరీంనగర్ : బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు బీసీలను చిన్న చూపు చూస్తున్నాయని, జనాభాలో అధిక శాతం ఉన్న వర్గాన్ని అణచి వేయాలని చూస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. బీసీలనే సీఎం చేస్తామని బీజేపీ ఇప్పటికే ప్రకటించిందని తెలిపారు. అంతేకాకుండా 50 శాతం టిక్కెట్లను బీసీలకే కేటాయించినట్టు తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని సీఎం చేస్తామన్నామని.. బీఆర్‌ఎస్‌ , కాంగ్రెస్‌ పార్టీలు బీసీ నేతను సీఎంగా ప్రకటించే దమ్ముందా..? అంటూ బండి సంజయ్‌ ప్రశ్నించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హైదరాబాద్ లో జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభను విజయవంతం చేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలు బీసీ ఆత్మగౌరవ సభలను విజయవంతం చేయాలని కోరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ పార్టీలు బీసీలకు క్షమాపణ చెప్పాలి.. ఆ రెండు పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయంటూ ఫైర్ అయ్యారు. నేడు కరీంనగర్ అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్నానని బండి సంజయ్ తెలిపారు. బీసీలకు బీజేపీతోనే న్యాయం జరుగుతుందని ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. బీసీ సీఎం అని బీజేపీ ప్రకటించిన తరుణంలో ముఖ్యమంత్రి అవుతారా..? అన్న ప్రశ్నకు బండి సంజయ్ స్పందించారు. ఒకరిద్దరు చెప్పినంత మాత్రాన తాను సీఎంను కాలేనని, సీఎం పదవిపై మోజు లేదని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఎమ్మెల్యేలు , పార్టీ హైకమాండ్‌ సీఎం అభ్యర్ధిని డిసైడ్‌ చేస్తారని అన్నారు.

కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు యావత్ తెలంగాణ భవిష్యత్తును నిర్దేశించబోతున్నాయని సంజయ్ కుమార్ అన్నారు . ఓట్ల కోసం కరీంనగర్ ఆత్మగౌరవాన్ని దారుస్సలాంకు తాకట్టుపెట్టిన బీఆర్ఎస్ కావాలా? కేసీఆర్ దుర్మార్గపు పాలనపై పోరాడుతూ కరీంనగర్ ఆత్మగౌరవాన్ని దేశానికి చాటిచెప్పిన బీజేపీ అభ్యర్ధి కావాలా? ఆలోచించి ఓటేయాలని కోరారు. ప్రజల బతుకులు మారాలని, పేదల రాజ్యం రావాలని కంటిమీద కునుకు లేకుండా పోరాటం చేస్తున్న మీ బిడ్డకు అండగా ఉండాలని కోరారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే పేదల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, కరీంనగర్ రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు.

- Advertisement -

ఆదివారం సప్తగిరి కాలనీలోని మాచర్ల ఫంక్షన్ హాలులో జరిగిన బీజేపీ కరీంనగర్ అసెంబ్లీ నియోకజవర్గ సౌత్, సెంట్రల్ జోన్ నాయకులు, పోలింగ్ బూత్ అధ్యక్షులు, కార్యకర్తల విస్త్రతస్థాయి సమావేశంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఓట్ల కోసం దారుస్సలాంపోయి కరీంనగర్ ప్రజల ఆత్మగౌరవాన్ని ఒవైసీకి తాకట్టు పెట్టిండు. పొరపాటున మళ్లీ ఆయనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కార్పొరేషన్ ఎన్నికల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పై ఎంఐఎం జెండాను ఎగరేసే ప్రమాదం ఉందన్నారు. అదే జరిగితే కరీంనగర్ ప్రజలు బొట్టుపెట్టుకుని, కంకణం కట్టుకుని తిరిగే అవకాశం కూడా ఉండదని హెచ్చరించారు. కరీంనగర్ ఆత్మగౌరవాన్ని ఒవైసీకి తాకట్టుపెట్టిన నేతలకు బుద్ది చెప్పాలని కోరుతున్నా. అట్లాగే బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అంతకుముందు నగరంలోని 11, 32, డివిజన్లకు చెందిన వేణు, విజయ్, సాయి చరణ్, రామ్మోహన్, రాకేశ్, రాజేశ్, ఫయాజ్, మల్లేశం, నర్సయ్య, రమేశ్, మందసాయి చరణ్, సాయి, చింటూ, సన్నీ చరణ్ సహా భారీ ఎత్తున యువకులు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. వారందరికీ బండి సంజయ్ కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కు బండి సంజయ్ సవాల్ విసిరారు. మేడిగడ్డ కుంగుబాటుపై వాస్తవ నివేదిక ఇచ్చిన కేంద్ర బృందంపై అవాకులు చవాకులు పేలుతున్న కేటీఆర్, తన తండ్రి కేసీఆర్ ను తీసుకొస్తే వాస్తవాలు నిరూపిస్తామని అన్నారు. ‘డేట్, టైం ఫిక్స్ చెయ్. ఇరిగేషన్ నిపుణులతో కలిసి మేడిగడ్డకు వస్తా. మీ అయ్యను తీసుకురా. మేం వాస్తవాన్ని నిరూపిస్తాం. ప్రజలకు వాస్తవాలు బయటపెడదాం. మీ అయ్యను తీసుకొచ్చే దమ్ముందా.?’ అంటూ సవాల్ విసిరారు. బీజేపీ అధికారంలోకి రాగానే కాళేశ్వరం కోసం పెట్టిన లక్షా 30 వేల కోట్లను కేసీఆర్ కుటుంబం నుంచి వసూలు చేస్తాం. కేసీఆర్ కుటుంబ ఆస్తులన్నీ జప్తు చేస్తాం. అని స్పష్టం చేశారు.

మోదీ సభకు భారీగా తరలిరండి
అంతకుముందు బండి సంజయ్ నగరంలోని శుభమంగళ్ గార్డెన్స్ లో ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాల ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈనెల 7న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరగబోయే బీసీల ఆత్మగౌరవ సభకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వస్తున్న నేపథ్యంలో జన సమీకరణ, సభ ఏర్పాట్లపై చర్చించారు. ఈ మూడు జిల్లాల నుండి భారీ ఎత్తున ప్రజలను సమీకరించాలని, ముఖ్యంగా బీసీలు భారీ సంఖ్యలో వచ్చేలా ఏర్పాట్లు చేయాలని కోరారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు