Monday, May 6, 2024

మిజోరం, ఛత్తీస్‌? గఢ్‌? లో ముగిసిన ఓటింగ్‌

తప్పక చదవండి
  • 77శాతం పోలింగ్‌ నమోదు

మిజోరం : ఈశాన్య రాష్ట్రం మిజోరం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా సాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే ఓటర్లు ఆసక్తి చూపారు. ఫలితంగా రికార్డ్‌ స్థాయిలో 77 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇంకా కొన్ని పోలింగ్‌ బూతుల నుంచి వివరాలు అందలేదని.. వాటిని పరిగణలోకి తీసుకుంటే సుమారు 80 శాతం దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అంతకుముందు మిజోరం సీఎం జోరంథంగా అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈవీఎం సమస్య కారణంగా ఆయన తొలిసారి అయిజోల్‌ నార్త్‌?-2 పోలింగ్‌ కేంద్రానికి ఎన్నికల కేంద్రానికి వచ్చి ఓటు వేయలేక వెనుతిరిగారు. తర్వాత అల్పాహారం తినడానికి వెళ్లి.. 11 గంటల సమయంలో మళ్లీ పోలింగ్‌ కేంద్రానికి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిజోరం గవర్నర్‌ కంభంపాటి హరిబాబు ఆ రాష్ట్ర ఎన్నికల్లో ఓటేశారు. అయిజోల్‌?లోని సౌత్‌-2 పోలింగ్‌ స్టేషన్‌?లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటేసిన ముఖ్యమంత్రి జోరంథంగా ఓటేసిన 101 ఏళ్ల వృద్ధుడు, 96 ఏళ్ల దివ్యాంగుడు ఓ శతాధిక వృద్ధుడు తన భార్యతో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. చంపాయి దక్షిణ నియోజకవర్గానికి చెందిన 101 ఏళ్ల వయసున్న పు రౌలనుదల.. 86 ఏళ్ల తన భార్యతో వచ్చి ఓటు వేశారు. వీరే కాకుండా 96 ఏళ్ల దివ్యాంగుడు అయిజాల్‌?లోని తన పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిజోరంలో మొత్తం 40 స్థానాలకు ఓటింగ్‌ జరిగింది. మొత్తం 12 వందల 76 పోలింగ్‌ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల నేపథ్యంలో బంగ్లాదేశ్‌, మయన్మార్‌తో మిజోరం పంచుకుంటున్న సరిహద్దుల వెంబడి.. పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. మణిపుర్‌, అసోం, త్రిపుర రాష్ట్రాల.. సరిహద్దులను మూసివేశారు. ఈ ఎన్నికల్లో 174 మంది అభ్యర్థుల తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. అధికార మిజో నేషనల్‌ ఫ్రంట్‌.. ఈ ఎన్నికల్లో గెలిచి మరోసారి పాలన సాగించాలని భావిస్తోంది. మరోవైపు.. జొరాం పీపుల్స్‌ మూమెంట్‌, బీజేపీ, కాంగ్రెస్‌.. అధికార పార్టీని గద్దెదించాలని ప్రయత్నిస్తున్నాయి. 2018లో జరిగిన ఎన్నికల్లో మిజో నేషనల్‌ ఫ్రంట్‌ 26 సీట్లు సాధించింది. కాంగ్రెస్‌?కు 5, బీజేపీకి ఒక సీటు దక్కింది. ఛత్తీస్‌గఢ్‌లోని పలు నియోజకవర్గాలకు మంగళవారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. 20 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో 12 స్థానాలు.. బస్తర్‌ డివిజన్‌లో ఉన్నాయి. వీటిలో సమస్యాత్మక అంతగఢ్‌, భానుప్రతాపుర్‌, కంకేర్‌, కేష్‌కల్‌, కొండగావ్‌, నారాయణపుర్‌, దంతెవాడ, బీజాపూర్‌, కొంటా స్థానాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌?.. మధ్యాహ్నం 3 గంటల వరకు జరగనుంది. బస్తర్‌, జగదల్‌పుర్‌, చిత్రకోట్‌లలో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు ఓటింగ్‌ జరగనుంది. 20 స్థానాల్లో మొత్తం 223 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 40 లక్షల మంది ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు