Friday, May 17, 2024

మంత్రి హరీష్ రావు నోటి దూల

తప్పక చదవండి
  • హరీష్ ప్రసంగంతో ఆగిన రైతుబంధు
  • కర్ణుడు సావుకు సవా లక్ష కారణాలు అన్నట్టు రైతుల(బంధు)కు నిరాశ
  • కలిసొచ్చే అవకాశాన్ని చేజార్చుకున్న బీఆర్ఎస్
  • హరీష్ రావు మాటల్లో మర్మం ఏమైనా దాగి ఉందా
  • ఎన్నికల కోడ్ ఉల్లంఘనతో నిధులకు బ్రేక్

హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న వేళ నాయకులు ఎన్నికల నిబంధనలను పాటించాలి. కానీ అందుకు విరుద్ధంగా బిఆర్ఎస్ స్టార్ క్యాంపియన్ మంత్రి అయినా తన్నీరు హరీష్ రావు సిద్దిపేట జిల్లాలో ప్రచార నిర్వహిస్తున్న సందర్భంగా ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతున్నప్పటికీని ఎన్నికల సంఘం మాత్రం రైతుబంధు వేయడానికి ఒప్పుకుంది. ఈనెల 26న పాలకుర్తిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీష్ .. మంగళవారం రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని చెప్పారు. ఉదయాన్నే టీ తాగే లోపు ఫోన్లలో డబ్బులు పడతాయన్నారు. అందుకు రైతులు తయారుగా ఉండాలన్నారు. రైతుబంధు ఇచ్చిన కేసీఆర్‌ను ఎవరూ మర్చిపోరంటూ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. అయితే.. ఈసీ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం రైతు బంధుకు సంబంధించి నేతలెవరూ పబ్లిసిటీ చేసుకోవద్దు. కానీ ఆ నిబంధనలు ఉల్లంఘించి రైతు బంధు డబ్బులు మంగళవారం రైతుల అకౌంట్లో పడతాయని హరీశ్ రావు ఎన్నికల ప్రచార సభలో వెల్లడించారు. హరీశ్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు నిబంధనలను, ఎన్నికల కోడ్ ఉల్లంఘించడమేనని ఈసీ స్పష్టం చేసింది. ఈవిషయాన్ని బహిరంగ వేదికపై మాట్లాడడం ఆయన నోటి దూల గా భావించి ఎన్నికల సంఘం సోమవారం రైతుబంధు వేయడాన్నినిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టిందని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఒక మంత్రిగా తనకు ఈమాత్రం ఇంగితం లేదా అంటూ ప్రజలు అనుకుంటున్నారు.

ఎన్నో ఎన్నికల్లో పాల్గొన్న హరీష్ రావుకు ఎన్నికల నిబంధనలు పాటించాలన్న సంస్కారం లేకుండా పోయిందా! రైతుల నోట్లు మట్టి కొట్టడమే బిఆర్ఎస్ పనా అమ్మ పెట్టదు అడుక్కొనివ్వదు అన్నట్లు హరీష్ రావు వ్యవహరించాడని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనపై దుమ్మెత్తి పోస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులకు ప్రజల పట్ల ప్రేమ ఏ పాటి దో అర్థమైందని ఇలాంటి నాయకులను మళ్లీ గెలిపించాలా వారికి పదవుల మీద ఉన్న వ్యామోహం ప్రజల మీద లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత రాష్ట్ర సమితి అంటేనే అసహ్యించుకుంటున్నారు.

- Advertisement -

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించరాదు

ఎన్నికల సమయంలో ప్రచారంలో భాగంగా అభ్యర్థులు, నాయకులు కానీ ఎన్నికల నిబంధనలు ఉ ల్లంగించరాదని అందుకు విరుద్ధంగా మాట్లాడడం ఎన్నికల సంఘం నేరంగా పరిగణిస్తుంది.ఎలక్షన్ కమిషన్ నియమావళి ప్రకారంగా ఎవరైనాఎలాంటి కిట్లు, వస్తువులు, డబ్బు, మరి ఇతర ఎ రకమైన తాయిలాలను పంచడానికి వీలుండదని ప్రజా సమావేశాల్లో వాటిని ప్రచారం చేయకూడదని డబ్బు పరంగా ఓటర్లను ఆకర్షించడం కూడా ఎన్నికల సంఘం నేరంగా పరిగణిస్తుందని ఈసీ పేర్కొంది.

కర్ణుడు సావుకు సవాలక్ష కారణాలు రైతుబంధు ఆగడానికి బిఅర్ఎస్ కారణం

మహాభారతంలో కర్ణుడి సావుకు సవాలక్ష కారణాలు అయినట్లు తెలంగాణ లో రైతుబంధు ఆగిపోవడానికి బి ఆర్ ఎస్ కారణమంటూ ప్రజలు అంటున్నారు. హరీష్ రావు మాట్లాడిన తీరుతో ఎన్నికల కమిషన్ రైతుబంధు పై వేటు వేసింది. హరీష్ రావు మాటల వెనక రైతులపై ప్రేమ ఉందా లేదా ఏదైనా మర్మం దా గి ఉందా అనే కోణంలో ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుపై రైతుల్లో ఒక రకమైన అసంతృప్తి ఉంది అందుకు భిన్నంగా ప్రజలు బిఆర్ఎస్ పట్ల కోపంగా ఉన్నారు ఇప్పుడు హరీష్ రావు మాటలు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా తయారయింది. ఏది ఏమైనా వారి గొయ్యి వారే తీసుకున్నట్లు ఉంది.

ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకే రైతుబంధు నిలుపుదల ఈసీ

తెలంగాణ ప్రభుత్వం కోరిక మేరకు లెటర్ నెంబర్ 6088/agri_11(1) 2023 18/11/ 2023 తేదీ ద్వారా పేర్కొన్న షరతులకు అనుగుణంగా కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియలో ఎం సి సి కాలంలో 24 నవంబర్ 2023 నుండి రభి సీజన్ కు సంబంధించిన రైతుబంధు సహాయాన్ని అందజేయాలని ప్రతిపాదించినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. అయితే రాష్ట్ర ఆర్థిక, వైద్య , కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఎన్నికల సమావేశాల్లో చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని రైతుబంధు అనుమతుల రద్దును కోరుతూ ఎన్నికల కమిషన్ న్యూఢిల్లీ వారు 27 నవంబర్ 2023 నాడు లెటర్ నెంబర్ 437/TEL-LA/sou 3/2023 నవంబర్ 27 /2023 ద్వారా మంజూరు చేసిన అనుమతులను ఉపసంహరించుకోవాలని ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ హైదరాబాద్ గారికి ఆదేశాలు జారీ చేయడమైనది.ఇందుకు కారణం హరీష్ రావు వ్యాఖ్యలు అని ఎలక్షన్ కమిషన్ పేర్కొంది ఆయన బాహాటంగా ప్రచారం చేయడం ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధమని కేవలం ప్రచారంలో భాగంగా మంత్రి చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని రైతుబంధును నిలిపివేసినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు