Thursday, May 16, 2024

అవకాశమివ్వండి.. అభివృద్ధికి నాది భరోసా..

తప్పక చదవండి
  • కుట్రలతో మోసం చేసిన పార్టీలకు బుద్ధి చెప్పండి..
  • అందరికి అండగా నీలం మధు అన్న భరోసా
  • వ్యవసాయ, ఆరోగ్యం, ఆడపడుచులు,విద్యార్థులు..
  • యువత, నిరుద్యోగులు, మౌళిక సదుపాయాలు..
  • వృద్దులు, వికలాంగులు, కార్మికులు, నిరుపేదలకు పెద్దపీట
  • బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి నీలం మధు ముదిరాజ్..

ప్రజలే నా వసుధైక కుటుంబమని ఎమ్మెల్యేగా నేను గెలిస్తే నా కుటుంబ సభ్యుల్లాంటి మీరంతా గెలిచినట్లేనని, మన పాలన కోసం మన ఓట్లు మనమే వేసుకుందామని పటాన్ చెరు బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ పిలుపునిచ్చారు. ఇంద్రేషంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో గ్రామానికి చెందిన యువత మహిళలు ప్రజలు భారీ ఎత్తున్నపాల్గొన్నారు.

ఈ సందర్భం గా నీలం మధు ముదిరాజ్ గారు మాట్లాడుతూ పటాన్ చెరు నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రవేశ పెట్టిన నీలం మధు అన్న పది భరోసాలతో అన్ని వర్గాల ప్రజల అభివృధితో పాటు మన నియోజకవర్గాన్ని దేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతా అని హామీ ఇచ్చారు. ఈ నెల 30వ తారీఖున జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు సీరియల్ నెంబర్ 5 ఏనుగు గుర్తుకు ఓటు వేసి మీ బిడ్డని ఆశీర్వదించాలని అభ్యర్థించారు. బడుగుల జీవితాల్లో వెలుగులని నింపుతూ మన బహుజనుల ఆత్మగౌరవాన్ని కాపాడాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతున్నానని అన్నారు. మనల్ని కొందరు నాయకులు కేవలం ఓటు బ్యాంకు గా మాత్రమే చూస్తూ మన ఆత్మ గౌరవాన్ని నోట్ల కట్టాలతో కొనాలని చూస్తున్నారని ఆరోపించారు. అయితే నోట్లతో మా బహుజన సబ్బండ వర్గాల ఆత్మగౌరవాన్ని కొనడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. మనం ఒక్కటిగా పోరాడి చట్ట సభల్లో ప్రవేశిస్తే మనలో నుంచి చాలా మంది మన ప్రాంతాలలో అన్ని స్థాయిల్లో మన బహుజన బిడ్డలు నాయకులుగా ఎదిగే అవకాశం లభిస్తుందని తెలిపారు. మనం ఎదిగితే మన ప్రాంతల్ని మనమే అన్ని రంగాల్లో ధీటుగా అభివృద్ధి చేసుకోవచ్చని పిలుపునిచ్చారు. మన అభివృద్ధి కోసం ఒక్క సారి నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని ప్రజలని కోరారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన క్షణం నుంచి ఈ ప్రాంత అభివృద్దికి పని చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పి పార్టీ నాయకులు, ఎన్ఏంఆర్ యువసేన సభ్యులు, నీలం మధు ముదిరాజ్ అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు
బచ్చుగూడ గ్రామంలో
బచ్చుగూడ గ్రామంలో నీలం మధు మాట్లాడుతూ పిల్లల స్కూల్ కోసం మీరు ఇబ్బంది పడుతున్న విషయం తెలుసు. గెలిచిన వెంటనే మొదటగా అదే పరిష్కరిస్తా అని హామీ ఇచ్చారు. అలాగే నీలం మధు అన్న పది భరోసాలతో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధితో పాటు పటాన్చెరు నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతా అని అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు