Tuesday, April 30, 2024

విద్యాశాఖలో అక్రమ దందా..!

తప్పక చదవండి
  • ఓడీ, రి లొకేషన్స్ పేరుతో యవ్వారం
  • కోట్లలో వ్యాపారం.. 3 ఏళ్లలో 703 అక్రమ ఓడీ, రి లోకేషన్స్
  • ఒక్కో ఓడీకి రూ.లక్ష వసూల్
  • రిలోకేషన్ పేరుతో కాంట్రాక్ట్ లెక్చరర్ల కు వేధింపులు
  • హారాస్ మెంట్ భరించలేక పలువురు లెక్చరర్ల మృతి
  • అవినీతి యవ్వారాలన్నీ నవీన్ మిట్టల్ కనుసన్నల్లోనే జరిగిన వైనం
  • గ్రామీణ ప్రాంత విద్యార్థుల భవితవ్యాన్ని కాలరాస్తున్న ఉన్నతాధికారులు

ఆదాబ్ హైదరాబాద్ : విద్యార్థులకు విద్యా..బుద్దులు నేర్పే శాఖలో అవినీతి రాజ్యమేలుతోంది. కంచె చేను మేసినట్లు హైయర్ ఎడ్యుకేషన్ లో ఉన్నతాధికారులే దొంగలుగా మారి…అందికాడికి దండుకున్నారు. కాదు..కూడదు..అంటే తమ తాబేదార్లు,కింద స్థాయి అధికారుల ద్వారా వేధింపులు తప్పవు. ఉద్యోగి చెప్పుకుంటే కంపెనీ ఇజ్జత్ పోయినట్లు అప్పటి విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టలే దొంగ అవతారమెత్తి అడ్డగోలు అవినీతికి తెర లేపడం శోచనీయం. ఆయన ఇచ్చిన సపోర్టుతోనే అక్రమార్కులు,కింద స్థాయి అధికారులు యధేచ్చగా రెచ్చిపోయి.. అందికాడికి దండుకొని అవసరమైన ఆమ్యామ్యాలను నవీన్ మిట్టల్ కు సమర్పించుకోవడం గమనార్హం.

అక్రమ ఓడీల్లో వసూళ్ల పర్వం
తెలంగాణ ఉన్నత విద్యాశాఖలో అక్రమ (ఓడీ)ఆన్ డ్యూటీల పర్వం కొనసాగుతోంది. రెగ్యులర్ అధ్యాపకులకు ఓడీల్లో అక్రమాల పర్వం కొనసాగుతోంది. రెగ్యులర్ అధ్యాపకుల ఓడీల పేరుతో రూ.కోట్లల్లో వ్యాపారం చేస్తున్నారు. కేవలం 3 సంవత్సరాల్లో 703 అక్రమ ఓడి, రిలొకేషన్స్ కు సంబంధించిన ఆర్డర్స్ ఉన్నత విద్యాశాఖ నుంచి జారీ కావడం గమనార్హం. ఇందుకోసం ఆర్డర్ ను బట్టి వసూల్ కొనసాగుతున్నాయి. ఒక్కో ఓడీకి రూ.లక్ష వరకూ వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. వాస్తవానికి ఓడీలు ఇవ్వడానికి వీలు లేదు. కానీ,ఉన్నత విద్యాశాఖలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నం. రెగ్యులర్ అసోసియేషన్ నాయకుల పుణ్యమా అని ఈ ఓడి తంతు అప్పటి కమిషనర్ నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలోనే అమల్లోకి వచ్చింది. ఈ ఓడీలతోనే కొందరు కోట్లకు పడగలెత్తినట్లు సమాచారం. కోరుకున్న చోట కోరుకున్న కళాశాలలో పోస్టింగ్ కోసం రెగ్యులర్ లెక్చరర్ల నుంచి రూ.లక్షలు వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ రొక్కం ముట్టజెప్పని వారిని అంతరాష్ట్ర బోర్డర్స్ కు బదిలీ చేసి వేధింపులకు పాల్పడడం గమనార్హం. వాస్తవానికి వర్క్ లోడ్ ఉన్న దగ్గర ఓడీలు వేయాల్సి ఉంటుంది. కానీ, వర్క్ లోడ్ లేకున్నా.. రెగ్యులర్ ఉద్యోగుల వద్ద రూ.లక్షలు దండుకొని ఆర్డర్ కాపీలు ఇవ్వడం గమ్మత్తుగా ఉంది.

- Advertisement -

రిలోకేషన్ పేరుతో వేధింపులు
ఉన్నత విద్యాశాఖలో ఓడీల పరిస్థితి అలా ఉంటే.. మరోవైపు కాంట్రాక్ట్ అధ్యాపకులతో రిలోకేషన్ దందా నడపడం గమనార్హం. రిలోకేషన్ పేరుతో కాంట్రాక్ట్ లెక్చరర్ లను వేధించి డబ్బులు ఇవ్వకుంటే అర్ధరాత్రి ఆర్డర్లు ఇచ్చి వేధించిన సంఘటనలు విద్యాశాఖలో కోకొల్లలు. అలా వేధించడం వల్ల చాలా మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు అనారోగ్యం బారిన పడి మరణించారు. అయితే ఇలా చనిపోయిన ఒక లెక్చరర్ భార్యకు గుట్టు చప్పుడు కాకుండా దొడ్డి దారిలో కాంట్రాక్ట్ లెక్చరర్ జాబ్ ఇచ్చి సమస్య సద్దుమణిగేలా జాగ్రత్త పడడం విస్మయం కల్గిస్తోంది. అయితే అవినీతి జలగలు ఇంతలా ఉన్నత విద్యాశాఖలో రెచ్చిపోవడానికి కారణం అప్పటి కమిషనర్ నవీన్ మిట్టలేనని తెలుస్తోంది. ఆయన దండిగా ఆమ్యామ్యాలు అందడంతోనే ఇలాంటి యవ్వారాలకు ఒకే చెప్పేశారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు